అన్నదమ్ముల కథ …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 13



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా తనను సందర్శించే వారినందరిని అన్నా, అక్కా అని పిలిచేవాడు. ఆయనకు ఎందరు సోదరీ సోదరులో లెక్కకట్టలేము.

జైన మతములోని మొదటి తీర్థంకరుడు అధినాథుడు. ఈయన తన రాజ్యాన్ని తన కుమారులకు పంచిపెట్టి తపస్సుకు వెళ్ళాడు.

పెద్ద కుమారుడు భరతుడు. రెండవ కుమారుడు బాహుబలి. భరతునకు రాజ్య కాంక్ష ఎక్కవ.

ఇతర దేశపు రాజులందరినీ జయించుకుంటూ వస్తున్నాడు. అతని సోదరులంతా తమ రాజ్యంపై అన్న దండెత్తవచ్చునని రాజ్యాన్ని భరతునకు ఇచ్చి తపస్సుకు వెళ్ళిపోయారు.

ఒక్క బాహుబలి మాత్రం తన రాజ్యాన్ని అన్నకు ఇవ్వలేదు. మిగిలిన 98 మంది సోదరులలాగ అతడు అన్నకు దాసోహమనలేదు. క్షత్రియ ధర్మాన్ని పాటించి, యుద్దరంగంలోనే అన్నను ఎదుర్కోవటానికి సిద్ధపడ్డాడు.

యుద్ధంవలన జన నష్టం జరుగుతుంది కనుక, తామిద్దరే ముఖాముఖీ తేల్చుకుందామనుకున్నారు.

ముష్టి యుద్ధంలో అన్నను పైకి ఎత్తాడు. మరుక్షణంలో నేలపై విసరి విజేతకాగలడు. కానీ, ఎత్తిన చేతులాట్లనే ఉన్నాయి.

మనస్సు పరిపరి విధాల ఆలోచించింది. సోదరులంతా అన్నకు రాజ్య మివ్వగా, తాను తన సోదరుని హతమార్చుటయా? మనస్సు, బుద్ది అన్నను వధించవద్దన్నాయి.

సోదర ప్రేమ పెల్లుబికింది, మెల్లగా అన్నను నేలమీద దించి, “నేను రాజ్యమును నీకు వదలివేయు చున్నాను” అని పలికి అడవులలోనికి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవటానికి బాహుబలి.

తపస్సు మొదలు పెట్టినప్పటి నుండి బాహుబలి మనసు మనసులో లేదు. తాను నిలబడి తపస్సు చేస్తున్న భూమి అన్నగారిది.

ఇతరుల భూభాగంలో కాలుమోపి ఎలా తపస్సు చేయటం అనే సంశయం వచ్చింది. తపస్సు చేస్తున్న అధినాథుడు (తండ్రి) ఇది గ్రహించి, భరతునకు కబురు పెట్టాడు.

భరతునకు సంగతి తెలిసి, సోదరుని తపస్సుకు భూమిని ఇచ్చాడు. ఇక బాహుబలి సంతోషంతో తపస్సు నారంభించాడు.

తన తండ్రికి, పెద్దలైన ఇతరులకు మనసులో నమస్కరించి తపస్సు ప్రారంభించాడు. తపస్సు ఎంత కాలానికి ఫలించలేదు.

కారణమును తండ్రి గ్రహించాడు. తాను తన 98 సోదరులకన్న పెద్ద గదా అని వారికి నమస్కరించ లేదు బాహుబలి. అది కనబడని అహంకారం.

ఈ కారణాన్ని బాహుబలికి చేరవేశాడు తండ్రి. తన తప్పును గ్రహించాడు బాహుబలి. తప్పును సరిదిద్దుకున్నాడు.

ఇక తపస్సు మొదలుపెట్టాడు. ఫలించింది. దేవతలు పుష్ప వర్షం కురిపించారు.

నిలబడి తపస్సు చేసిన బాహుబలి శిలామూర్తులు అనేకం వెలిసాయి.

ఉడిపి జిల్లాలో 42 అడుగుల ఎత్తుగల బాహుబలి (గోమఠేశ్వరుడు) విగ్రహమును వీరపాండ్య భైరవరాజు జైన ఆచార్యుడు లలితకీర్తి ఆధ్వర్యంలో 13 ఫిబ్రవరి (1432)న ఆవిష్కరించాడు.

ఈ విగ్రహం జైన మతమునకు సంబంధించినది మాత్రమే కాదు. రెండడుగుల నేలను ఆంటే ఇతరుల సొత్తును ఏ మాత్రం ఆశించకుండటమే కాక, అహంభావ రాహిత్యమునకు, కఠోర దీక్షకు, సోదర ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం.

నేడు ఫిబ్రవరి 13. బాహుబలి చూపిన ఆ సుగుణములను ఆచరించుదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles