Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబంధువులందరికీ సాయిరాం.
నా పేరు సాయిమూర్తి. నేను హైదరాబాదులో ఉంటాను. నిన్న నాకు బాబాగారి విభూతితో జరిగిన అనుభవం, మొన్న పవన్ గారికి జరిగిన అనుభవం గురించి మీరంతా చదివి చాలా అద్బుతం అని సంతోషించారు. ఈ రోజు ఇంకొక బాబాగారి లీల మీ అందరికీ తెలియజేస్తున్నాను.
మా అమ్మాయి B.Tech. ఫైనలియర్ 2016 లో పాసయ్యింది. 2015 లో చాలా కంపెనీలు Campus Selection కి పిలిచారు. మొదటి రౌండులోనే పోయింది అని ఇంటికి వచ్చేసేది. ఇంట్లో చెప్పి బాధపడుతుండేది. ఏమి కాదమ్మ మంచి కంపెనీలో వస్తుందిలే అంతా ఆ సాయినాధుడు చూసుకుంటాడు అని ధైర్యం చెప్పేవాన్ని. నాకు కూడా బాధగా ఉండేది. మనం బాధపడితే పిల్లలు upset అవుతారను నాలో నేనే కృంగిపోయేవాడ్ని. 2015 వినాయక నిమజ్జనం అయిన మరుసటి దినము ఈ రోజు నాకు మా కాలేజిలో క్యాంపస్ డ్రైవ్ ఉంది, నన్ను drop చేయండి అని మా అమ్మాయి నాతో చెప్పింది. సరే నేను కూడా bike మీద ఆఫీసుకు వెళ్తున్నాను drop చేస్తానులే అని కాలేజి దగ్గర దింపి లలితమ్మ (పూజ్య మాతాశ్రీ సాయిలీలమ్మ గారి కూతురు) గారికి ఫోన్ చేసాను. అమ్మ పాప క్యాంపస్ సెలక్షన్ కి వెళ్లింది అని చెప్పాను. పాపని “ఓం శ్రీ సాయిబాబా” అని 11 సార్లు వ్రాసి వెళ్ళమను అని చెప్పారు. అప్పటికే పాప క్యాంపస్ లోకి వెళ్ళిపోయింది. వెంటనే ఫోన్ చేసాను. ఫోన్ స్విచ్చాఫ్.
ఈ రోజు ఖైరతాబాదు వినాయకుడుని గంగలో దర్శనము చేసుకొని ఆఫీసుకి వెళ్దామని బయలు దేరాను. జేం స్ట్రీట్ దగ్గర సిగ్నల్ పడింది. నా జూనియర్ వేణు ఫోన్ చేసాడు. అన్నా ఎక్కడున్నావు. నేను జేం స్ట్రీట్ దగ్గరున్నాను. నువ్వు బేగంపేట నుంచి ఆఫీసుకిరా, నా bike నిన్న ఆఫీసులో పెట్టాను. ఇద్దరం కలిసి ఆఫీసుకి వెళ్దాము. వేణు ఉండేది ప్రకాశ్ నగర్లో. దారిలో నల్లగుట్టలో షిరిడీ సాయి మందిరము ఉన్నది. వెంటనే bike ఆపి బాబా దర్శనము చేసుకొని జేబులో పెన్ను లేకపోవడం వలన గుడి పూజార్ని పెన్ అడిగి తీసుకొని ఒక చిన్న పేపర్ మీద “ఓం శ్రీ సాయిబాబా” అని 11 సార్లు నేనే వ్రాసి మా పాప ఈ రోజు క్యాంపస్ సెలక్షన్ అవ్వాలి అని దండం పెట్టుకొని రూ.21/- దక్షిణ వ్రాసిన పేపర్లో పెట్టి బాబా హుండీలో వేసి వేణుని pickup చేసుకొని ఆఫీసుకి వెళ్ళాను. కరెక్టగా 11.30 కి మా పాప ఫోన్ చేసింది. డాడీ మొదటి రౌండ్ క్లియర్ అయ్యింది అని చెప్పింది. Don’t worry రెండవ రౌండ్ కూడా క్లియర్ అవుతుందని చెప్పాను. మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ ఫోన్ మొగింది. డాడీ 2nd రౌండ్ క్లియర్ అయ్యింది అని చెప్పింది. ఫైనల్ రౌండ్ కూడా క్లియర్ అవుతుంది అని ధైర్యం చెప్పి మనసులో బాబాకి నమస్కిరించాను. సాయంత్రం 6.30 కి మళ్ళీ ఫోన్ వచ్చింది, మూడవ రౌండ్ కూడా OK అని చాలా happy గా మా పాప ఫోన్ చేసింది. పది రోజుల తర్వాత conform mail వచ్చింది. వచ్చే నెలలో జాయిన్ అవుతుంది. దీనిని బట్టి భక్తులంతా తెలుసుకోవల్సింది ఒకటే, ఎంత నమ్మితే అంత. నేను చేసింది 11 సార్లు వ్రాయడం, రూ.21/- దక్షిణ వేయడం.
{ ఇట్లు: సాయి మూర్తి}.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి బాబా వారు ఒక భక్తుని కోరిక ఇంకొక భక్తుని ద్వారా తీర్చుట.–Audio
- మా అబ్బాయి క్యాంపస్ సెలెక్షన్ లో సెలెక్ట్ అయ్యాడు.హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది.
- నేనుండ నీకు భయమేల — అషిమా, బాబా అనుభూతి–Audio
- బాబా, నీవు తలచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలవు—Audio
- సాయి బాబా నా సోదరుడిని రక్షించారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “క్యాంపస్ సెలక్షన్(Campus selection)”
RAMAKRISHNA
October 13, 2016 at 1:10 pmExcellent anubhavam , om sai sri jaya jaya sai