Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
వొత్తినిబట్టి వెలుతురు , ఆసక్తిబట్టి యోగ్యత సిద్ధించగలవు.
**
మనిషికైనా , మృగాలకైనా పుట్టడం , పొవడం అన్నది జీవితంలొ ఒక్కసారే సంభవిస్తుంది ..
ఆయుష్షు ఉన్నంతవరకూ శరీరానికి రెండుపూటలా తగినంత ఆహారాన్ని నియమంగా అందించకపోతే , ఎప్పుడో కబళించబోయే మృత్యువు , రెండోరోజుకె ఆహ్వనం పలుకుతుంది .. బ్రతకడానికి తినాలి .
తినేందుకే పుట్టామనుకొంటే అది ప్రాణానికే ప్రమాదం ..
పులి , సింహం రెండూ క్రూరమృగాలైనా , వాటి నియామాల్లో తేడా కనిపిస్తుంది.
సింహానికి ఆకలివేస్తేనే వేట మొదలుపెడుతుంది ..
పులికి ,అప్పుడె కడుపునిండినాసరే , అల్పజంతువులు ఏవి కంటపడినా పంజా విసరడానికి సింద్దంగా ఉంటుంది ..
మనుషుల్లో కూడా ఇలాంటి తేడాలే గమనించవొచ్చు ..
భోగాలు అనుభవించాలన్నా , యోగాన్ని పొందాలన్నా , కనీసం దేవుడంతటివాడు అవతారమెత్తి థర్మాన్ని ప్రబోధించాలన్నా , అది శరీరమన్నదిలేక సాద్యంకాదు ..
ప్రమిదలో సరిపడేంత నూనెనుపోసి వొత్తిని వెలిగిస్తే , అది దేదీప్యమానంగా వెలుగును ప్రసరింపచేస్తుంది ..
అడుగంటుతున్న వెలుతురుకు , ఆవిరైపోతున్న నూనెను గమనించుకొంటూ , అప్పుడప్పుడూ ప్రమిదలో నూనెని భర్తీచేసుకొంటే , అదే అఖండదీపమై , కొండెక్కకుండా , దీపం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది ..
గమనించుకోక , ప్రమిదకు మించి నూనెని అధికంగా వినియోగించినా , నూనె వొత్తిడితో వెలిగేదీపంకూడా అంధకారాన్ని అందిస్తుంది ..
అందుకె అంటారు ” ప్రమిదనుబట్టి నూనె , సాధనాసక్తిబట్టి యోగ్యతాఫలం సిద్ధిస్తుంది ” అని ..
ప్రమిద , వొత్తి ఈ రెండూ నిర్జీవ పదార్దాలే ..
ఈ పదార్దాలు రెంటి కలయికతో , నూనెని ఆధారంచేయక జ్యొతి ప్రజ్వలనం కాదు ..
అలా ప్రాణాధారంలేకుండా శరీరానికి , కట్టెకు తేడా ఉండదు ..
శరీరం , ప్రాణం ఈ రెండూ ప్రమిద , వొత్తులులాంటివే , ఆహారం ఆధారంలేక ప్రాణమనే జ్యోతి శరీరమనే కట్టెను నిరాకారంచేస్తుంది.
భోగానికైనా , యోగానికైనా ప్రాణాధారం ఉన్నంతవరకే అది సాధ్యమౌతుంది ..
శరీరం భోగానికే పరిమితమయితే , ఉన్నంతవరకూ అనుభవించి , నిరాకారాన్ని పొందుతుంది ….
జన్మకారణాన్ని గమనించి , మనసు జ్ఞానయోగాన్ని సాధించుకునే ప్రయత్నములో పడితే ప్రాణాధారమనే వొత్తికి జ్ఞానమనే తైలం అందజేయపడి , శరీరం కట్టెగా నిర్జీవమైనా , ఆత్మ అఖండజ్యోతిగా ఉత్తమ జన్మనో , మోక్షార్హతనో పొందే యోగ్యత సంప్రాప్తంకాగలదని పెద్దలమాట …
సర్వం శ్రీగురు పాదార్పణమస్తు
***
Latest Miracles:
- ‘‘ముల్లోకాల్లోనూ మీరే! ముమ్మూర్తులూ మీరే’’
- ఆరతి పాడాలి అని కోరుకున్న ప్రతిసారి, భక్తుని కోరికను నెరవేర్చుతున్న బాబా వారు.
- ఒకటి కోసమే రెండు… మహనీయులు @2020 – జనవరి 10
- ‘‘నేనే కాపాడతాను. బయిజాకిచ్చిన మాట తప్పుతానా?’’
- నీ బాధలు తీరాలంటే ఒకరే దిక్కు. ఆయనే షిరిడీ సాయిబాబా
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments