Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
నా భక్తుణ్ణి నేను ఎన్నటికీ పతనం కానివ్వను-సాయిబాబా
Author:Kota Prakasam Garu
అమ్మమీద నమ్మకం , గురువుపైన విశ్వాసం , ఎన్నటికీ పతనంకానివ్వవు.
*******
బ్రతకడానికి అరవైనాలుగు కళలున్నాయి ..
ఆధ్యాత్మిక సాధనకు తొమ్మిది మార్గాలున్నాయి ..
జ్ఞానం అంటే అదో బ్రహ్మాండ పదార్ధం అనిపిస్తుంది తొలుత .. విడమరచి వింటే ఆ పదానికి అర్థం , ఏదీ తెలియనంతవరకు అది అజ్ఞానమే..
ఒక్కొక్కటి అనుభవానికివొస్తూ ఒంటపట్టించుకోడం జ్ఞానం అంటారు.
ఆసక్తిగానో , అనాసక్తిగానో వినడం , చదవడం సులువేకాని , తెలుసుకొన్న ప్రతి విషయాన్ని ఆచరణకు తెచ్చుకోడం కనురెప్పపాటులో జరిగే అద్భుతమైన విషయంకాదు ..
ఎవరి ఆకలిని వాడు తీర్చుకొనే ప్రయత్నానికి ఏదో వృత్తిని చేపట్టాలి . ఆ వృత్తికి న్యాయంచేస్తే , పనిచేసే సంస్థకూడా వాడిని ఆదరించి , వాడి కష్టానికి తగ్గ వేతనాన్ని సమకూర్చి గౌరవిస్తుంది …
వృత్తిని గౌరవించి , కష్టపడేవాడికి బ్రతుకుతెరువుకు ఎన్నడూ లోటనేది కలగదు.
విత్తనం నాటి , ఒక ఎత్తుకు మొలక ఎదిగేంతవరకూ నీరుపోస్తూ సంరక్షించుకోవలసింది మనిషి కర్తవ్యం.
ఎదిగినచెట్టు , భూమిలోని సారంతో శాకోపశాఖలుగా విస్తరిoచి , ఫలాలను అందించడం ప్రకృతిధర్మం ..
ఆశ్రయించినవారి మనసుకు విత్తనమనే జ్ఞానోపదేశం చేసి , అవగాహన కుదిరేంతవరకూ , చేయిని వదలక సంరక్షించడం సద్గురు బాద్యత ..
విషయజ్ఞానం ఒంటపట్టించుకొని , ఆత్మావగాహనతో మనసును విస్తరించుకొని ఆ జ్ఞానఫలాన్ని అనుభవించే ప్రయత్నంచేయడం సాధకుడి ధర్మం.
చట్టాలు , శాసనాలు మనిషి అవకాశవాదంలో , మారుతున్న వ్యవస్థకు రక్షణగా అనేక మార్పులు జరుగుతూంటాయి ..
వేదమూ , శాస్త్రమూ , నీతీ , నియమము అవి ఎప్పటికీ శిలాశాసనాలే ..మనిషి చుట్టూ అవి పరిభ్రమించవు ..మనిషి తనజన్మ సార్ధకతకు వాటిని ఆశ్రయించి , సత్ఫలితానికి తాపత్రయపడవలసిందే ..
జబ్బుచేసి , ముదరపెట్టుకొంటే అది ప్రాణానికే హానికలిగించవొచ్చు ..
కష్టమైనా ప్రారంభదశలో రెండు చేదు గుళికలు మింగి వోర్చుకొంటే , ఆ జబ్బు దరిదాపుల్లో లేకుండా పోతుంది ..
గురువును ఆశ్రయించడం కాకతాళీయంగా కూడా జరగవొచ్చు .. యిలా ఎందరో , బాబా సశరీరంగా ఉన్నప్పుడు దర్శించుకొన్న సంఖ్య లక్షల్లోనే ఉంటుంది ..అయినా చివరివరకూ ఆయన చూపిన మార్గాన్ని అనుసరించి , ధన్యులైనవారెందరో సచ్చరిత్రలో మిగిలిన పాత్రలే ప్రత్యక్ష సాక్షులు ..
అమ్మ ఎంత ప్రేమగలదే అయినా , బిడ్డకు సుస్తీ చేస్తే , వాడి క్షేమంకోసం బలవంతంగా అయినా చేదుమందును మింగిస్తుంది ..
ఆవరించిన మేఘంలా అజ్ఞానం తొలిగి మనసుకు జ్ఞానం విస్తరించి , జన్మ ఫలాన్ని పొందేందుకు , ఆచరణలో కొన్ని కఠిన నియమాలను పాటించవలసిందే అని పెద్దలమాట ..
శ్రీ గురు చరణార్పణమస్తు
******
Latest Miracles:
- నా మట్టి సమాధానమిస్తుంది,నా సమాధినుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని బాబా ఇచ్చిన అభయ హస్తపు జల్లులను గురూజీ నిరూపించారు.
- నీ కొడుకు తాత్యాని నేను కంటికి రెప్పలా కాపాడతాను. ఈ క్షణం నుంచి తాత్యా బాధ్యత నాది.’’
- ” మీ అమ్మాయికి అబ్బాయి పుట్టే అవకాశం లేదు, అయినా గాని నా శరీరంలో సగ భాగం కత్తిరించి, ఈమెకు కొడుకు పుట్టే విధంగా నేను చేస్తాను అని ” బాబా మాటిచ్చారు.
- నా మొబైల్ లో ఎవరో message పెట్టారు జ్యోతిష్యుల prediction ను నమ్మవద్దు.నేనుండ భయమేల?-ఇది నా సాయిబాబా అనుభవం.
- గురువుగారు, బాబా నేను అడిగిన టైమ్ లో నా జోకా దొరికేలా చేశారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments