Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Author : Kota Prakasam garu
నాడూ , నేడూ ధర్మంలో మార్పులెదు, మనిషి ఆలోచనాధోరణిలోతప్ప
*****
ఆలొచనలో భయంతోడైతే ,అక్కడ భూతాలు కదలడం మొదలౌతాయి ఆచారoలో ,మూడాచారం మొదలయితే , బుద్ది తాంత్రికంవైపు మొగ్గుచూపుతుంది ..
చీకటిపడిన సమయంలొ పసివాళ్లకు దయ్యం కథలుచెపితే , రాత్రంత భయంతొ కలవరించడం మొదలుపెడతారు ..
పెద్దవాళ్ళైనాసరే చీకటిపడ్డాక శ్మశానం వయిపు తొంగిచూడాలంటే హడలెత్తిపోతుంటారు ..
అదే శ్మశానంలో కాపలావుండే కాటికాపరి సమాధులపక్కనే మంచంమీద గుర్రుపెట్టి నిద్రపోతూంటాడు .. ఆ కాటికాపరి పిల్లలుసైతం పగలైనా , రాత్రయినా నిర్భీతిగ ఆ స్థలంలోనే శవాలమధ్య ఆటలాడుకొంటూ ఉంటారు ..
అందరిలో ఉన్నది ఆ చీమూ , నెత్తురే .. అందరి శరీరాకృతులు ఒకటే ..
ఒక శరీరం స్మశానవాటికలో నిశ్చలంగా నిద్రపోతుంటే , కొన్ని శరీరారాలు దయ్యంపేరుచెపితేనే చీకటిలో వొణికిపోతూంటాయి ..
ఆచారాలు అందించబడింది , సదాచారంతో మనిషికి క్రమశిక్షణ కోసమే ..
ఆచారంలో మూడాచారం మొదలైనపుడు , ప్రతి అడుగులొ సందేహాలు తొoగిచూడడం మొదలౌతాయి .. ఆ భలహీనతకు భయమనే తాంత్రికం తోడై , మనసును అందోళనతో అనిశ్చితుడ్ని చేస్తూంటుంది ..
సనాతనధర్మoతో పాటు , ఆ ధర్మాలకు అణుగుణంగా ఆచరణయోగ్యమైన సద్గ్రంథాలు అందించబడ్డాయి .. ఆనాటి వ్యవస్థకనుగుణంగా అన్నీ సoస్కృతంలోనే వ్రాయబడ్డాయి ..
అందులోని విషయాలను చదవాలన్నా , అవగాహన చేసుకుని లోకానికి ప్రబోధించాలన్నా , పామరులకుకాక , భాషను అధ్యయనంచేసిన పండితుడికే సాధ్యమయ్యేది ..
శ్రవణ,మననాదులవలన పామరులు తరించేవారు అప్పటిలో ..
ఎప్పుడొ ఏడువందల సంవత్సరాలపూర్వం , ఆనాటి కాలమాన పరిస్థులకనుగుణంగా కలియుగంలొ తొలి దత్తావతారాలైన శ్రీపాదశ్రీవల్లభ మరియూ శ్రీ నృసింహస్వామి అవతరాలు ప్రకటమై ఆ అవతారాల ప్రశక్తిని , వారు ఉపదేశించిన బోధోలు గురుచరిత్ర లో పొందుపరచి అందించారు ..
కొందరు అప్పటి కాలానికి అణుగుణంగా అందించబడిన గ్రంథం , ఆనాటికీ ఈనాటికీ కాలానుగుణంగా వొచ్చిన మార్పులలో ఆ థర్మాన్ని పట్టించుకోవసరంలేదని అజ్ఞాన ప్రచారాలు చేసేవాళ్లు ఇప్పుడు కొందరిని గమనించవొచ్చు ..
ఇప్పుడు అదే దత్తావాతారంగా బాబా ప్రకటయ్యారని ప్రతీతి ..ఇప్పటి ధర్మానికి , ఆచారాలకు అణుగుణంగా ఒచ్చిన అవతారమని ప్రచారాలు ..
బాబా ఉన్న కాలంలోనే వాసుదేవయానంద స్వామివారు అవతరించి , నాటి థర్మాన్ని , సాంప్రాదాయాన్ని స్వయంగా పాటించి లొకాదర్శంగా నిలిచారు ..
బాబా సచ్చరిత్రలోకూడా ఎక్కడా సనాతనాన్ని అగౌరవపరచిన సందర్బం కనఁబడదు ..
ఇది మేఘుడు తదితరభక్తాదుల విషయాలలో గమనించవొచ్చు ..
సచ్చరిత్ర ఎవరికితగ్గ బాషలో అయా ప్రాంతాలవారికి అందించబడుతోంది
కాస్త క్షరజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకోగలిగిన స్తాయిలో రచనావిధానం కలిగివుంది ..
ఒకప్పుడు , ఒక వక్త ఒక ప్రాంతంనుండి మరోప్రాంతానికి సంచరిస్తూ ప్రచారాలు చేయవలసివొచ్చేది. సాంకేతిక విప్లవంలో , మీడియా ప్రభావంలో ఒకచోట కూర్చుని చెప్పె ప్రవచనం, ప్రపంచమంతా క్షణంలో వీక్షించి , శ్రవణంచేసే సదుపాయాలు పెరిగిపొయాయి ..
అందుకనుగుణంగా ప్రచారకులు సంఖ్య పెరిగిపోయింది ..
అంతవరకూ పరవాలెదు ..కొందరి ప్రచారకుల మద్యా పొటీతత్వాలు , కీర్తికాంక్షలు అధికమయి , లేని విదానాలు ఉన్నట్టుగా ప్రచారానికి నోచుకొంటూ , జీవానావిధానికే ముప్పుతెచ్చే పరిస్తితిని కలిగిస్తున్నారు ..
కాలపరిస్థితుల్లో మార్పులువొచ్చినా మానశిక దర్మాలు అప్పటికీ , ఇప్పటికీ ఒకటిగానే ఉన్నాయి ..
జీవన విధానాలు మారినా, ఆచారాలు , సాంప్రదాయాలు నీడల వెంటాడుతూనేఉన్నాయ్ ..
ఏ సద్గ్రంథాన్ని చదివినా , ఏసద్గురువును ఆశ్రయించిన , అది సదాచారానికి మార్గమౌతుంది ..
ఒక అవ్యక్తప్రచారం మూడాచారానికి హెతువై , భక్తికంటే భయానికే ప్రేరణకాగలదని పెద్దలమాట ..
శ్రీ గురుదేవోభవ
. ****
Latest Miracles:
- బాబా చరిత్ర వినుటతో కంటి చూపు పెరుగుట
- మేఘశ్యాముడు (మరణం)
- సద్గురుసాయి.
- సాయి మార్గములో పెద్దలు (శ్రీ అచలానంద సరస్వతి, బషీర్ బాబా)
- సాయిబాబా వారిగాధలే నాకు మార్గదర్శి అన్న మహేష్ బాబా.—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “నాడూ , నేడూ ధర్మంలో మార్పులెదు, మనిషి ఆలోచనాధోరణిలోతప్ప”
Madhavi
January 24, 2018 at 5:53 pmSuper explanation in a simple language..Bhale vundhi.sairam