కరుణించి కటాక్షించిన బాబా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తుడు: రాజు

నివాసం: గుంతకల్లు

జనార్దన్ గారు ఒకసారి తనకు జరిగిన అనుభవాన్ని ఇలా వివరించారు.

నేను ఒకరోజు మనీ తీసుకోవటానికి ATM కి వెళ్ళాను అక్కడ సెక్యూరిటీ నన్ను చూసి, నాకు ఎందుకో మీతో మాట్లాడాలి అనిపిస్తుంది అని కూర్చోమని చెప్పి టీతెప్పించి త్రాగుతూ మాటల్లో ఇలా చెప్పాడు.

సర్ నా పేరు రాజు గుంతకల్లులో మా ఊరిలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం అని సికింద్రాబాద్  స్టేషనులో ట్రైన్ ఎక్కి పైన బెర్త్ లో పడుకున్నాను.

బాగా నిద్ర పట్టింది లేచేసరికి ఉదయం 11 అయింది.

చూస్తే అందరు ఏదో హిందీలో మాట్లాడుతున్నారు.

నేను ఎక్కడికి వచ్చానా అనుకుని అక్కడి వాళ్ళని అడిగితే అది మన్మాడ్ అని తెలిసింది.

ఓహో ఇక్కడికొచ్చానా సరేలే శిరిడీ దగ్గరలోనే కదా! చూసి వెళదాం అనుకున్నాను.

నా చేతిలో  200  రూపాయలు మాత్రమే ఉన్నాయి.

లాకర్ తీసుకుని, స్నానం చేసి వేరే డ్రెస్ లేక అదే సెక్యూరిటీ డ్రెస్ వేసుకుని దర్శనంకి వెళ్లేసరికి అప్పుడే ఒక VIP దర్శనంకి వస్తున్నారు.

నన్ను ఆ డ్రెస్ లో చూసి, నేను కూడా వాళ్ళ సెక్యూరిటీ ఆయనే అనుకుని పద పద అనుకుంటూ వాళ్లతో పాటు లోపలకి తోసేశారు.

లోపలికి వెళ్ళాక అక్కడ VIP కి వేయాల్సిన దండ తీసుకుని వచ్చి నా మెడలో వేసారు.

సరే అనుకుని ఆనందంగా దర్శనం చేసుకున్నాక ఆకలి వేస్తుంది ఎలా అనుకుంటుంటే ఇందాకటి వాళ్ళు నన్ను వాళ్లతో పాటు మంచి హోటలుకి తీసుకెళ్లి వాళ్లతో పాటు భోజనం పెట్టించారు.

తరువాత ఇంటికి వెళ్ళడానికి చేతిలో వంద రూపాయలే ఉన్నాయి ఎలా అని ఆలోచిస్తుండగా వెనక నుండి ఎవరో చేయి వేసి బావా ఇక్కడ ఉన్నవేంటి? అని అడుగుతుంటే, చూసేసరికి మా  బామ్మర్ది అక్కడ ఉన్నాడు.

తనకు జరిగిన విషయం చెప్పి, ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేవు.

ఒక వెయ్యి రూపాయలు ఇవ్వు అని అడిగితే, వెయ్యి ఏంటి బావా నేను నీకు మూడు వేలు బాకీ ఇవ్వాలి కదా! ఇస్తాను తీసుకో అని, ఎలాగూ ఇంతదూరం వచ్చావు కదా, అక్కల్ కోట, గాణ్గాపురంకి  కూడా వెళ్లి దర్శనం చేసుకుంటున్నాం మేం అందరం.

మాతో పాటు రా బావా అంటే వాళ్ళతో వెళ్ళాను.

గాణ్గాపురంలో సంగమంలో స్నానం చేసి తిరిగి వస్తుంటే,అక్కడ మధ్యలో జీప్ అక్సిడెంట్ అయి భుజంకి కొంచెం దెబ్బ తగిలి మళ్ళీ సెట్ అయింది, కానీనొప్పి తగ్గలేదు.

ఇంటికి వచ్చాను. మా ఆవిడకి ఎప్పటి నుండో పొత్తి కడుపు నొప్పి ఉంది.

పిల్లలకి పెళ్లి కాలేదు. ఇప్పుడు నాకు ఈ నొప్పి బాధిస్తుంది. ఏంటి బాబా ఇది నన్ను అలా తీసుకువెళ్లి లేని నొప్పి ఇచ్చావు.

ఇప్పుడు నేను ఎలా చూసుకోవాలి ఇవన్నీ.

అనుకుంటే, బాబా కలలో కనపడి అయ్యా నువ్వు గాణ్గాపురంలో స్నానం చేసావు కదా! అదే స్థలంలోకి వెళ్లి మళ్ళీ స్నానం చేసి రా నీ భుజం నొప్పి, మీ ఆవిడకి కడుపు నొప్పిపోయి, మీ పిల్లలకి పెళ్లి కుదురుతుంది అని చెప్పారు.

వెంటనే గాణ్గాపురం వెళ్లి సంగమం లో స్నానం చేశాను.

బాబా చెప్పినట్టుగానే నాకు, మా ఆవిడకి నొప్పి తగ్గింది.

కొన్ని రోజుల తరువాత ఒక బ్యాంకులో పనిచేసే అబ్బాయి సంబంధం మా అమ్మాయికి వచ్చింది, కానీ అబ్బాయి తల్లితండ్రులు బాగా కట్నం అడిగారు.

నా వల్ల కాదు అని వాళ్ళకి చెప్పేసాను.

కానీ అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చి, వాళ్ళ మేనేజరుని తీసుకువచ్చి అంకుల్ నాకు మీ అమ్మాయి నచ్చింది.

మా అమ్మ వాళ్ళకి నేను చెప్పుకుంటాను, కానీ మీకు పెళ్లి ఖర్చులకి కూడా డబ్బులు లేవు కదా, లోన్ ఇప్పిస్తాను తీసుకోండి అని లోన్ ఇప్పించి, వాళ్ళ తల్లిదండ్రులకి ఏదో నచ్చ చెప్పి మా అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.

ఇప్పుడు మా అమ్మాయి, మేము సంతోషంగా ఉన్నాము.

ఇదంతా బాబా పుణ్యమే.

ఇది వింటుంటే “పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టు నేను నా భక్తులని నా దగ్గరికి లాగుతాను” అని బాబా చెప్పినది గుర్తుకు వస్తుంది.

తన భక్తుడిని తన దగ్గరికి రప్పించుకోవడమే కాకా, తన బాగోగులు చూసి తన కష్టాలు తీర్చారు బాబా. నిజంగా బాబా ప్రేమ యెంత గొప్పదో కదా!

      ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

Miracle Collected by : Madhavi Appam

Miracle  typed by : Prathibha

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles