త్వమేవ పితగా ఆకలి తీర్చిన అన్నదాత సాయి–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


  1. Miracle_Sunanda_by Lakshmi Prasanna 3:05

Audio Prepared by Lakshmi  Prasanna

2012 నవంబరులో నా భర్త, నేను బ్యాంకాకులో ఉన్నప్పుడు మూడు వారాల సెలవులు వచ్చినప్పుడు థాయిలాండుకి వెళ్ళాము.

ఒక గురువారం ఉదయం అక్కడి ప్రదేశాలను సందర్శించి, షాపింగ్ చేసాము.

మధ్యాహ్నం ఒంటి గంటకి నా భర్త చాలా అలిసిపోయి, భారతదేశ ఆహారం తినాలనుకున్నారు.

అక్కడ ఆటో రిక్షాలని టాక్ టాక్ అని పిలుస్తారు.

మేము ఒక టాక్సీ అద్దెకు తీసుకుని ఇండియన్ రెస్టారెంటుకి తీసుకువెళ్లాలని అడిగాము.

తనకి మా భాష సరిగా అర్ధం కాలేదు.

కొంత సమయం తరువాత అతను ఒక వీధి మూలన మమ్మల్ని దింపి మా దారి మమ్మల్ని చూసుకోమన్నాడు.

నేను చాలా అలిసిపోయాను. నా భర్తకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించాయి.

నేను సహాయం కోసం బాబాను ప్రార్ధించాను.

అంతలో ఎవరో నా భుజం మీద చేయి వేసినట్టు అనిపించి వెనక్కి తిరిగి  ఒక ముసలి వయస్సు పంజాబీ స్త్రీని చూసి ఆశ్చర్యపోయాను.

ఆమె నాకు అక్కడ సమీపంలోని గురుద్వారాలో ఉచిత ఆహారం (లంగర్) సమర్పిస్తారు అని హిందీలో చెప్పింది.

మేము అక్కడికి వెళ్లేసరికి మధ్యాహ్నం రెండు అయింది. కాబట్టి అక్కడ ఆహారం అయిపోయింది.

ఆమె మాకు రెండు ప్లాస్టిక్ కవర్లలో కొన్ని సబ్జి(కూరలు), మరియు రెండు రోటీలను తీసుకుకొచ్చి ఇచ్చింది.

మేము తనకి కృతఙ్ఞతలు చెప్పుకున్నాము.

మేము తనని ఇండియన్ రెస్టారెంటుకి దారి చూపమని అడిగాము. తాను ఒక టాక్సీని మాట్లాడి సాగర్ ఇండియన్ రెస్టారెంటుకి తీసుకెళ్లింది.

ఆ రెస్టారెంట్ ఓనరుని పిలిచి మేమిద్దరం తన అతిధులమని చెప్పింది.

మేము ఆ రెస్టారెంటులో అడుగు పెడుతున్నప్పుడు అక్కడ బాబా లైఫ్ సైజు ఫోటో చూసి నా గుండె లయ తప్పింది.

నా కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి.

బాబా, మమ్మల్ని తన దగ్గరికి ఎలా  రప్పించుకున్నారో అర్థమై ఆశ్చర్యమేసింది. ఆ ముసలి ఆంటీకి కృతఙ్ఞతలు చెప్పాను.

ఇది ముమ్మాటికీ బాబా లీలనే అనిపించింది.

ఆ రెస్టారెంట్ యజమాని మాకు ప్రేమగా, శ్రద్ధతో శాఖాహారం తయారు చేయించారు.

మేము ప్రశాంతంగా భోజనం చేసాము. మేము భోజనంకి డబ్బు చెల్లిస్తుంటే  యజమాని తీసుకోవడానికి ఒప్పుకోలేదు.

కానీ అతను ఆర్థిక సంక్షోభంలో ఉన్నాడని మాకు అర్థమైంది.

కాబట్టి మేము ఒప్పుకోక కొంత డబ్బు తన జేబులో పెట్టి హృదయపూర్వకంగా కృతఙ్ఞతలు చెప్పుకున్నాము.

ఒక ప్రేమించే తండ్రి లాగా నన్ను నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు నేను బాబాకి ఎప్పుడు ఋణపడి ఉంటాను. 

భక్తురాలు: సునంద ఏ

నివాసం:  చెన్నై

      ~~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~~ 

                                *** సాయి సూక్తి:

 “భక్తి విశ్వాసములతో నా వద్దకు వచ్చిన వారినెవ్వరిని ఎన్నడూ దూరం చేయను”.

Miracle Collected by : Madhavi TV

Miracle Translated and typed by : Prathibha

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “త్వమేవ పితగా ఆకలి తీర్చిన అన్నదాత సాయి–Audio

Sreenivas

Sai Baba…Sai Baba…Sai Baba..Sai Baba…Sai Baba….Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba..Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles