Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
పుచ్చకాయ తొక్కను తినుట
బాబా గారు జీవించి ఉన్న కాలంలో షిరిడీ వెళ్ళిన కొంతమంది ఆయన ఆశీర్వాదములని పొందలేకపోయేవారు. వారికి ఆయన మీద నమ్మకం లేకపోవడం వల్ల కావచ్చు లేక వారికి సహనం లేకపోవడం వల్ల కావచ్చు.
వీరంతా థనిక వర్గానికి చెందినవారు. షిరిడీ వెళ్ళినపుడు పేదవానిగా కనపడే ఆయన జీవిత విథానాన్ని చూసి అటువంటి ‘ఫకీరు’ తమ సమస్యలని యెలా తీర్చగలడా అని ఆలోచిస్తూ ఉండేవారు.
కాని, బాబా సమస్యలని పరిష్కరించే విథానం చాలా వినోదకరంగానూ, మొదటి కలయికలోనే అర్థం చేసుకోవడానికి కష్టంగానూ ఉండేవి.
అది వేసవికాలం. తట్టనిండా పుచ్చకాయలు పెట్టుకుని అమ్ముకునే ఒకామె ద్వారకామాయి దగ్గరకొచ్చింది.
బాబా మొత్తం పుచ్చకాయలన్నిటినీ కొనేశారు. ఆయన ఒకటి కోసి ముక్కలు చేసి అక్కడున్న భక్తులందరికీ పంచడం మొదలెట్టారు. వారందరూ పుచ్చకాయ తింటూ ఆనందిస్తున్నారు.
అక్కడే ఉన్న మా నాన్నగారికి బాబా పుచ్చకాయ ముక్కనివ్వలేదు. ఆ సమయంలో మంచి దుస్తులు థరించిన ఒక థనికుడు తన యిద్దరు సేవకులు తోడు రాగా ద్వారకామాయిలోకి ప్రవేశించాడు.
అతను చక్కెర వ్యాథితో బాథ పడుతున్నాడు. యెవరో యిచ్చిన సలహా మీద అతను షిరిడీకి వచ్చాడు. బాబా ఒక వినోదం చేశారు. ఆయన ఒక ముక్కని తీసుకుని తొక్కని, గుజ్జు భాగాన్ని వేరు చేశారు. గుజ్జుని మా నాన్నగారికి తొక్కని థనికివ్యక్తికి యిచ్చి తినమన్నారు.
ఆ థనికుడు కొంచెం కలవర పడి తొక్క తినడానికి తాను ఆవుని గాని, మేకను గాని కానని చెప్పాడు. బాబా దానినే మా నాన్నగారికిచ్చి “హే భావూ, నువ్వే దీనినిప్పుడు తినాలి” అన్నారు.
మా నాన్నగారు దానిని కొరికినప్పుడు ఆశ్చర్యకరంగా అది అరటిపండులాగా మెత్తగా ఉండి తను అంతకు ముందు తిన్న గుజ్జుకన్నా మథురంగా ఉంది.
తన జీవితంలో యెప్పుడు అటువంటి తీయని పుచ్చకాయను తినలేదని మా నాన్నగారు చెపుతూ ఉండేవారు. ఆ థనిక వ్యక్తి సిగ్గుపడి అక్కడినించి వెళ్ళిపోయాడు.
అతను బహుశా తన చక్కెర వ్యాథిని శాశ్వతంగా నయమయే ఆవకాశాన్ని పోగొట్టుకున్నాడు. మా నాన్నగారు తన 70 వ యేట మరణించారు. అప్పటివరకూ ఆయనకు చక్కెరవ్యాథి లక్షణాలు లేవు.
ప్రియమైన భక్తులారా, నిజమైన మందు ఆ పదార్థంలో లేదు కాని బాబాగారి పవిత్ర హస్తాలలో ఉంది. ఆయన ఆ పదార్థానికి పవిత్రమయిన స్పర్శనిస్తూ ఉండటంవల్ల అది మథురంగా మారుతుంది.
ఈ సత్యాన్ని తెలుసుకున్న భక్తులు యెంతో లబ్ధిని పొందారు. బాబా చెప్పిన ముఖ్యమయిన సూత్రాలు ‘శ్రథ్థా అంటే నమ్మకం, ‘సబూరీ’ అంటే సహనం. ఈ రెండు మంత్రాలని ఆచరించినవారికి జీవితంలో యెప్పుడూ విజయమే.
కీటకాలను చంపుట
బాబా ఉన్నకాలంలో భక్తులు షిరిడీకి వచ్చినప్పుడు వారు స్వచ్చందంగా కొన్ని పనులు చేస్తూ ఉండేవారు. (విథులు నిర్వర్తిస్తూ ఉండేవారు) ద్వారకామాయిని శుభ్రం చేయడం, బాబా ద్వారకామాయి నుండి లెండీ బాగ్ కి రోజూ నడచి వెడుతూండే దారిని శుభ్రం చేయడంవంటివి చేస్తూ ఉండేవారు.
ఈ విథులు యెవరికీ కూడా చేయమని యెవరూ అప్పగించలేదు. కాని భక్తులే అటువంటి సామాజిక సేవల ద్వారా తమ భక్తిని (పూజని) బాబాకి సమర్స్పిస్తున్నట్లుగా వాటిని చేస్తూ ఉండేవారు.
షిరిడీలో నివసించే భక్తులు అటువంటి విథులన్నిటినీ క్రమం తప్పకుండా చేస్తూ ఉండేవారు.
మా నాన్నగారు షిరిడీ వెళ్ళినపుడెల్లా పెట్రొ మాక్స్ దీపాలను శుభ్రం చేయడం, సాయంత్రం వేళల్లో వాటిని వెలిగించి ద్వారకామాయి అంతటా వాటి వాటి స్థానాల్లో వేలాడదీయడం వంటి బాథ్యత ఆయన తీసుకుని చేసేవారు.
ఆయన తన మనసులో సందేహాలు యేమన్నా ఉంటే బాబాని అడిగి వాటిని నివృత్తి చేసుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉండేవారు.
ఒక సారి ఆయన తానింక పెట్రో మాక్స్ దీపాలను వెలిగించనని యెందుకంటే ఆ పని తనని పాపిని చేస్తోందని చెప్పేశారు.
లాంతరులు వెలిగంచగానే తరువాత చీకటి పడుతోందనీ, యెన్నో పురుగులు దీపాల చుట్టూ చేరి కొంతసేపు తిరుగుతూ దీపాల కింద పడి చనిపోతున్నాయనీ అటువంటప్పుడు తాను దీపాలను వెలిగించకపోతే కనక పురుగులు రావు అంచేత పురుగులు చనిపోయే అవకాశం ఉండదు కదా.
మా నాన్నగారు ప్రాథమికంగా, దేవుడు అటువంటి విపరీతాన్ని యెందుకు సృష్టించాడనీ ఆ విషయంలో బాబా వివరణను తెలుసుకోవాలనుకున్నారు.
బాబా ఆ ప్రశ్నకు నవ్వి, ” హే భావూ ! నువ్వు పిచ్చివాడివి. నువ్వు లాంతరులు, దీపాలు వెలిగించనంత మాత్రాన ఈ పురుగులన్ని చనిపోవా?
అవి యెక్కడ దీపాలున్నా, వెలుతురున్నా అక్కడికి వెళ్ళి అక్కడ చస్తాయి.
యిదంతా భగవంతుని సృష్టి. ఆయన వాటిని పుట్టించే సమయంలోనే వాటి చావుని కూడా నిర్ణయిస్తాడు. ఒకవేళ లాంతరుగాని, దీపంగాని లేకపోతే మరొక ప్రాణి వాటిని అంతం చేస్తాయి.
ఈ విథమైన పనులన్ని కూడా మానవులకు పాపాలు జమ అవవు. నీ ముఖ్యమైన ఉద్దేశ్యందీపాలను వెలిగించి ద్వారకామాయిలో చీకటిని పారద్రోలడం.
అందుచేత భక్తులు సులభంగా పూజ చేసుకోగలగడానికి. నువ్వు యెటువంటి పాపాల పనిలోనూ పాల్గోటంలేదు. పురుగులు చనిపోతున్నాయనే నిజమే నిన్ను బాథిస్తున్నదంటే, నీకు దయగల హృదయం ఉందండానికి గుర్తు. భగవంతునికి తన విథులు బాగా తెలుసు. మనం ఆయన పనులలో కల్పించుకోకూడదు.
ఆయన మనలో ప్రాణం పోసినప్పుడే దాని ప్రక్కనే మన మరణాన్ని కూడా నిర్ణయించేస్తాడు. అందుచేత నువ్వు ఆందోళన పడకుండా నీకు సంతోషాన్నిచ్చే పనిని చేస్తూ ఉండు. దేవుడు నీ యెడల దయగా ఉంటాడు. (అల్లాహ్ భలా కరేగా)
బాబావారి బోథనలు చాలా సరళంగానూ, నచ్చచెప్పే పథ్థతిలోనూ ఉంటాయి. ఈ సంఘటన ద్వారా ఆయన మా నాన్నగారికి మంచి సలహా మందు వేసి భగవంతుడు చేసే పనిని గురించి యెరుకతో ఉండేలా చేశారు.
రేపు తరువాయి భాగం…
ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా సరియైన స్థానం నీ పాదాల దగ్గిర మాత్రమే–Taarkad-12–Audio
- బాబాయే యజమాని మరేవరూ కాదు –Taarkad–Audio
- బాబా సటకాతో నేలమీద కొట్టి తీవ్రమయిన స్వరంతో గర్జిస్తూ యిక్కడినించి వెళ్ళిపో అన్నారు-Taarkad-29-Audio
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఇరవై రెండో భాగం
- బాబా గారు పెట్టిన బంగారు పరీక్ష–Taarkad-11–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “హే భావూ, నువ్వే దీనినిప్పుడు తినాలి–Taarkad-13–Audio”
kishore Babu
August 22, 2016 at 5:25 pmThank you so much Sai Suresh..