శ్రీ షిరిడీ సాయిబాబా గారి మహాద్భుతలీలలు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


🙏🌹🌹సాయి బాబాసాయి బాబాసాయి బాబాసాయి బాబా🌹🌹🙏

శిరిడీలో – కలరాను  తగ్గించారు.

హేమాడ్ పంతుకు – సచ్చరిత్ర వ్రాయుటకు అనుమతి ఇచ్చారు.

హేమాడ్ పంత్ కు – “భోజనపాత్రలు ఎప్పుడు పూర్ణముగా యుండును.అవి ఎన్నటికి నిండుకొనవు” అన్నారు.

దాసగణుకు – గంగా, యమునలు చూపారు.

చాంద్ పాటీలుకు – గుఱ్ఱము జాడ తెలిపారు.

నీటితో –  దీపాలను వెలిగించారు.

గోపాల్ రావు గుండ్ కు – కొడుకును ప్రసాదించారు.

దామూ అన్నా కాసార్ కు – పుత్ర సంతానమును ప్రసాదించారు. 

కొలిమిలో పడిన బిడ్డను – బాబా చేతిని కొలిమిలోనికి దూర్చి రక్షించారు. 

భాగోజీకి – బాబా  సహవాసమును ప్రసాదించారు. 

ఖాపర్డే కుమారుని – ప్లేగువ్యాధిని తొలగించారు. (“నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడెదనో చూడుము! వారి కష్టములన్నియు నావే!” అన్నారు)

బాయజాబాయి –  సేవకు తగినట్లు అతని కుమారుని యంతో ఆదరించి ఉద్ధరించారు.

తాత్యాకు – తల్లి వలే  ప్రేమతో సంతకు వద్దని సలహా ఇచ్చారు.

శిరిడీలో – తుఫానును ఆపారు.

డాక్టరుకు – శ్రీరామునిగా దర్శనము ఇచ్చారు.

భీమాజీపాటీలు – క్షయవ్యాధిని నయము చేసారు.

బాలగణపతి – మలేరియాను తొలగించారు.

బాపూసాహెబు బూటీ – జిగట విరేచనములు, వమనములను తొలగించారు.

బాపూసాహెబు బూటీ – కలరాను తొలగించారు.

ఆళంది స్వామి – చెవిపోటును  తొలగించారు.

కాకామహాజని – నీళ్ళ విరేచనములను తొలగించారు.

దత్తోపంతు – 14 సంవత్సరముల నుండి బాధపెడుతున్న కడుపునొప్పిని తొలగించారు.

గంగాధరపంతు – అనేక సంవత్సరముల నుండి బాధపెడుతున్న కడుపునొప్పిని తొలగించారు.

నానాసాహెబు చాందోర్కరు – మందులు, ఇంజక్షనులకు ఫలితమివ్వని కడుపునొప్పిని తొలగించారు.

రతన్ జీ కి – పుత్ర సంతానమును ప్రసాదించారు.

గణపతిరావు బోడస్ – తన ధనముంచుకొను సంచి తీసి బాబాముందు కుమ్మరించడంవలన ఆనాటినుండి తన జీవితములో ధనమునకు యెట్టి లోటు లేకుండెను.

చోల్కరు – బాబా కృపచే పరీక్షలో పాసయ్యెను.స్థిరమైన ఉద్యోగము దొరకెను.

సాఠేకుబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చoచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను.

అనంతరావు పాటంకర్ కు అతని శాంతి కలగని మనస్సుకు శాంతిని ప్రసాదించారు.( శాంతి క్షేమములు కలుగునని బాబా ఆశీర్వదించారు.)

బాలాసాహెబు మిరీకర్ ని – పాము వలన కలుగు హానినుండి తప్పించారు బాబా.(పాము వలన రాబోయే ఆపదను తప్పించారు)

బూటీని – పాముగండము నుండి తొలగించారు.(పామువలన రాబోయే ఆపదను తొలగించారు)

అమీరు శక్కర్ – కీళ్ళవాతమును తొలగించారు.

అమీరు శక్కరును – పామువలన కలుగు హానినుండి కాపాడారు (పామువలన కలగబోయే ఆపదను తొలగించారు.)

యోగాభ్యాసము చేయు సాధకుడు – బాబాకు తన కష్టముల దెలిపి ప్రత్యుత్తరముల బడసెను.ఇట్లు సంతృప్తి చెంది ఆనందించినవారై బాబా ఊదీ ప్రసాదములతో ఆశీర్వచనములతో శిరిడీ విడిచెను.

శ్యామాను – పాము విషము నుండి తొలగించారు.

దాము అన్నా – జట్టీ వ్యాపారము చేయుటయందు అసమ్మతి చూపారు.(అలా రాబోయే నష్టము నుండి తప్పించారు బాబా  )

దాము అన్నాను – ధాన్యము వ్యాపారము కూడా మానుకోమన్నారు.(అలా రాబోయే నష్టము నుండి తప్పించారు బాబా )

దామూ అన్నా – మనస్సున కలిగిన రెండు సంశయములకు జవాబిచ్చారు బాబా.

దామూ అన్నా మనస్సు వికలమయ్యి బాబావద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతిపజేసి అప్పాకులకర్ణి యింటిలో బొబ్బట్లతో విందు గావించిరి.అతని నుదుట చందనము పూసిరి.

దామూ అన్నా – యింటిలో దొంగతనము జరిగెను.బాబాఫొటో ముందు అతను యేడ్చెను.ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి యిచ్చివేసి క్షమాపన కోరెను.

పితలే కుమారుని – మూర్ఛను  తగ్గించెను.

అంబాడేకర్ – చావవలెననుకోగా అతని మనస్సు మార్చారు.

లక్ష్మీచందు – మనస్సును కనుగొని సాంజాను తినమన్నారు.అతని ఆకలిని తీర్చారు.

తెండూల్కర్ కుమారుని – పరీక్షలో ఉత్తీర్ణులని చేసారు.

రఘునాథరావుకు – అధికముగా పింఛను లభించేలా చేసారు.

కాకాజీ వైద్యబాబాను చూడగానే అతని మనస్సులోని చంచలత్వ మంతయు పోయి ప్రశాంతి వహించెను.

నూల్కరు – రెండు షరతులను నెరవేర్చారు.

గోఖలే భార్యను – ఉపవాసము చేయవలసిన అవసరము యేమి అన్నారు బాబా.(తన భక్తులు ఉపవసించినచో బాబా (తన ) యొక్క ఉపయోగమేమన్నారు.

నారాయణరావు స్నేహితుని – తేలుకాటు నొప్పిని తొలగించారు.

బాంద్రా భక్తుని కుమార్తె – ప్లేగు జ్వరమును తొలగించారు.

మైనతాయి – ప్రసవవేదనను తొలగించారు.

నారాయణరావు – జబ్బును తొలగించారు.

అప్పాసాహెబు కులకర్ణి – బాబా ఫోటోను, ఊదీని పొందిన తరువాత తన 40 రూపాయాల జీతముకు యెన్నోరెట్లు ఆదాయము వచ్చెను.మంచి పలుకుబడియు అధికారము లభించెను.దైవభక్తి కూడ వృద్ధియగుచుండెను. 

మాలేగాం డాక్టరుగారి మేనల్లుడు – రాచకురుపును తొలగించారు.

మాలేగాం డాక్టర్ యొక్క రోగి – అంటు జ్వరమును తొలగించారు.

డాక్టరు పిళ్ళే – నారిపుండును తొలగించారు.

బాపాజీ భార్య – ప్లేగు జ్వరమును తొలగించారు.

ఇరానీ బాలిక – మూర్ఛ రోగమును తొలగించారు.

హార్దా పెద్దమనిషి – మూత్రకోశములో రాయిని తొలగించారు.

బొంబాయి మహిళ – ఆందోళన, కష్టమును తొలగించారు.

బాంద్రా నివాసి – నిద్రపట్టని రోగమును తొలగించారు.

నేవాస్కర్ – కుటుంబ గౌరవమును కాపాడారు.

గోవా పెద్దమనుష్యులలో రెండవ అతిథికి  – దొంగిలింపబడిన అతని డబ్బును తిరిగి అతనికి చేరేలా చేసారు బాబా.

ఔరంగబాదు కర్ భార్యకు – కొడుకును ప్రసాదించెను.

దేవుకు – జ్ఞానేశ్వరి బోధపడుటలో సహాయము చేసారు.

రామచంద్ర పాటీలు – జబ్బును తొలగించారు.(అతని చావు చీటీ తీసివేశారు)

తాత్యా జబ్బును – తొలగించారు 

లక్ష్మీబాయికి – 9 రూపాయలు ఇచ్చారు.

చెన్నబసప్పను(కప్పను) – (పాము(వీరభద్రప్ప) బారినుండి) రక్షించారు.

శేవడేను – పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు అగునని బాబా ఆశీర్వదించారు.

సపత్నేకర్ భార్య – చేతులు, పొత్తికడుపు, నడుము నొప్పులను తగ్గించారు బాబా.

సపత్నేకర్ ను – ఇక నీ కష్టములు తీరిపోయినవి.నీ మనోభీష్టములు నెరవేరును అని ఆశీర్వదించారు.

సపత్నేకర్ కు – చావడి ఉత్సవమున బాబా పాండురంగనివలె ప్రకాశించెను.

సపత్నేకర్ కు – చనిపోయిన తన బిడ్డను తన భార్య గర్భంలోనికి మరల దెచ్చారు బాబా. (చనిపోయిన తన కొడుకును మరల ప్రసాదించారు).

కాకాసాహెబుతో – “అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయెదను “ అన్న వాగ్ధానము ఇచ్చారు.

బాలారామ్ ధురంధర్ – ఉబ్బసము వ్యాధిని నయము చేసారు.

బాలారాము – చావడిలో హారతి సమయమందు బాబా ముఖమునందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయము కాకాడహారతి సమయమందు అదే కాంతిని పాండురంగవిఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను.

🙏🌹🌹సాయి బాబాసాయి బాబాసాయి బాబాసాయి బాబా🌹🌹🙏

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “శ్రీ షిరిడీ సాయిబాబా గారి మహాద్భుతలీలలు

Sai Baba

Great research on Sai Baba…Thank you so much…Sai Baba

maruthi.sainathuni

సాయి బాబా … సాయి బాబా 🙏

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles