Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
హరి కానోబా యను బొంబాయి పెద్దమనుష్యుడొకడు తనస్నేహితులవల్ల, బంధువులవల్ల బాబాలీల లనేకములు వినెను, కాని నమ్మలేదు. కారణమేమన అతనిది సంశయస్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలెనని యతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాగా యుండెను. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంతదూరమునుండి బాబాను చూచి బాబావద్దకు బోయి సాష్టాంగనమస్కారము చేయవలె ననుకొనెను. క్రొత్తచెప్పులెచ్చట నుంచవలెనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదుముందొక మూలన బెట్టి బాబా దర్శనమునకు బోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి, ఊదిని, ప్రసాదమును బాబాచేతి నుండి యందుకొని తిరిగివచ్చెను. మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పులకొరకు వెదకెను కాని నిష్ప్రయోజనమయ్యెను. చాలా చీకాకు పడుచు బసకు వచ్చెను.
అతడు స్నానము చేసి, పూజ చేసి, నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. కాని, తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను. భోజనానంతరము, చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తనవైపు వచ్చుట చూచెను.
ఆ కుర్రవాని చేతిలో నొక కర్రయుండెను. దాని చివరకు క్రొత్తచెప్పులజత వ్రేలాడుచుండెను. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చినవారితో అతడు బాబా తనను బంపెననియు, వీధిలో ‘హరీ కా బేటా, జరీ కా పేటా’ యని యరచుమనియు చెప్పెననెను. ఎవరయిన ఆ చెప్పులు తమవే యన్నచో నతని పేరు హరి యనియు, నతడు కానోబా కొడుకనియు, అతనితలపై జరీపాగా గలదా యను సంగతి పరీక్షించిన తరువాత చెప్పుల నిచ్చి వేయుమని చెప్పెననెను. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని, హరి కానోబా యాశ్చర్యానందములు పొందెను. కుర్రవానివద్దకు బోయి చెప్పులు తనవని రూఢి చేసెను. అతడు తన పేరు హరి యనియు, తాను కానోబా కుమారుడననియు తన తలపై ధరించు జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తిజెంది చెప్పుల నిచ్చివేసెను. హరి కానోబా మిక్కిలి యాశ్చర్యపడెను. తన జల్తారుపాగ యందరికి కనిపించవచ్చునుగాని, తన పేరు, తన తండ్రిపేరు బాబా కెట్లు దెలిసెను? అదియే షిరిడీకి మొదటిసారి తన రాక. అత డచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయమువల్ల నాతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగ నెరవేరెను, సంతోషముతో నింటికి పోయెను.
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333
Latest Miracles:
- గోవింద రాం రాం గోపాల హరి హరి … మహనీయులు – 2020 – జనవరి 13
- హరి ఓం తత్ సత్ …. మహనీయులు – 2020… సెప్టెంబరు 4
- తేలుకాటు
- వామన నార్వేకర్
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబది తొమ్మిదవ అధ్యాయము🌹….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments