ఒకటి రెండు క్షణాలలొ కరెంటు వచ్చి, బాబాను నేను నమస్కరించగానే కరెంటు పోయినది…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-84-1111-కరెంటు పోయినది 3:54

శ్రీ సాయి భక్తకోటికి ప్రణామములతో బాబా నా యందు చూపిన దయ విశేషములను మీతో పంచుకుంటున్నాను.

నా పేరు జి రాధాకృష్ణారెడ్డి. వయస్సు 74 సంవ త్సరములు, మా నివాసము వెంకటేశ్వరపురం, నెల్లూరు.

నా చిన్ననాటి నుండియూ బాబాను నేను సేవించుకోనుచున్నాను.

నాకు సుమారు 14 సంవత్సరముల వయస్సులో రంగనాయకుల స్వామి తిరునాళ్ళలో బాబా యొక్క చిన్న మట్టి ప్రతిమను కొని మా పూజా మందిరములో వుంచి, బాబాను సేవించుకోన్నాను.

కాలక్రమేణా ఆ ప్రతిమ బాగా పాతదై ఆ తర్వాత కనుపించలేదు.

మా ఇంటికి సమీపములోని రాయజివిధిలో అప్పుడు  సాయిబాబా మందిరం ఉండినది.అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి బాబాను సేవించుకోనుచుండెడివాడను.

తర్వాత కాలక్రమేణ నాకు రైల్వేలో ఉద్యోగం వచ్చింది.

బేజవాడ డివిజినల్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేశాను.

నా పూజ పటములలో బాబా పటం తప్పనిసరిగా ఉండేది.

ఉద్యోగ విరమణానంతరం నెల్లూరులోని, మా స్వంత గృహములో ఇతర పటములతో పాటు బాబా పటం వుంచుకొని పూజించుకొనిడివాడెను.

కాలక్రమేణ నేను కొన్ని ఆర్దిక ఇబ్బందులకు గురై బాబాకు బాగా సన్నిహితుడనైనాను.

బాబా దివ్య చరణములే, నమ్ముకొని ప్రతి గురువారం బాబా సేవ చేసుకుంటున్నాను.

అప్పుడు బాబా నా యందు దయ చూపించిన సన్నీవెశములు మీకు వివరించెదను.

మా అత్తగారి ఊరు పాత బిట్రగుంట, అచ్చటికి సమీపంలో బాబా గుడి కొత్తగా కట్టినారు.

ఒక రోజు అచ్చటికి వెళ్ళినాను.పూజారిలేడు.గర్బగుడి మూసి ఉన్నది.

గర్బగుడి తలుపుల సంధులోంచి బాబాను దర్చించుకొందాము అంటే ఆ సమాయములో కరెంటు లెదు.

బాబా మిమ్మల్ని దర్చించుకొందాము అంటే కరెంటు లెదు అని అనుకుంటు భాదపడుతుంటే ఒకటి రెండు క్షణాలలొ కరెంటు వచ్చి, బాబాను నేను నమస్కరించగానే కరెంటు పోయినది.

ఇది కేవలం బాబా తమ దివ్య దర్శనం నాకు ఇచ్చుటకు చేసిన అద్భుతమేనని నా నమ్మకము.

మా కుటుంబము ఆర్దిక ఇబ్బందులలో మునిగి ఉన్నప్పుడు నేను పలుమార్లు బాబా పాదాలను ఆశ్రయించి, ఆ మహానుభావునికి పలుమార్లు మన స్పూర్తిగా మా కష్టాలను తొలగించమని అతిదీనంగా ప్రార్దించాను.

బాబాకు మా యందు దయకలిగి మా కష్టాలను తొలగించి మేము సుఖంగా ఏలోటు లేకుండా అయన పాదసేవలో శేష జీవితం నిశ్చింతగా గడుపునట్లు అనుగ్రహించారు.

బాబా ఆశ్రిత వత్సలుడు అడిగిన వెంటనే మన కోరికలను తీర్చు దయామయుడు.

బాబా నా యందు చూపిన కృపనూ, వారితో నాకు కలిగిన దివ్యనుభావములను మరొక్కసారి మీతో సద్గురులీల ద్వారా పంచుకొంటాను.

బాబా తన సూక్తులలో చెప్పినట్లు

“ద్వారకామాయి ప్రవేశమే సర్వ దుఖః పరిహారము” “నా భక్తుల ఇంట లేమి అను శబ్దమే పొడచూపదు”. శ్రీ సమర్ధ సద్గురు సాయి మహారాజ్ కు జయహో జయహో జయహో. స్వర్ణ సిం హసనాధీశా సాయి శరణు శరణు…. నవరత్న ఖచిత స్వర్ణ కిరీటదారీ సాయి శరణు శరణు.

సాయి పాదరేణువు
జి రాధకృష్ణారెడ్డి, నెల్లూరు

సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles