సద్గురువును ఆశ్రయించి జీవించటం చేతకాక , నటించటం మొదలుపెడితే ఆ జన్మే నిరర్ధకమౌతుంది ..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

ప్రకృతిని ఆరాధించి , పాఠాలు నెర్చుకొంటే , పరమగురుని ప్రబోధాలుకూడా జ్ఞానద్వారానికి  స్వాగతం పలుకుతాయి.

***

ఎంత నిజాయతీగా , నిష్కర్షగా బ్రతకాలని నిర్ణయించుకున్నా , కొన్ని సందర్భాలలో నటించకపొతే జీవించడానికి అనుకూలంగా వ్యవహారాలు గడవని కాలమిది ..

కానీ అవసరానికి మించి , బ్రతుకoతా నాటకమైతే , అది ఏనాటికైనా అధోగతిని కలిగించకమానదు ..

బిడ్డ , అబద్దాలు చెప్పి మోసంచేస్తున్నాడని తెలిస్తే,మళ్లీమళ్లీ ఆ తప్పుచేయకుండా , అమ్మ ఓర్చుకోలేక చెంప చెళ్లుమనిపిస్తుంది ..

ఆ తల్లే బడికిపోయేందుకు మారాంచేసే పిల్లవాడికి , వాడిని ఉత్సాహపరిచేందుకు , నెరవేర్చలేని స్థితిలో ఉన్నా , ఏదో ఒక అబద్ధం చెప్పి సాగనంపుతూ ఉంటుంది, వాడు బడికి అలవాటుపడేంతవరకు ..

పక్షులు , పశువులు బ్రతికినట్లు మనిషి బ్రతకాలంటే సాధ్యంకాదు ..

ఒక కుక్కకు పిడికెడుమెతుకులు పెడితె, యజమాని చుట్టూ తిరుగుతూ , తోకాడిస్తూ విశ్వాసాన్ని ప్రకటిస్తుంది ..

మధ్యాహ్నం ఒక ముద్ద అన్నం బయటపెడితె , ప్రతి రొజూ క్రమశిక్షణగా అదే సమయానికి నాలుగు కాకులు వొచ్చి వాలుతాయి ..

పశువులు , కుక్కలాంటి జీవులు ఆదరించే యజమానికి మాలిమౌతాయి ..

పక్షులు ఏయండకాగొడుగులా ఎక్కడ నూకలుంటే అక్కడ అవసరాలు తీర్చుకుని ఎగిరిపోతాయితప్ప పెట్టిన యజమాని ఎవరో గ్రహించే ఇంగితజ్ఞానం వాటికుండదు …

పాముకు పాలుపోసినా , అడవిలొ సింహానికి ఆకలితీర్చినా , ఎదురుపడితే అమాంతం ప్రాణాన్ని హరించే ప్రయత్నం చేస్తాయితప్ప , విశ్వాసాన్ని ప్రకటించే నైజం వాటికుండదు ..

ప్రకృతిలో నాకు ఇరవైనాలుగు మంది గురువులని దత్తులవారి మాట.

ప్రకృతిని పరిశీలనాత్మక దృష్టితో చూడగలిగితే , తొలి గురువు , తల్లి తర్వాత మలిగురువుగా ప్రకృతిలో ప్రతి జీవ , నిర్జీవ పదార్ధాలనుండి సయితం నేర్చదగ్గ పాఠాలుఎన్నో స్పురింపచేస్తాయి …

సంపాదించే భర్తకు తోడుగ సహకరించి , సర్థుకుపోయే యిల్లాలుంటే సంసారం వృద్ధవుతుంది.

ప్రకృతిని రక్షించుకొంటే , ఆ ప్రకృతే నిన్ను రక్షిస్తుందని శాస్త్రవాక్యం ..

తెలిసి , అవగాహనచేసుకొన్న విషయాలపట్ల జీవించాలి , తెలియని విషయాలు శ్రద్ధపెట్టి నెర్చుకొంటే అవగాహన కుదురుతుందికాని , అల్పజ్ఞానంతో అంతా తెలిసినట్టు నటిస్తే , ఏదో సందర్భంలో ఆ బూటకం బయటపడకతప్పదు ..

సమాజంలొ సందర్భాన్నిబట్టి తగినట్టు నటించకపొతే , రాణించడం కష్టం ..

సద్గురువును ఆశ్రయించి జీవించటం చేతకాక , నటించటం మొదలుపెడితే ఆ జన్మే నిరర్ధకమౌతుంది ..

పిడికెడు మెతుకులకు విశ్వాసాన్ని కనబరిచే జంతువులతోబాటు , పాలుపోసి పెంచినా , విషంకక్కే పాములూ ప్రకృతిలో దర్శనమిస్తాయి ..

ఈ ప్రకృతి వైశిష్టాన్ని అందించి , అందులో మనిషి తన పాత్రని ఎలాపోషించాలో , ఆ జ్ఞానాన్ని సమర్థుడైన సద్గురువు అందిస్తాడు ..

నిజయాతీగా , నిష్కర్షగా నిండైన మనసుతో సద్గురువు ప్రబోధాలను అనుసరిస్తె ప్రకృతిలో మనిషి తనకు నిర్ధేశించిన పాత్రను , తన కర్తవ్యాన్ని గుర్తించి , జన్మ సాఫల్యాన్ని పొందగలడని పెద్దల మాట …

జై గురు సాయి సమర్థ

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles