Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
వినయ్ కుమార్ అనుభవములు నాల్గవ మరియు చివరి భాగం
నేను బాబాని ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను. భగవంతుడు మనతోడుగా ఉన్నాడన్ననిజం మనకి తెలిసాక మనకి అహంకారం వచ్చేస్తుంది. అదీ జరిగింది నాకునూ.
నేను రోజూ కష్ట నివారణ స్తోత్రం చదువుతూండటం నా అలవాటు ఏదోక సమయంలో ఎక్కువగా ఆఫీస్ నుండి వచేటప్పుడో ఆఫీసుకు వెళ్ళేటప్పుడో చదువుతూంటాను. అవి నాకు కంఠతా వచ్చు.
ఇవి రోజు ఏం చదువుతాము అవసరం వచ్చినపుడు చదువుకుందాం అని అనిపించిందా రోజు.
చూద్దాం అని చదవటం మానేసాను. ఒక వారం, రెండు వారాలు గడిచేసరికి నాకు ఆఫీస్ లో టాప్ మోస్ట్ క్యాడర్ లో ఉన్న వాళ్ళందర్నీ తీసేస్తున్నాం అన్నారు. అందులో నా పేరుంది.
నాతో పాటు ఇంకా 39 మంది ఉన్నారు. నాకు మతి పోయింది. ఏం చేయాలి? నాకేమి అర్ధం కాలేదు. మళ్ళీ నిష్టగా ‘సచ్చరిత్ర పారాయణ’ చేయాలనుకున్నాను. కానీ అది కుదరలేదు.
‘సచ్చరిత్ర’ పుస్తకం తీసాను. ఇంగ్లీషులో ఉన్నది కూడా ఉంది. నా దగ్గర ఇంగ్లీషులో ఉన్న ‘గుణాజీ’ గారి పుస్తకాన్ని తెలుగులో రాద్దామని ప్రయత్నించాను. కానీ నేను రాయలేకపోయాను.
ఈ సారి పత్తి నారాయణరావు రాసిన పుస్తకాన్నే రోజూ 2 పేజీలు రాయాలని ప్రయత్నం చేసాను. నా వాళ్ళ కాలేదు.
ఇంగ్లీషు పుస్తకం తీసుకున్నాను. ఇది రాసేదానికన్నా కంప్యూటర్ లో టైపు చేయడం నయం అనిపించింది. రోజూ కూర్చుని 1 పేరా 2 పేరాలు టైపు చేస్తూ వచ్చాను.
రోజూ ఆఫీసులో నువ్వేమైనా వేరే ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నావా లేదా అంటూ నస.
నేను సచ్చరిత్ర టైప్ చేయడం చూసిన కొందరు ఆఫీసులో వాళ్ళు ఇలా పుస్తకాలు టైపు చేస్తే సమస్యలు పరిష్కారాలు కావు.
వినయ్ నువ్వు వేరే ప్రయత్నం చెయ్యి అనే వాళ్ళు మొత్తం మీద నాలుగు నెలలో ఆ పుస్తకం పూర్తిగా టైపు చేయడం పూర్తి అయింది.
ఆ కాగితాలన్నీ తీసుకెళ్ళి బాబా గుడిలో ఇచ్చాను. అదే రోజు నాకు పై ఆఫీసర్ నుండి పిలుపు వచ్చింది.
అయిపోయింది ఉద్యోగంలోంచి తీసేస్తున్నామన్న వార్త చెప్పటానికీ నన్ను పిలుస్తున్నారు. ఎందుకంటే నెల రోజులనుండి రోజుకొక్కళ్ళను పిలిచి పొమ్మనమని చెపుతున్నారు.
అందుకే నాకు అదే గతి పట్టబోతోంది అని నాకు అర్ధం అయిపోయింది అనుకుంటూ వెళ్లాను.
ఆఫీసులో నన్ను చూస్తూనే ఆఫీసర్ నీ సెక్షన్ లో దీక్షిత్ అన్న అతన్ని తీసేస్తున్నాం అన్నారు. అసలు పడవలసిన వేటు నాకు పాపం నా బదులు దీక్షిత్ కి వేటు పడబోతోందా అని అనుకున్నాను.
ఒక పక్క నాకు ముప్పు తప్పినందుకు సంతోషంగా ఉన్నా అదే వేటు పాపం దీక్షిత్ కి పడినందుకు నేను చాలా బాధపడి బాబాను వేడుకున్నాను.
బాబా నన్ను బాధనుండి తప్పించి పాపం దీక్షిత్ ను ఎందుకు శిక్షించడం. అతనికి కూడా బాధ లేకుండా చేస్తే బావుంటుంది బాబా అని అనుకున్నాను.
అతను అదే రోజు వేరే కంపెనీ లో ప్రయత్నం చేయడం ఇంటర్వ్యూ కూడా అదే రోజు అయిపోవడం ఇక్కడ మానేసి అక్కడ జాయిన్ అయిపోవటం జరిగిపోయాయి.
నేను నా భార్య జాతకాలు చూపించుకున్నాం. వైదేహి నగర్ బాబాగుడిలో పూజారి అరుణ్ చూసాడు.
మాకు ఇద్దరు అమ్మాయిలు పుడతారు అని కూడా చెప్పాడు. అతను అలా చెప్పిన కొద్ది రోజులకే మా లావణ్య గర్భవతి అయింది.
నవమాసాలు నిండాక అమ్మాయి పుట్టింది. సరే జాతకంలో అమ్మాయి ఉంది పుట్టింది. మళ్ళీ వెంటనే నెల తప్పింది కొన్నిరోజులనంతరం అబార్షన్ అయింది.
డాక్టర్ పాపే అని చెప్పారు. మా ఇంట్లో అందరమూ దిగులు పెట్టేసుకున్నాము. ఎందుకంటే జాతకంలో ఇద్దరు అమ్మాయిలు అని ఉంది.
ముందు అమ్మాయి పుట్టేసింది. ఇప్పుడు అబార్షన్ లో పోయింది కూడా అమ్మాయే అంటే ఇంక మాకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. బాగా బెంగ పెట్టేసుకున్నాము.
అటువంటి సమయంలో నేను మళ్ళీ బాబా పారాయణ మొదట్లో చేసినట్లు నిష్టగా చేయాలి అని అనుకున్నాను.
అవి దసరా రోజులు. మా పిన్ని కూతురు చెన్నై లో ఉంటుంది. సెలవలు ఇచ్చారని వచ్చింది.
నేను ఇలా పారాయణ మొదలు పెడుతున్నానని తెలుసుకుని అన్నయ్యా నాకు చెయ్యాలనిపిస్తుంది, నీకభ్యంతరం లేకపోతే నీతో పాటు నేనూ పారాయణం చేస్తాను అంది.
నాకు అభ్యంతరం ఎందుకుంటుంది చేసుకో అన్నాను. ఉదయమే శ్రద్దగా, నిష్టగా పారాయణం మొదలు పెట్టాము.
గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఇలా గడిచిపోయాయి.
మంగళవారం నాటి పారాయణంలో దేవు గారింట ఉద్యాపన కధలు వచ్చాయి. దేవుకి ఇంటికి వచ్చి కనపడకుండా వెళ్ళిపోయావు ఆయనకీ నువ్వు వచ్చావన్నమాటే తెలియలేదు.
ఇప్పుడు నాకు నువ్వు కనపడి నన్ను ఆశీర్వదించాలి. అదీ నాకు తెలియాలి. నాకు అబ్బాయి పుట్టాలి అని అనుకున్నాను. రేపే కనపడాలి అని కూడా అనుకున్నాను. బుధవారం నాడు ఏం కనపడలేదు.
పారాయణం పూర్తి అయిపోయింది. గురువారం నాడు మహానైవేద్యం అయిపోయింది. నేను ధ్యానం చేస్తూ కాసేపు కూర్చున్నాను.
ఏమిటి బాబా నువ్వు నాకు కనపడలేదు నన్ను ఆశీర్వదించలేదు అనుకుంటూ కళ్ళు తెరిచాను. ఎదురుగా బాబా వెండి విగ్రహం ఉంది.
నేను ఆశ్చర్యంగా ఆనందంగా ఎవరు పెట్టారు దీన్ని అని గట్టిగా అరిచినంత పని చేశాను.
నేనే, నేనే అన్నయ్యా నిన్న నాకు ధ్యానం లో ఇక్కడ ఒక విగ్రహం పెట్టి అది నీ ఇంటికి తీసుకెళ్ళు అని అనిపించింది.
అందుకే రాత్రి బజారుకు వెళ్లి వెండి షాప్ లో చూసాను. ఒక్కటే విగ్రహం ఉంది. అది కొనుక్కు వచ్చాను.
ఈ రోజు మహానైవేద్యం అయిపోయింది కదా ఈ రోజు దేవుడి దగ్గర ఈ విగ్రహం పెట్టి నేను చెన్నై తీసుకెడదామనుకుంటున్నాను అంది మా చెల్లెలు.
బాబా నాకు తెలిసేటట్లుగా ఈ రకంగా నన్ను ఆశీర్వదించావా. ఆ తర్వాత కొద్ది రోజులకి లావణ్య నెల తప్పింది. 9 నెలలు నిండాకా కాన్పు అయింది.
డాక్టర్ తల్లీ, బిడ్డ బాగున్నారు అందే కానీ ఏ బిడ్డా అని అడిగేదాకా చెప్పలేదు. మగపిల్లాడే ఏం అలా అడిగావు అంది డాక్టర్.
అంతే అక్కడ ఉన్న మేమంతా పెద్దగా సంతోషంతో అరిచాము. నేను బాబా నడిగిన మాట నిజమవుతుందా? లేదా అరుణ్ చెప్పిన జోస్యం సత్యమవుతుందా? అని నేను అనుకున్నాను.
కానీ బాబా తలచుకుంటే జాతకాన్ని, నుదుటి రాతని కూడా మార్చి రాయగల సమర్ధుడు.
నాకు ఉద్యోగం లో హైదరాబాద్ నుండి చెన్నై ట్రాన్పర్ చేసారు. నాకు చెన్నై నచ్చలేదు.
పైగా అమ్మ నాన్నలకి దూరంగా వుండవలసి వచ్చింది. కొత్త స్థలం, మేము షిర్డీ కి వెళ్ళాలన్న కూడా హైదరాబాద్ వచ్చి వెళ్ళవలసివస్తోంది. అక్కడ బాబా గుడికి వెడదామంటే బాబా గుడి ఒక్కటి కూడా లేదు.
అక్కడ ఆంజనేయస్వామి గుడి ఉంది. అక్కడ ఆంజనేయుడు చాలా మహిమగలవాడు అక్కడ కనుక కొబ్బరికాయ ఉంచి వారం తర్వాత ఆ కొబ్బరికాయ తీసుకొని పగులగొడితే ఏమీ అవకుండా అంటే కొబ్బరికాయ పాడై పోకుండా ఉంటే అనుకున్న పని పూర్తి అవుతుంది అని భక్తుల నమ్మకం.
సరేనని నేను కొబ్బరికాయ కట్టి వారం రోజుల తర్వాత ఆ కొబ్బరికాయ కొట్టాను. కొబ్బరికాయ బావుంది పాడవ్వలేదు. అయితే నా కోరిక నెరవేరుతుందన్నమాట.
అదేమిటంటే నేను తిరిగి హైదరాబాద్ రావాలని ప్రయత్నం చేస్తున్నాను. లేదా మరో కంపెనీ లోనైనా వస్తే వెళ్లి పోవచ్చుననుకున్నాను.
ఒక కంపెనీ లో ఇంటర్వ్యూ లు అయ్యాయి. జీతం కూడా మాట్లాడుకున్నాను. మంచి జీతం ఇస్తానన్నారు. ఇంకా రేపే జాయిన్ అవ్వాలి అన్నారు. చాలా సంతోషం కలిగింది.
పెద్ద జీతం ఇంక నా కష్టాలన్నీ తీరిపోతున్నాయి అనుకున్నాను. రాత్రి 10 గంటలకి ఫోన్ వచ్చింది. నీకు ఉద్యోగం ఇవ్వటం లేదు అన్నారు.
నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకిలా జరిగిందని చాలా బాధపడ్డాను. బాబా ఎందుకిలా జరిగింది.నన్ను ఎందుకు disappointment కి గురి చేసావు ఇలా ఎప్పుడూ జరగలేదు అని నేను బాధపడుతున్నాను.
మా ఆఫీసులో పని చేసే అతను నా దగ్గరకు వచ్చి ఏమిటి సంగతి అని అడిగాడు. నేను విషయమంతా వివరించాను.
ఓహో అలాగా! పోనీ నేను ప్రయత్నం చేయనా ఆ ఉద్యోగానికి అన్నాడు. అతని qualification నా కన్నా తక్కువే! నేను అన్నాను నాకే రాలేదు నువ్వు ప్రయత్నం చేస్తే వస్తుందా అన్నాను. ప్రయతిస్తాను అన్నాడు.
నేను ఏమి మాట్లాడలేదు. అతను ప్రయత్నం చేసాడా ఉద్యోగానికి. ఆ ఉద్యోగం అతనికి వచ్చేసింది.
అతను ఎగిరి గంతు వేసాడు. నేను ఇంక అక్కడే ఉండి పోయాను. నాకంటే అనకూడదు కానీ qualification తక్కువగా ఉన్నా వాడికి ప్రస్తుతం నాకంటే ఎక్కువ జీతం వస్తోంది అని బాబా ఇలా ఎందుకు చేసాడు అని ఒకటే దిగులు.
మా లావణ్య అంది ఇలా జరిగిందంటే తప్పకుండ ఏదో మేలు ఉంటుంది అనవసరంగా కంగారు పడొద్దు దిగులు పడొద్దు అని అంది.
నేను ఒక రోజు ఆంజనేయస్వామి గుడికి బాబుని ఎత్తుకుని అలా వెడుతూ ఉంటే ఎపుడూ 8 గంటలకే మూసేసే గుడి ఆ రోజు 8 :45 అయినా గుడి మూయలేదు.
సరేలే దండం పెట్టుకుందాం అనుకోని లోపలికి వెళ్లి బయటకు వస్తూ బాబుతో నేను మాట్లాడటం విని, ఒకాయన మీరు తెలుగువాళ్ళా అన్నాడు. అవునన్నాను.
మేము కూడా తెలుగువాళ్ళమే. మాది వైజాగ్, నేను ఇక్కడ పూజారిని. మీరు ఉద్యోగం గురించి చింతపడుతున్నారులా ఉంది అన్నాడు. నేను అవును అన్నాను.
ఎప్పుడవుతుంది అన్నాను. వారంలో వచ్చేస్తుంది అన్నాడు. నేను ఆ గుడికి అప్పుడప్పుడు వెడుతూంటాను కానీ ఎప్పుడూ తెలుగు మాట్లాడే పూజారిని నేను చూడలేదు.
ఆ తర్వాత హైదరాబాద్ లో Genpact లో ఉద్యోగం రావటం నేను సెలెక్ట్ అవటం హైదరాబాద్ వచ్చేయటం జరిగాయి.
ఆ తరువాత ఒక రోజు నేను ఏ ఉద్యోగంలో అయితే చేరలేక బాదపడ్డానో ఆ కంపెనీ లో చేరిన నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసాడు. ఒరేయ్ వినయ్ నువ్వు ఉద్యోగం లో చేరాక పోవడమే మంచిదయింది. ఎందుకంటే ఆ కంపెనీ ఎత్తేసారు.
అందరి ఉద్యోగాలు పోయాయి అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసాడు. బాబా ఏం చేసినా మన మేలుకే చేస్తాడని సంతోషించాము.
ఒకసారి మేము షిరిడి వెడదామని బయలుదేరాము. మా కుటుంబ సభ్యులం 20 మందిమి.
రిజర్వేషన్స్ చేయించుకుంటే అందరికీ ఒకేసారి కుదరాలంటే ఇబ్బంది. అందుకని వెళ్ళాలి అనుకోగానే బయలుదేరిపోయాము.
జనరల్ కంపార్ట్మెంట్ లో ఆ రైలు ఎక్కి కొంతదూరం, ఈ రైలు ఎక్కి కొంతదూరం అలా అంచెలంచెలుగా ప్రయాణం చేస్తున్నాము.
నాందేడ్ కు రాత్రి 8 గంటలకి చేరాము. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
అప్పుడు నేను బాబా మేము వచ్చేది నీ దర్శనానికి ఇన్ని కష్టాలు పడాలా బాబా అని అనుకుని నీ దర్శనం అయ్యేంతవరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టను అనుకున్నాను.
ఇలా అనుకున్నాను అంతే వెంటనే ఆ రోజు వెనక వెనకగా రెండు రైళ్ళు వచ్చాయి.
జరిగింది ఏంటంటే సాయంత్రం 6 గంటలకి ఒక రైలు 9 గంటలకి ఒక రైలు రావాలి. సాయంత్రం ఒక రైలు 8 : 30 దాటాక వచ్చింది.
నాందేడు స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ ఆ రైలు ఎక్కేసారు. ఆ తర్వాత రైలు చాలా ఖాళీగా వచ్చింది.
మేమా రైలు ఎక్కి హాయిగా పడుకుని తెల్లవారాక షిరిడి చేరి బాబాని దర్శనం చేసుకున్నాక నేను టిఫిన్ చేశాను. అలా పిల్లల్ని తొందరగా తీసుకువచ్చి కాపాడాడు బాబా.
నేను వైదేహీనగర్ బాబా గుడిలో ఏమైనా అవసరమైన వస్తువులు ఇస్తుంటాను.
అలాగే ఒకసారి నాకు మైనం తోటి బాబా బొమ్మ చేయించాలని ఉంది దాని కోసం చైర్మన్ తోటి మాట్లాడాను. ఆయన సరేనన్నారు.
మరొకరు మరొకరు కూడా ఒప్పుకున్నారు. పని వాళ్ళని రప్పించి measurements కూడా తీసుకున్నారు. కొంతమంది దీనికోసం డొనేషన్స్ ఇస్తాం అని కూడా అన్నారు.
సడన్ గా ఒకాయన రోజు గుడికి వచ్చే భక్తుడు ఇంకా గుడిలో జరగవలసిన కార్యక్రమాలు చాలా ఉండగా ఇప్పుడు ఈ మైనం విగ్రహం అవసరమా అన్నాడుట.అంతే విరమించుకుంది కమిటి.
నేను చాలా బాధపడ్డాను. నేను ఇవ్వాలనుకున్న లక్ష రూపాయలు ఎం చేయాలా అనుకున్నాను.
అయినా విగ్రహం చేయించుదామంటే ఎందుకు కుదరనీయలేదు బాబా అనుకున్నాను.
నాకు చేసేకంటే 10 మందికి చేస్తే నాకు చాలా ఆనందం అంటాడు బాబా. ఒక అనాధాశ్రమానికి ఇవ్వాలనిపించింది వెళ్లి అడిగాను. వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు.
వాళ్ళు mentally రిటార్టెడ్ పిల్లలు. వాళ్ళ అవసరాలకి నీళ్ళ ట్యాంక్ లేదు. కట్టించుకుంటాం అన్నారు. సరేనన్నాను.
నాకు చాలా సంతోషం వేసింది.ఎందుకంటే బాబా నాచేత ఇలా మంచి పని చేయించాడు. మా ఇంట్లో కూడా అందరు చాలా ఆనందించారు.
ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు కూడా మా చేత బాబా చేయించాలి అని మేము అనుకుంటూ ఉంటాము.
సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణ మస్తు.
శుభం భవతు.
The above miracle has been typed by: Shiv Kumar Bandaru
Latest Miracles:
- చిన్న దెబ్బ కూడా తగలకుండా, పెద్ద యాక్సిడెంట్ నుంచి కాపాడిన బాబా వారు
- నేను ప్రార్దించినట్లుగానే బాబా భక్తురాలే నాకు భార్యగా రావడం కూడా బాబా అనుగ్రహమే.
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
- మామూలు స్లీపర్ టికెట్స్ ని AC టికెట్స్ గా మార్చి మమ్మల్ని అనుగ్రహించిన బాబా వారు …..!
- గురువుగారి దయవలన నాకు పూర్తిగా జ్వరం తగ్గి స్కూల్ కి వెళ్లి పరీక్ష కూడా వ్రాయగలిగాను.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments