Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-45-1025-ఉమాపతి దొరికాడు 4:24
సికింద్రాబాద్ కి చెందిన ఎస్.కాశీ విశ్వనాధన్ పది సంవత్సరాల కుమారుడు ఉమాపతి 1944, జనవరి 26వ తేదీ మద్యాహ్నం రెండుగంటలనుండీ కనుపడడంలేదు.
ఎంతగా వెతికినప్పటికీ ప్రయోజనం లేదు.
మరునాటి ఉదయానికల్లా పోలీసులకి తెలియజేయబడింది, నగరంలోని అన్ని ఆసుపత్రిలకీ తప్పిపోయిన పిల్లవాడి గురించిన సమాచారమందించబడింది.
తనకున్న ఆత్రుతలో విశ్వనాధన్ తన కుమారుడు తరచుగా అక్కడ తిరిగే మిలిటరీ ట్రక్కుల క్రింద పడి తన కొడుకు మరణీంచాడేమొ అని కూడా అనుకున్నాడు.
లేదా మరో విపత్కరమైన సంభావనమేమిటంటే తన కొడుకుని ఎవరైనా ఎత్తుకు పోయుండవచ్చని.
ఆతృతలో అతను సంప్రదించిన జ్యోతిష్యుడు మరియూ సాముద్రికుడూ కూడా కుర్రవాడు క్షేమంగానె వున్నాడన్నారు.
డిసెంబరు నెల 1940 నుండీ బాబా భక్తుడైన కాళీ విశ్వనాధన్ తన కొడుకుని గురించి బాబాని వేడుకున్నాడు.
పదమూడేళ్ల కాశీ పెద్దకొడుకు అంతక్రితం ఏడాదే టైఫాయిడ్ తో మరణించాడు.
కుర్రవాడు తప్పిపోయి ఆరో రోజులు గడిచిపోయాయి.
కాశీ బాబా ఫొటో ముందు నిలబడి ’నా ఖర్మ ఫలం వలన నాకు బిడ్డలు నిలవక పోవచ్చు.
నేను భరించుకుకోవడానికే ప్రయత్నిస్తాను. కానీ నిన్ను ఆరాధిస్తూ వున్నందువలననే నాకీ దురవస్థలన్నీ కలుగుతున్నాయని ఎవరో కొందరు ఆరోపిస్తూ వుంటే ఎలా భరించగలను?’ అని వాపోయాడు.
ఫిబ్రవరి ఒకటవ తేదీన బాబా ఫొటోముందు నిలబడి,
’నా కొడుకు దొరకనీ, దొరకకపోనీ, నాకు నువ్వు మరిన్ని కష్టాలు కలిగించనీ, ఇంతకన్నా దురదృష్టం నన్ను వెంటాడనీ, నేను శరణు వేడిన నీ దివ్య పాద పద్మములను ఒక్క అడుగు కూడా కదలను, నీ అభీష్టమే నెరవేరనీయి బాబా’
అని ఏడ్చాడు.
నాలుగు గంటలకి కాశీ ఒక స్వప్నాన్ని గాంచాడు.
అతని మాటల్లోనే ’పొడుగ్గా వుండి తెల్లబట్టలు ధరించిన ఫకీరొకాయన ఒక కుర్రవాడిని కొడుతూ ఈడ్చుకుంటూ నా దగ్గరకు వస్తున్నారు.
ఆ కుర్రవాడిని నా పక్కన కూర్చోబెట్టారు, కొన్ని మిఠాయిలిచ్చి తినిపించారు’. మరునాడు ఉదయం తన ఇంటినుండి బయటకు వస్తున్న కాశీకి తపాలా బంట్రోతు ఒక తంతి అందించాడు.
’ఉమాపతి ఇంటికి సుఖంగా చేరుకున్నాడు’ అని ఆ తంతిలొ వుంది.
ఆ తరువాత తెలిసిందేమిటంటే ఆ కుర్రవాడు కొన్నిరోజుల కోసం చెన్నయి వెళ్లిన తన తల్లిని వెతుక్కుంటూ ఇల్లువదిలి వెళ్లాడు.
అదృష్టవశాత్తూ అతను సరయిన రైలునే ఎక్కాడు. చెన్నయి చేరుకున్న అతనిని ఒక పోలీసు కానిస్టేబుల్ తప్పిపోయిన పిల్లవాడిగా తన అదుపులోనికి తీసికుని అతని బావమరిది ద్వారా హైదరాబాద్ చేర్చబడ్డాడు.
ఆశ్చర్యకరంగా ఇన్ని రోజులూ ఆ కుర్రాడు ఎవరో ఒకరు ఏదో ఒకటి పెడుతూ వుండడంతో ఆకలి అనుభవించలేదు.
మరింత ఆశ్చర్యకరంగా అతను సరయిన రైలు ఎక్కి చైన్నయికి చేరాడు, లేకపొతే ఏ ఢిల్లో యో చేరుకుని వుంటే పరిస్థితి ఇంకొకలా వుండేది.
మనందరం కూడా ఉమాపతి లాగే సద్గురు పాదపద్మములు అనే స్వంత ఇంటిని వదిలి అనవసరంగా అటూ ఇటూ తిరుగుతాము.
గురువుకి మనకి మనము హాని చేసికుంటున్నామన్న పరిస్థితి తెలుసు.
అందుకే మన కోరికలన్నిటినీ తీరుస్తారు లేదా మనకి కొన్ని కష్టాలు కలిగించి మనల్ని దరి జేరుస్తారు.
అప్పుడు మనలోని అజ్ఞానాన్ని తొలగించి తన పక్కన కూర్చుండబెట్టుకుని మనకి మిఠాయిలు తినిపిస్తారు.
సాయిసుధ సంపుటి 5, భాగము 4, సెప్టెంబరు 1944.
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com, csai@saimail.com.
whatsapp 7033779935, 9178265499
Voice call: 9437366086, 8270077374.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సద్గురు కృప – పునర్జన్మ. టి భాస్కర్ శిరిడీ–Audio
- రమ్య భవనం …..సాయి@366 మే 20….Audio
- మ్రొక్కు మరవకు …. మహనీయులు – 2020… మే 23
- షిరిడీయే కాశీ…..సాయి@366 ఏప్రిల్ 27….Audio
- వినాయక చవితి నాడు బాబా ఫోటో రూపంలో భక్తురాలి ఇంటికి వచ్చుట…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “ఉమాపతి దొరికాడు, మరియూ ఇంటికి తీసికొచ్చారు–Audio”
sarada
July 8, 2016 at 9:18 amLeela super Saibaba Chaganti gariki pranaamamulu
kishore Babu
July 8, 2016 at 9:35 amఈ లీలా ద్వారా మనకి వచ్చే కష్టాలు అన్ని మన కర్మల ద్వారానే వస్తాయని మనము గ్రహించాలి. అవి సాయి బాబా వారిని పూజించడం ద్వారా తగ్గుతాయని చెప్పవచ్చు. అదే బాబా వారి గ్రెస్ లేకపోతే ఆ పిల్లవాడు..ఏ ఢిల్లీ రైలు ఎక్కే వాడు…బాబా ని నమ్ముకోవడం ద్వారా నిరంతరము ఆయన దయ మన మీద పనిచేస్తుంది.సాయి బాబా వారికి ప్రణామములు.