నడిపించు నా నావ…..సాయి@366 ఆగస్టు 2…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


జలారాంబాపా ఉత్తర హిందూ దేశంలో ప్రసిద్ధి చెందిన భక్తుడు. నిరంతరంగా అన్నదానం చేస్తుండేవాడు. అనేక శక్తులను పొందాడయన.

అమర్‌చంద్‌ అనే వ్యాపారి సామానుతో ఓడలో ప్రయాణం చేస్తుండగా ఓడకు కన్నం పడింది. ఓడలోనికి నీరు ప్రవేశించింది. ఓడ మునిగిపోయే స్థితికి వచ్చింది.

అమర్‌చంద్‌ తనను, తన ఓడను కాపాడితే ఓడలో నున్న సన్న బియ్యాన్ని అన్నదానానికి పంపిస్తానని మొక్కుకున్నాడు జలారాంబాపాకు.

జలారాంబాపా మాట నిలబెట్టుకున్నాడు. అమర్‌చంద్‌ సాధువుల అన్న దానానికి సన్న బియ్యం ఎందుకు అని ఆలోచించి, బండ్ల మీద ముతక బియ్యం పంపాడు.

జలారాంబాపా ఆ ముతక బియ్యాన్ని స్వీకరించి ”మొక్కుకున్నది సన్న బియ్యమని పంపినవి ముతక బియ్యమని, సాధువులు ముతక బియ్యం తింటారని చెప్పండి.

సేఠ్‌గారితో ఇంకా ఓడ పైభాగంలో నా తలపాగా ఉండిపోయింది, దానిని పంపమని చెప్పండి” అని బండి వాళ్ళతో కబురు పెట్టాడు.

జలారాంబాపా మాటలకు పశ్చాత్తాపం చెంది వెంటనే సన్న బియ్యం పంపాడు అమర్‌చంద్‌.

జలారాంబాపా సమకాలికుడే సాయిబాబా.

అవి రుస్సో-జపనీస్‌ యుద్ధం జరుగుతున్న రోజులు. ఆ యుద్ధం 8 ఫిబ్రవరి 1904 నుండి 5 సెప్టెంబరు 1905 వరకు జరిగింది.

ఆ యుద్ధంలో కొన్ని నౌకలకు జహంగీర్‌ ఫ్రేంజీ దారూవాలా కెప్టెన్‌గా పని చేశాడు. ఆయన పార్శీ మతస్తు డు. ఆయన సాయి భక్తుడు.

ఎల్లప్పుడు సాయినాథుని ఫోటోను తనతో ఉంచుకునే వాడు. ఒకనాడు ఆయన నావలను శతృ వర్గం వారు ముంచేయబోతున్నారు.

ఇక ఆయనను, ఆయన నావలను కాపాడే నాథుడే లేడు. వెంటనే సాయినాథుడు జ్ఞప్తికి వచ్చి బాబా ఫోటోను తీసి తనను, తన నౌకలను కాపాడమని వేడు కున్నాడు.

ద్వారకామాయిలో ఆసీనుడైన సాయి ”హక్‌, హక్‌” అని తప్పట్లు కొట్టాడు. సాయి ధరించిన బట్టలు, సాయినాథుడు తడిసి పోయి, ద్వారకామాయి నీటితో నిండిపోయింది (ఒక వ్యక్తి ఆ నీటిని రుచి చూచి ఉప్పగా ఉన్నాయని చెప్పాడు).

అక్కడ సాయిబాబాను దారూవాల సముద్రంలో ఓడలను ఒడ్డుకు చేర్చుతుండగా చూశాడు. ఓడలను ఒడ్డుకు చేర్చాడు సాయి.

దారూవాలా ఆ ఆపదనుండి కాపాడినందుకు సాయికి కృతజ్ఞతలు చెబుతూ టెలిగ్రాం పంపాడు.

తరువాత షిరిడీకి వచ్చి రూ.2,200/- సాయికి అర్పించాడు. ఆ డబ్బును ద్వారకామాయి సభా మంటప నిర్మాణానికి ఉపయోగించారు.

నావనే కాదు, జీవిత నౌకలనే ఒడ్డుకు చేర్చగలడు సాయి!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles