భక్తుల భాధలు స్వీకరించే భక్తవత్సలుడు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

1915వ సంవత్సరంలో బాపూసాహెబ్ బుట్టీ ఒకప్పుడు 105 °ల అధిక జ్వరంతో తీవ్రంగా బాధపడ్డాడు. అందువలన అతను చాలా బలహీనపడిపోయి బాబా దర్శనానికి కూడా వేల్లలేకపోఎవాడు. బాబా అతనిని ఎవరి వీపు పైన అయిన తమ దర్శనం కోసం రమ్మని చెప్పారు. శ్యామా అతనిని తన వీపుపై తీసుకుని వచ్చారు. బుట్టి చాలా బలహీనమైన స్థితిలో బాబా వద్దకు వచ్చారు.

బాబా అతనిని కూర్చుండబెట్టి, అతనికి పాయాసం, బజ్జీ, దాల్, ఉసాల్ వడ్డించి, తమ సమక్షంలో అతన్ని తినమని చెప్పారు. అతను ఆహారాన్ని తీసుకున్న తరువాత, బాబా అతనిని తిరిగి తన వసతికి వెళ్ళమని చెప్పారు. ఏ మందులు లేకుండా అతని జ్వరం తగ్గింది, అదే సమయంలో బాబా అనారోగ్యం పాలైయ్యారు. కానీ బుట్టి పూర్తిగా కోలుకున్న వెంటనే బాబా కూడా కోలుకున్నారు. ఆ విధంగా బాబా అతని జ్వరమును తాము స్వీకరించారు.

భక్తుల భాధలు తానే భరించే భక్తవత్సలుడు మన బాబా. ఆయనలా తన భక్తుల కోసం తమ శరీరాన్నే కష్ట పెట్టుకున్న కరున్యాముర్తి ముల్లోకాలలో ముక్కోటి దేవతలలో ఎవరైనా ఉన్నారా? ఇంతటి గొప్ప మహనీయుడు ప్రేమతో మనల్ని ఆయన తమ రక్షణలోకి తీసుకున్నారు. నిజంగా ఏమి చేసి మనం ఆ పుణ్యముర్తికి కృతజ్ఞతలు చెప్పుకోగలం.

source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి  9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles