ఆరాధనలో నిజాయతి ఉంటే ప్రళయానికి కూడా మనసు చలించదు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

ఆరాధనలో నిజాయతీ ఉంటే ప్రళయానికి కూడా మనసు చలించదు. దోషమెరిగిన మనసు అభద్రతాభావంతో నిత్యం కుములుతూనేవుంటుంది .
****

అనంతకోటి అపాయాలకు శతకోటి ఉపాయాలని వెనకటికోసామెత ..

ప్రపంచం యావత్తు గాలించినా , దిగజారి బ్రతుకుతూ ,లోకం దృష్టిలో అప్రతిష్టను మూటగట్టుకోవాలని ఏ వొక్కరికీ ఉండదు ..

ఒకహత్యచేసినా , వందమందిని పొట్టనపెట్టుకొన్నా విధించే ఉరిశిక్ష ఒక్కటే అన్నట్టు , ఏదో సందర్బంలో కక్కుర్తిపడినా , పరిస్థితినిబట్టి అబద్దం చెప్పాల్సివొచ్చినా , చేసిన తప్పును వొప్పుకొనేందుకు అహం అడ్డొచ్చి , కప్పిపుచ్చుకొనె ప్రయత్నంలో తమనుతాము సమర్ధించుకొంటూ ఒకటికి నాలుగు అబద్ధాలు కల్పించి చెప్పుకొంటూ తప్పించుకొడం ఒక అలవాటైపోతూవుంటుంది …

సూర్యాస్తమయింది మొదలూ రాత్రి నిద్రకు జారేంతవరకూ ప్రతి మనసూ తనదోషాన్ని తాను ఆత్మవిమర్శ చేసుకొంటూ , ఇక రేపటి నుండి ఏ దోషానికి వొడిగట్టకుండా ఉండాలని తీర్మానం చేసుకొంటూ ఉంటుంది , మరలా ఉదయపు సూర్యుడు నిథానంగా నింగిపైకి ఎగబాకినట్టు , మనసు తను పాడిన పాతపాటనే పగలంతా పాడుతూ ఉంటుంది ..

ఒక నియమంతో , నిజాయితీగా ఒక సిద్ధాంతానికి కట్టుబడినవాఁడు దేనికీ చలించక ,ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శిస్తుంటాడు , అసత్యానికి , అధర్మానికి పాలుబడేప్రతివాడు, క్షణం,క్షణం అభద్రతాభావంతో కుచించుకుపోతూంటాడు …

వైద్య శాస్త్రాన్ని శ్రద్దగా అభ్యసిస్తే మంచి హస్తవాసిగల వైద్యుడిగా లోకంచేత ప్రశంసలందుకొన్నట్టు , ఒక దేవీ ,దేవతారాధనలోకానీ , ఒక ఉత్తమగురువులను ఆశ్రయించి శ్రవణంచేసిన బోధలవలనకానీ , అవగాహనతో సద్గ్రంధాల పారాయణతో , విశ్వాసముంచి , శ్రద్దగా కర్మాచరణ మొదలయితే , అది ఉత్తమ సంస్కారాలను అందిస్తుంది ..

ప్రతిక్షణం ఉనికిని గమనించి , తత్వానుసారం మనసు గమ్యం వైపు దృష్టిసారిస్తే , అదే ఉత్తమ గతులకు సోపానం కాగలదని పెద్దలమాట ..

జయ్ గురుదేవ సాయి సమర్థ
****

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles