Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స.(రావాడ గోపాలరావు) గారు చెప్పే శ్రీకృష్ణ పరమాత్మునిగా శ్రీసాయి
ఓం శ్రీగణేశాయనమహ, ఓం శ్రీసరస్వ్వత్యైనమహ, ఓం శ్రీసమర్ధ సద్గురు సాయినాధాయనమహ.
శ్రీసాయి సత్చరిత్ర 10, 15వ. అధ్యాయాలలో బాబా తాను తన భక్తులకు బానిసనని, అందరి హృదయాలలోను నివసిస్తున్నానని చెప్పారు. నాయజమానియైన సాయి మీ బానిస అయినపుడు నేను కూడా మీబానిసనే.
ఆరవ అధ్యాయములో, హేమాద్రిపంత్ మధురంగా చెప్పిన మాటలు, “నేను భాగవతం చదివినపుడెల్లా ప్రతీచోటా, సాయియే శ్రీకృష్ణుడనే భావన కలిగింది” సనాతన ధర్మములో “శేషసాయి, వటపత్ర సాయి” ల గురించి మీకందరకూ తెలుసు.శ్రీమహావిష్ణువు యొక్క చరిత్రే భాగవతం. మన షిరిడీ సాయి లాగే, వటపత్ర సాయి లో సాయి, శేషసాయిలో సాయి ఇద్దరూ ఒకరే. నేను భాగవతం చదివినప్పుడు, సాయి సత్ చరిత్రలోను, భాగవతం లోను ఉన్న కొన్ని పాత్రల మధ్య పోలికలను గమనించాను.
నేను ఉపన్యాసం ఇచ్చేముందు నారదులవారి గురించి కొంత చెపుతాను. నారదుల వారు శ్రీమహావిష్ణువు కు అత్యంత ప్రియమైన భక్తుడు. ఆయన గత జన్మలో “ఉపభర్వ” అనే గంధర్వుడు. అతను గాన కళా గంధర్వుడు. పాటలు చాలా మధురంగా పాడుతూ ఉండేవాడు. కాని అతనికి గంధర్వ కన్యల మీద మోజు. ఒకసారి బ్రహ్మగారు ఆహ్వానించిన మీదట బ్రహ్మగారు తలపెట్టిన ‘బ్రహ్మ సత్రయాగానికీ’ వెళ్ళాడు. అక్కడ యాగము జరుగుతూ ఉండగా ఉపభర్వుడు శ్రీమహావిష్ణువుని కీర్తిస్తూ మధురంగా పాడసాగాడు. ఆసమయములో అక్కడ గంధర్వ కన్యలు కనిపించేటప్పటికి తాను పాడుతున్న గానాన్ని మధ్యలోనే హటాత్తుగా ఆపివేసి వారి వెంట వెళ్ళి, బ్రహ్మ ఆగ్రహానికి గురయ్యాడు. బ్రహ్మ అతనిని భూలోకంలో ‘దాసిపుత్రుడుగా జన్మించమని శాపమిచ్చారు. దాసీపుత్రుడిగా అతను ఎంతోమంది సాధువులకు సేవ చేశాడు. దాని ఫలితంగా వారు అతనికి ‘నారాయణ మంత్రాన్ని’ ఉపదేశించారు. దానివల్ల అతను పరిశుధ్ధుడై శరీరాన్ని త్యజించి విష్ణులోకానికేగాడు. అప్పటినుంచి అతను నిరంతరం శ్రీమహావిష్ణువు నామాన్నే జపిస్తూ ఉండేవాడు. బ్రహ్మ అతనిని శ్లాఘించారు. బ్రహ్మ శ్వాస ద్వారా బ్రహ్మలోకి ప్రవేశించి బ్రహ్మ మానసపుత్రుడిగా జన్మించడం జరిగింది. తరువాత జీవితమంతా విష్ణులోకంలో హరినామ స్మరణలోనే గడుపుతు నారదమహామునిగా ప్రసిధ్ధి చెందాడు.
సాయి సత్ చరిత్రలో ఏపాత్ర నారదుని పోలి ఉన్నది అని ఇప్పుడు మీకొక అనుమానం రావచ్చు. శ్రీసాయి సత్ చరిత్ర 15 వ. అధ్యాయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ అధ్యాయములో బాబా దాసగణు మహారాజ్ హరికధ చెప్పుటకు తయారవుతుండగా బాబా అతనితో “ఏమోయ్ పెండ్లికొడుకా! యింత చక్కగ ముస్తాబై ఎక్కడకు పోవుచున్నావు?” అనెను. హరికధ చెప్పుటకు పోవుచున్నానని దాసగణు జవాబివ్వగా బాబా ఇట్లనెను, “దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయుము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు?” అని నారద మహర్షి ఎట్లా కీర్తనలు చేసేవారో వివరించి చెప్పారు బాబా. నీవు కూడా ఆవిధంగానే పైన ఎటువంటి ఆచ్చాదన లేకుండా హరికధలు చెప్పుము అని ఆజ్ఞాపించారు.
దాసగణుయొక్క గత చరిత్రను గుర్తుకు తెచ్చుకొందాము. ఆయన అసలుపేరు గణేష్ సహస్రబుధ్ధే. ఆయన పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. జమాబందీ నిమిత్తం ఆయన 1894లో నానాసాహెబ్ చందో ర్కర్ తో కలిసి షిరిడీకి వచ్చారు. బాబా దర్శనం చేసుకొని ఆయన ఆశీశ్శులు పొందారు. దాసగణు బాగా పాటలు పాడేవారు, మంచి కవి కూడా. ఆయన ఉధ్యోగ విధులు ముగియగానే వీధినాటకాలలో ఆడవారు “లావణి” అనే డాన్సులు చేసేటప్పుడు పాటలు పాడుతూ సమయాన్ని గడిపేవారు.
బాబా ఆయనలో ఉన్న కళను, కవిత్వాలు రాయడంలోని ఆయన ప్రతిభను గుర్తించి, ఉద్యోగ విరమణ చేసి భగవంతుని మీద కీర్తనలు హరికధలు చెప్పుకొంటూ భగవత్సేవ చేసుకోమని సలహా ఇచ్చారు. కాని అంతటితో నేను తమాషా (వీధి నాటకాలు) లలో పాల్గొనడం మానేశాను గాని, ఉద్యోగం వదలలేక పోయాను. ఆయనెప్పుడు ఆ మాట చెప్పినా, ‘చూస్తాను’ అనేవాణ్ణి. బాబా యిలా పదేళ్ళు చెప్పి చెప్పి, చివరికి, “వీణ్ణి కొరత వేస్తేగాని ఉద్యోగం మానడు!’ అన్నారు. ఒకసారి మరో ముగ్గురు పోలీసులతో పాటు నన్ను కాణాభిల్ అనే పేరుమోసిన బందిపోటుపై నిఘా వుంచారు. అతడు కనిపెట్టి ఆ ముగ్గుర్నీ చంపేశాడు. నేను భయంతో శ్రీరాముడుని ప్రార్ధించాను కాణాభిల్ నన్ను బెదిరించి విడిచిపెట్టాడు. తర్వాత అతడొక కొండప్రాంతంలో తిరుగుతూంటే అధికారులకు తెల్పాను పోలీసులు అన్నివైవుల నుండీ దాడి చేశారు. చాలామంది పోలీసులు గూడ మరణించారు. అతడు మాత్రం తప్పించుకున్నాడు. ఇక నాకు ధైర్యం చాలక సెలవుకై ఒక దొంగ డాక్టరు సర్టిఫికేట్ దాఖలు చేసి, శెలవు మంజూరు గాకముందే నా స్థానం విడిచి యాత్ర చేశాను. అందుకు వుద్యోగంలో యిబ్బంది రాకుంటే ఈసారి వుద్యోగం విడుస్తానని గోదావరిలో నిలబడి సాయికి మొక్కుకున్నాను. అక్కడొక దొంగలముఠా కన్పించడంతో నా ప్రయాణానికి సాకు దొరికింది. ఇంతలో ప్రమోషన్ పరక్ష కూడా పసాయ్యాను అయినా నాకు ప్రమొషన్ రాదన్నారు బాబా. తర్వాత నాకు బదిలి అయిన చోటుకు శిరిడి మీదుగా వెళుతూ బాబాకు కన్పించవలసి వస్తుందేమోనని మసీదు వైపుకు తిరగకుండా తిన్నగా పోతున్నాను. కానీ సరిగ్గా లెండీ దగ్గర బాబా ఎదురయ్యారు గుఱ్ఱం దిగి నమస్కరించాను. “గణూ, గోదావరీ జలం చేతబట్టి ప్రమాణం చేసినదెవరు?” అన్నారు. ‘అలాగే చేస్తానుగదా!’ అన్నాను. ‘సరే వుండు, ఇలా చెబితే వినవులే!’ అన్నారు బాబా, కొద్ది కాలమైంది. ఒక నేరస్తుని నుండి వసూలు చేసిన జరిమానా పైకం నా సాటి పోలీసు కాజేసాడు. నాకు శిక్ష తప్పదు. ఈసారి శిక్ష తప్పితే తప్పక వుద్యోగం విడుస్తానని మొక్కుకొని, శిక్ష తప్పగానే 1903లో దాసగణు స్వచ్చంద పదవీ విరమణ చేసి, ఇక జీవితమంతా సాయిని కీర్తిస్తూ హరికధలు చెప్పడానికి నిశ్చయించుకొన్నారు. ఆవిధంగా నేను భాగవతంలోని నారదుల వారికి, సాయి సత్ చరిత్రలోని దాసగణుకు గల పోలికలను గమనించాను.
మరిన్ని పోలికలకు తరువాత భాగంలో …
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీకృష్ణునిగా శ్రీసాయి – 3
- శ్రీకృష్ణునిగా శ్రీసాయి – 2
- శ్రీకృష్ణునిగా శ్రీసాయి – 4వ. భాగము
- శ్రీకృష్ణునిగా శ్రీసాయి – 8వ. భాగము
- శ్రీకృష్ణునిగా శ్రీసాయి – 7వ. భాగము
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments