Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఓం సాయి రామ్
నా పేరు లక్ష్మి ప్రసన్న,హైదరాబాద్.
వండిన పదార్దాలు రెట్టింపు అవ్వడం, అదీ ఊది ద్వారా మనం నేవాస్కర్ కథతో తెలుసుకున్నాము.
చదివినప్పుడు కాకుండా అదే మనకు సొంతంగా జరిగితే ఆ ఆనందం మాటలలో చెప్పలేనిది.
ఎందుకు అంటే చదవడం లేక వినడం కంటే అనుబూతి గొప్పది కదా.
11-7-2018 బుదవారం రోజున షిర్డీ నుండి పది రోజుల పాటు సేవ చేసి తిరుగు ప్రయాణం లో ఉన్న భక్తులు హైదరాబాద్ మీదుగా విజయనగరం వెళ్తున్నారు.
వారు మొత్తం 18 మంది వారిలో ఒక సాయి బందువు నాకు phone పరిచం ఆ అంకుల్ ని కలుద్దాము అనుకున్నా.
కానీ ఊరికే ఎలా వెళ్ళను అందుకే వారికి పులిహోర,పెరుగన్నం, తీసుకొని వెళ్లి ఇచ్చి మాట్లాడి వస్తే బాగుంటుంది అని అనుకున్నాను.
కానీ నేను ఒక 5 మందికి తప్పితే ఎక్కువ మందికి ఎప్పుడూ వండలేదు ఎన్ని రైస్ పెట్టాలి దానిలో ఎంత ,ఏమి వేయాలి అనేవి మాత్రం తెలియదు.
బాబా నే ఉన్నారుగా అనుకున్నా మొత్తం 11 గ్లాసుల రైస్ పోసాను అదీ రైస్ కుకర్ కి వచ్చే చిన్న గ్లాస్ దానితో వండాను మొత్తము అన్నము కలిపేటప్పుడు మాత్రం సరిపోదు అంత మందికి అని తెలుస్తుంది.
మళ్ళీ వండడానికి సమయం లేదు, నేను బాబా దగ్గరకు తీసుకునివెళ్ళి బాబా ముందు పెట్టి ఊది వేసి తాత మీరు దీనిని తిని అదే చెయ్యి పెట్టి అంతా కలపండి అప్పుడు దీనికి రుచి వస్తుంది. ఇది అందరికి సరిపడేలా చూడండి అని వేడుకున్నాను.
నేను ట్రైన్ దగ్గరకు వెళ్లి వాళ్ళను కలసి అందచేసాను. వారు మధ్యాహ్న సమయం లో నాకు కాల్ చేసి అందరికి సరిపోయింది అనీ, చాలా రుచిగా ఉంది అనీ చెప్పారు.
ఇది ఓకే అనిపించింది రాత్రికి కూడా ఉంది అనీ చెప్పారు. మరలా రాత్రి కి కాల్ చేసి TC కి కూడా పెట్టాము అనీ, ఇంకా ట్రైన్ లో బెడ్ షీట్స్ తెస్తారు కదా వాళ్ళు తిన్నారు అనీ చెప్పారు.
బాబోయ్ ఒక పూట కి సరిపోదు అంటే రెండు పూటలా ఇంత మంది తిన్నారు. ఇది అంతా ఆయన ప్రసాదమే.
అదీ అక్షయ పాత్ర లా తీస్తుంటే వస్తుంది తల్లీ అని వారు చెప్పారు.
తీవ్రముగా ప్రార్దించినచో యధాప్రకారం ఫలితమును బొందవచ్చునని యీ సంఘటనము తెలుపుచున్నది. (శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయము)
బాబా మీ ఋణం ఎలా తీర్చుకోగలం తండ్రి, నమ్మిన నీ భక్తులను మీరు అప్పుడు, ఇప్పుడు, ఒకేలా ప్రేమ చూపిస్తున్నారు.మేము మనుషులం కదా మారుతున్నాము.
ఓం సాయి రామ్.
Latest Miracles:
- సాయి ఊదితో రుచి మరియు రెట్టింపు అయిన ఆహారం.—Audio
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – 2. ఆహారం (5వ.భాగం)
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – 2. ఆహారం (3వ.భాగం)
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – 2. ఆహారం (2వ.భాగం)
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – 2. ఆహారం (4వ.భాగం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments