Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
ఈ రోజు మరొక సాయి లీలను గురించి తెలుసుకుందాము. సాయిని పూజించేవారు, భజించేవారు, సాయిని అలక్ష్యం చేయరాదనీ, మరచిపోరాదనీ తెలుపుతుంది.
(శ్రీరామలింగస్వామి గారు వ్రాసిన ‘ఆంబ్రోసియా యిన్ షిరిడీ’అనే పుస్తకం లోని 76వ.లీల )
నన్ను మరచిపోతే ఎలా
నేను నా భార్య యిద్దరం సాయిబాబా కే కాక హరనాధ కు కూడా భక్తులం. నెలరోజుల క్రితం మేము నెల్లూరులో ఉన్నపుడు ఈ ఇద్దరి యోగుల పాటలు, భజనలు చేసి స్తోత్రాలు కూడా చదివాము.
చెన్నయ్ కి తిరిగి వచ్చిన తర్వాత మేము హరనాధ బాబా భజనలు ఛేశాము కాని సాయిబాబా పాటలు పాడి స్తోత్రం చదవలేదు. హరనాధ తో పాటుగా సాయి ఫొటోకు హారతినిచ్చాము.
నాభార్యకు 21.01.1939 లొ బాగా జబ్బు చేసింది. పక్షవాతం వచ్చినట్లుగా కీళ్ళవాతం వచ్చింది. దానివల్ల కాళ్ళు కదపలేకపోయేది. బాబాను అలక్ష్యం చేసి బాబా పాటలు పాడి స్తోత్రం చేయకపోవడం వల్లే తనకీ శిక్ష అనుకొంది.
తరువాత ఒకరోజు ఆమెకు ఒక కల వచ్చింది. ఆకలలో తాను ఒక తోటలో (మేము భజనలు చేసే ప్రదేశం) పరిగెడుతూ ఉంది. ఆమెను యిద్దరు ముస్లిం బాలురు తరుముతూ ఉన్నారు.
అప్పుడామెకు హరనాధ గుర్తుకు వచ్చి ఆయనను ప్రార్ధించింది. తరుముతున్న యిద్దరిలో ఒకడు మాయమయ్యాడు. ఇప్పుడు ఒక్క పిల్లవాడే ఆమెను తరుముతూ ఉన్నాడు.
ఆ పిల్లవాడు నవ్వుతూ, “నేను సాయిని కానా? నన్నలా మరచిపోతే ఎలా? నాకు 40 రూపాయలివ్వు. నీజబ్బు తగ్గిపోతుంది” అన్నాడు.
నాభార్య నిద్ర నుండి లేచి తనకు వచ్చిన కల గురించి అంతా చెప్పింది. మేము బాబా చెప్పినట్లుగానే చేయడానికి నిర్ణయించుకొన్నాము.
కల వచ్చిన అరగంట తర్వాత జబ్బుపడటం వల్ల కదపలేకపోయిన ఆమె కాళ్ళు మామూలు స్థితికి వచ్చాయి. బలాన్ని పుంజుకొని తిరిగి ఎప్పటిలాగే నడవసాగింది. ఉదయానికల్లా మంచి ఆరోగ్యవంతురాలయింది.
ఆరోజునుండి మేము ప్రతిరోజు మాయింటిలో సాయి పూజ భజనలు చేయసాగాము.
పెట్టుగుల నరసిం హ చెట్టియార్, నం. 8, చిన్నతమిలి ముదలి వీధి, జి.టి. చెన్నయ్
సాయిలీల ద్వై మాసపత్రిక
మార్చ్-ఏప్రిల్, 2005 సంచికలో ప్రచురింపబడినది
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- అందరిలోను నన్ను చూడు – నీ కోరిక ఎలా తీరెనో చూడు
- 2 ,40,000/- రూపాయలు ఎలా వస్తాయి అనుకోని చింతిస్తూ వుంటే బాబా వారు 2 రోజుల్లో అందించారు.
- బాబా ని అడగండి. ఆయన ఎలా చెపితే అలా చేయండి–Audio
- నన్ను చావు నుండి తప్పించింది. నన్ను మనీషిగా మార్చింది–Audio
- ఆమె కడుపు నొప్పి ఎలా తొలిగిపోయింది?–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments