బాబా సాన్నిద్యంలో అక్షరాబ్యాసం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తురాలు:రజని

నివాసం:ఒంగోలు

సాయి బంధువులకి నమస్కారం. నా పేరు రజని. నాకు మొదటి నుండి బాబా అంటే ఇష్టం.

పెళ్ళైన తరువాత మా ఇంటికి దగ్గరలోనే సత్సంగం ఉండడంతో, సత్సంగాలకు వెళ్లడం బాబా, గురువుగారి (శరత్ బాబూజీ గారి) దర్శనాలు చేసుకోవడం అలవాటైంది.

గురువుగారిని మొదటిసారి చూసినప్పుడు ఆ పాదాలు తాకినప్పుడు నేను గురువుగారికి సంబంధించిన దాన్ని అనే భావన కలిగింది.

అప్పుడు మనసులో గురువు గారితో నేనేమైన నాకు వివాహం కావాలని పిల్లలు కావాలని అడిగానా? నాకెందుకు ఇన్ని సార్లు అబార్షన్  అయి నేను బాధపడాలి అనుకున్నాను.

గురువుగారు నవ్వుతు చాక్లెట్ ఇచ్చారు అప్పటి నుండి నాకు అబార్షన్ అవకుండా ఇద్దరు బాబులు పుట్టారు (సాయి నివాస్, సాయి శరత్).

ఒకరోజు ప్రశాంత్ అన్న తిరుపతిలో అమ్మగారి దర్శనం ఇచ్చారని చెబితే నేను మిస్ అయ్యానని బాధపడ్డాను.

ఎలాగైనా అక్షరాభ్యాసం శిరిడీలోనే గురువుగారి దగ్గర చేయించాలనుకున్నాను. కానీ శిరిడీ వెళ్ళినప్పుడు అక్షరాభ్యాసం లేదని చెప్పారు.

ఎన్ని రోజులైనా ఉండి చేయించుకోవాలి అనుకున్నాను. వెయిట్ చేశాను, కానీ అక్షరాభ్యాసం ఉందని  ఏమీ చెప్పలేదు.

మా బంధువులు ఇంకా ఎన్ని రోజులుంటావు అని అనడంతో, ఇలా కుదరదులే ఇంటికి వెళదాం అనుకుంటున్నప్పుడు అక్షరాభ్యాసం చేయించుకునేవాళ్ళు ఉంటె వచ్చి చేయించుకోవచ్చు అని చెప్పారు.

నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అవకాశం వచ్చినప్పుడు ఇద్దరికీ చేయించమని తెలిసిన వాళ్ళు చెప్పడంతో ఇద్దరికీ చేయించి, చాలా ఆనందంతో ఇంటికి వచ్చాను.

చాలా రోజుల తరువాత హైదరాబాద్ నుండి ఒంగోలుకి షిఫ్ట్ అయినప్పుడు మా అబ్బాయిలని సాయిబాబా సెంట్రల్ స్కూల్ లో  జాయిన్ చేయించాలని ఆలోచిస్తూ ముందు ఒకరిని జాయిన్ చేయాలి అనుకుంటున్నప్పుడు సాయి శరత్ కి ఆ స్కూల్ లో సీట్ వచ్చింది.

ఇప్పుడు తాను సాయిబాబా సెంట్రల్ స్కూల్ లో చదువుతున్నాడు. మనం అడిగినవన్నీ బాబా, గురువుగారు తీరుస్తారు కానీ ఏమి అడగాలి, ఎలా అడగాలి అని మనకే తెలిసి ఉండాలి అనిపిస్తుంటుంది.  

~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

  ***సాయిసూక్తి:

 

   “నా భక్తుల మనసు యెరిగి నేను ప్రవర్తిస్తుంటాను”.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles