Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi
నా పేరు ఇంటూరి సూర్యప్రకాశరావు. నేను తెనాలి, చెంచుపేటలో శ్రీ జ్యోతి కాన్వెంట్ అను విద్య సంస్థను నడుపుచున్నాను.
నేను మొదటిసారి మారీసుపేటలోని బాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను.
తొలి దర్శనంలోనే నాకు మనస్సంతా ఎదో తెలియని ఆనందానికి గురైనది.
అది మొదలు 1998 నుండి ప్రతి గురువారం గుడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాకే అల్పాహారం చేసేవాడిని. 1999 లో శిరిడి వెళ్ళాను.
అప్పటి నుండి బాబా పారాయణ చేస్తున్నాను. పారాయణ మొదలు పెట్టిన తొలినాళ్ళలో (ఒక రోజు బుధవారం) మా వూరి రామాలయం దగ్గర పూలు కొనడానికి వెళ్ళాను.
పోలీసువాళ్లు, పూలబుట్టలవాళ్ళను, పళ్ళబళ్ల వాళ్ళను పక్కకి వెళ్ళి అమ్ముకోమని తరుముతున్నారు.
ఆ సమయములో రోడ్డు అంతా ఖాళీగా ఉంది. నేను పూలు కొనడానికి ఉన్నాను.
ఒక్కసారిగా రోడ్డు వైపు చూశాను, నల్లగా, సన్నగా, గడ్డం కొంచెం పెరిగి ఉన్న ఒకతను బాగా ఎత్తుగా ఉన్నాడు. ఒంటి మీద ఒక్క వస్త్రం కూడా లేదు. పూర్తిగా దిగంబరుడు. వడివడిగా నా వద్దకు వచ్చాడు.
నేను పిచ్చివాడు అనుకోని చేయి సైగతో ఆ..ఆ.. అన్నాను. అంటే పద పద అని. అయన వెంటనే ఆ.. నేను వెళతాగాని నువ్వు పిల్లలకి పాఠాలు బాగా చెప్పు అని వేగంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు.
నాకు మతిపోయినట్లైనది. అయన చూస్తే దిగంబరుడు. నేను మాష్టారునని పాఠాలు చెప్తానని ఆయనకీ ఎలా తెలుసు? నేను తెలిసినట్లైయితే వంటి మీద దుస్తులుండాలి.
దుస్తులు లేవు. పోనీ పిచ్చివాడైతే నేనెవరో ఎలా తెలుస్తుంది. నేను అదే పనిగా చూస్తూ ఉన్నాను. అయన జనంలో కలిసిపోయాడు. నాకు తొలిసారిగా బాబా గారి దర్శన భాగ్యం కలిగినందుకు ఏంటో ఆనందించాను.
ఆ మరు సంవత్సరం కుటుంబంతో కలిసి శిరిడీ వెళ్ళాను.
అప్పట్లో భక్తనివాస్ లో వసతి కోసం ముందుగా లైన్లో నిలబడి అప్లికేషన్ తీసుకోవాలి. ఫామ్ మీద నెంబరు వెయ్యరు. ఫామ్ పూర్తిచేసుకుని మళ్లీ వేరేలైనులో వెళితే రూమ్ ఇచ్చేవారు.
నాకు ఫామ్ తీసుకొనేప్పటికి 11 :00 గం అయింది. బాబా గారిని తలుచుకున్నాను.
బాబా ఏందయ్యా ఇప్పటికే 11 :00 గం అయింది ఇంకా రూమ్ దొరకలేదు లైను చుస్తే పెద్దదిగా ఉంది. రూము ఎప్పటికి దొరుకుతుంది. ఎప్పుడు దర్శనం అవుతుంది అనుకొంటూ నిల్చున్నాను.
అంతలో గళ్లలుంగి, తెల్ల చొక్కా కొద్దిగా గడ్డం పెంచుకున్న ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి ఏంటండీ రూమ్ కోసమా? అని అడిగాడు. నేను అవునండి అన్నాను.
నా సీటులో కూర్చోండి నాకు మా అబ్బాయి లైన్లో ఉన్నాడు మాకు రూమ్ దొరుకుతుంది అని చెప్పి సరిగ్గా 10 మంది ముందుకి నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టాడు.
తర్వాత చూస్తే అతను కనిపించలేదు. అదీ బాబాగారి లీల. తప్పనిసరి అని అనుకుంటే బాబాగారు తన లీలల ద్వారా మనకి సహాయం చేస్తూనే ఉంటారు.
ఇటీవల సరిగ్గా ఒక సంవత్సరం క్రిందట నేను ఒక విషయంలో బాబా గారి మీద అలక వహించాను. దాదాపు 3 నెలలు బాబా గారి గుడికి వెళ్లలేదు.
ప్రతి సంవత్సరం మే నెలలో శిరిడీ వెళ్ళేవాడిని అదీ వెళ్ళలేదు. నా పిచ్చిగానీ నేనేంటి బాబాగారి మీద అలగడం ఏంటి? నేనెంత తప్పు చేశానో తెలుకున్నాను. మరలా బాబా స్మరణ మొదలుపెట్టాను.
నేను ప్రతి సంవత్సరం రెండు సార్లు తెనాలికి దగ్గర్లో ఉన్న కంఠంరాజు కొండూరు అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటాను.
అలా వెళ్ళినప్పుడల్లా పేదవడ్లపూడి అక్కడికి అడ్డదారిలో పోవడానికి 20 నిమిషాలు బండిపై పడుతుంది.
అలాగే అమ్మవారి దర్శనం అయ్యేసరికి 12 :15 నిమిషాలు అయ్యింది. మద్యాహ్న ఆరతి మొదలై ఉంటుంది. బాబా గారి దర్శనం అవుతుందో లేదో అనుకుంటూ నా బైక్ ఆ గుడివైపుకు తిప్పాను.
దారిలో ఆందోళన, నాకు బాబా దర్శనం అవుతుందా? అవ్వదా? సరే బాబా గారికి నాపై కోపం ఉంటె అవ్వదు, కోపం పొతే అవుతుంది అనుకున్నాను. గుడికి చేరుకున్నాను.
గుడికి తాళం వేసింది. అక్కడ పాకలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆయన పూజారి తాళం వేసుకొని వెళ్ళాడు ఇక సాయంత్రం వస్తాడని చెప్పాడు. బాబా గారికి నాపై కోపం పోలేదు అనుకున్నాను.
సరే గుడి చుట్టూ ఒకసారి తిరుగుదాం అనిపించి ఒక చుట్టూ తిరిగి వాకిలి వద్దకు వచ్చాను. చూస్తే అక్కడ పూజారి పళ్లెం పట్టుకుని ఉన్నారు, పళ్లెం పై గుడ్డ కప్పి ఉన్నది. తాళం తీస్తున్నాడు.
నన్ను చూచి ఈ రోజు నైవేద్యం పెట్టడం మర్చిపోయాను, నైవేద్యం పెడదామని వచ్చాను అన్నాడు. నాకు తెలిసి నైవేద్యం పెట్టకుండా మధ్యాహ్న ఆరతి ఇవ్వరు.
ఆరతి జరిగే 25 నిమిషాలు ఆయనకు నైవేద్యం పెట్టలేదని గుర్తుకురాలేదా? అని నాకు అనిపించింది. బాబా గారు నా కోసమే గుడి ద్వారం తెరిపించారు. ఏంటో ఆనందంతో బాబా పాదాల దర్శనం చేసుకున్నాను.
అదే బాబా లీలంటే. ఇలాంటీవే ఇంకాకొన్ని నా జీవితంలో జరిగాయి. మరలా బాబా ఆశీస్సులతో గురుబంధువులతో పంచుకుంటాను.
ఇంటూరి సూర్యప్రకాశరావు
శ్రీ జ్యోతి కాన్వెంట్ తెనాలి.
సంపాదకీయం: సద్గురులీల ( నవంబర్ – 2016)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
- భక్తురాలికి బాబా వారు ప్రసాదించిన దివ్య పూజ అనుభవములు
- బాబా నాకు అలా తినిపించటం నేను మర్చిపోలేని అనుభూతి.-9
- బాబా నువ్వు నా గురుంచి ఆలోచిస్తున్నవా! అని సంతోషించాను.—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments