రామాయణంలో శ్రీసాయి 2



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

సాయికి _ మారుతికి మధ్యనున్న సంబంధం ఏమిటి?

సాయి అన్న పదానికర్ధం తెలుసుకోవడానికి నేను చాంబర్స్ 20 th సెంచరీ డిక్ష్నరీ  వెతికాను.  దక్షిణ అమెరికాలో బ్రెజిల్ అడవులలోని కోతులను సాయి అందురు అని అర్ధం కనిపించింది.

దీనిని బట్టి కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే సాయి (వానరం )  ఉన్నాడని మనకర్ధమవుతోంది.

(చాంబర్స్ డిక్షనరీ సాయి అన్న పదానికి అర్ధం ఉన్న లింక్ ఇస్తున్నాను చూడండి.)

(సాయి పాఠకులకు 20 th సెంచరీ చాంబర్స్ డిక్షనరీ లోని సాయి అన్నపదానికి అర్ధము ఉన్న పేజీ  833 లింక్ ఇక్కడ ఇస్తున్నాను.  చూడండి.

http://archive.org/stream/chambersstwentie00daviiala#page/832/mode/2up  )

ధులియా కోర్టులో బాబా వారు చెప్పిన మాటలను మనమొకసారి గుర్తుకు తెచ్చుకుందాము.

“నావయసు లక్షల సంవత్సరాలు. అందరూ నన్ను సాయి అని పిలుస్తారు. నా తండ్రిపేరు కూడా సాయే. నాది భగవంతుని కులం. నాది కబీర్ మతం.”

రామాయణంలో మారుతి  –   రాముడు ఇద్దరి శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే. మారుతి తన గుండెలను చీల్చి చూపించినప్పుడు శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. 

15వ. అధ్యాయంలో మన సాయిరాముడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.  

“నా భక్తులందరి హృదయాలలోను నేను ఉన్నాను.

మనం మరికొన్ని విషయాలను వివరంగా తెలుసుకుందాము.

రామాయణంలోని బాల కాండలో రామ నామ స్మరణ యొక్క ప్రాధాన్యత గురించి ప్రముఖంగా చెప్పబడింది. క్షీరసాగరాన్ని  మధించేటప్పుడు హాలాహలం పుట్టింది.

ఆ హాలాహలాన్ని స్వీకరించటానికి అటు దేవతలు గాని, ఇటు రాక్షసులు గాని అంగీకరించలేదు. కాని లోక సంరక్షనార్ధం ఎవరో ఒకరు దానిని త్రాగాలి.

అప్పుడు పరమశివుడు ముందుకు వచ్చి ఆ హాలాహలాన్ని,  మింగకుండా తన కంఠంలోనే బంధించి ఉంచారు.  ఈకారణంచేతనే ఆయన గరళకంఠుడుగా ప్రసిధ్ధికెక్కారు.   

గొంతు మధ్యలోనే విషాన్ని బంధించి ఉంచడంవలన పరమ శివుడు ఎంతో బాధకు లోనయ్యారు.  అపుడాయన నిరంతరం రామనామ స్మరణ చేయడం వల్ల ఆబాధనుండి విముక్తిపొందినారు.

 ఈ నాడు సాయి భక్తులు కూడా సాయిరాం సాయిరాం అని ఆయన నామస్మరణ చేయడం వల్ల ఎంతో ప్రశాంతతను పొంది కష్టాలనుండి విముక్తిని పొందుతున్నారు.

త్రేతాయుగంలో ప్రజలు కూడా శ్రీరామచంద్రుని సామాన్య మానవునిగానే భావించారు. కాలక్రమేణా ఆయన భగవంతుని అవతారమని, భగవంతుడే శ్రీరామునిగా అవతరించారని ప్రజలుగ్రహించారు.

ఇదే విధంగా షిరిడీలో ప్రజలందరూ సాయిని ఒక పిచ్చి ఫకీరుగా భావించారు. బాబా మహా సమాధి చెందిన తరువాత ప్రజలందరికి ఆయన గొప్పతనం తెలిసింది.

ఈనాడు కొన్ని లక్షల మంది ఆయన భక్తులు ఆయనను భగవంతునిగా ఆరాధిస్తున్నారు. షిరిడీలోని ఆయన సమాధి మందిరాన్ని దర్శించి ఆయన  అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. 

(మరికొన్ని పోలికలు తరువాయి భాగంలో)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles