భౌతిక సుఖాలవెనుక భయం నీడలా వెంబడిస్తూ ఉంటుంది.అలౌకిక సాధనలో ఆత్మస్థైర్యమెప్పుడూ రక్షణకవచంలా ధైర్యాన్ని నూరిపోస్తుంటుంది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

భౌతిక సుఖాలవెనుక భయం నీడలా వెంబడిస్తూంటుంది …అలౌకిక సాధనలో ఆత్మస్థైర్యమెప్పుడూ రక్షణకవచంలా ధైర్యాన్ని నూరిపోస్తుంటుంది ..

**

ఏమీలేని సామాన్యుడుకూడా , ఉన్న ఆ కాస్త దొoగలపాలు కాకుండా , జాగ్రత్తగా తలుపులు బిగించి పడుకొంటాడు ..

కాస్తో ,కూస్తో కూడబెట్టుకొన్నవాడు భద్రతకోసం ఒక కుక్కనుకూడా కాపలా ఉంచుకొంటాడు.

బాగా వెనకేసున్నవాడు , నాలుగు కుక్కలతోపాటు కాపలాకు కెమెరాలతో రక్షణగా భద్రత సిబ్బందినికూడా వినియోగించుకొంటాడు …

యిన్నిటినీ అనుగ్రహించే మహాత్ములు మాత్రం తమ ఖజానాను కొల్లగొట్టుకు పోయేవారికోసం ఎప్పుడూ వారి తలుపులు బార్లాతీసి , స్వాగతం పలుకుతూ ఉంటారు …

మనిషి తాను పొందుతున్న నశించిపోయే ప్రతి భౌతిక సౌకర్యానికికూడా భద్రతకోసం రక్షణ కోరుకొంటూఉంటాడు ..

ఎన్నటికి నశించిపోని జ్ఞానం మాత్రం , మనిషి, మనిషిని కొల్లగొట్టుకుపొమ్మని ద్వారాలు తెరిచి మరీ ఎదురుచూస్తూంటుంది …

లౌకిక ప్రయోజనాలతో ముక్కోటి దేవతలను ఆశ్రయించినా , ఆ ప్రయోజనాల భద్రతకు , భయం రక్షణ కోరుకొంటూనే ఉంటుంది ..

అలౌకిక ప్రయోజానాలకోసం పరితపించేవాడికి ఆత్మస్త్థెర్యం ముందుండి రక్షణగా నడిపిస్తూంటుంది ..

మహాత్ములను ఆశ్రయించికూడా మనిషి కోరికలు స్వప్రయోజనాలకు పరిమితమైతే , భద్రతకోసం భయం నీడలో బ్రతక్కతప్పదు .. విశ్వాసం కుదిరి జన్మ ప్రయోజనాన్ని సాధించుకోవాలనే తపన , ఆరాటం మనసుకెప్పుడూ రక్షణకవచాలుగా అండగా నిలువగలవని పెద్దలంటారు. 

శ్రీ గురుబ్యోనమః
***

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles