Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
ఎందుకె మనసా ఎగిసి, ఎగిసి పడేవు ఏమున్నది నీలో అని మిడిసిపాటుపడేవు
***
ఆరడుగులమనిషి , అరవై అంతస్థుల మేడనెక్కినా , విమానమెక్కి ఆ ఎత్తున ప్రయాణంచేసినా , రాకెట్టులొ దూసుకుపోతూ ఎదో ఒక గ్రహం మీద కాలుమోపినా , యదగాల్సినది ఎంతో ఉందని తెలియక , ఎదిగానంటూ మనిషి ప్రకటించుకోడం ఎండమావిలో నీరందిందని చెప్పుకోడంలాంటిదే ..
సముద్రంలొ నీటిని ఔపోసనపట్టవొచ్చు భూమిని చాపలా చుట్టవొచ్చు , ఓపిగ్గా ఆకాశంలో నక్షత్రాలను సరిగ్గా లెక్కగట్టి చెప్పవొచ్చు , సృష్టికి మూలమైనవాడి ఆది , అంతాలను గ్రహించటం , ఆదిమావిష్ణువుతో అణుక్షణం వెన్నంటి ఉండే వేయిపడగల ఆదిశేషునికి , నాలుగువేదాలకు కూడా సాద్యంకాని విషయమే అని తొలిభాగంలోనే సచ్చరిత్రలొ , మిడిమిడిజ్ఞానాన్ని గురించి హెచ్చరించబడింది ..
కొన్ని సాధనా మార్గాలలో క్షుద్రోపాసన చేసి , అతీంద్రయశక్తులు సాధించినవారు ఉండవొచ్చు , సచ్చరిత్రలొ కుశాబాహులాగా .. నాలుగుమాటలు నేర్చి ,మిడి , మిడి జ్ఞానంతో ఆకర్షించి , లోకాన్ని తనచుట్టూ తిప్పుకొంటూ , తనకన్నా అధికులు ఎవరూ లేరనే అజ్ఞానులుండవొచ్చు ఇదే సచ్చరిత్రలొ కనిపించె కపటగురువు జవ్హర్ అల్లీని పోలిన పాత్రల్లా .. .
సంగీతం , తత్సంబంధిత రాగాలు ఎప్పుడొ పుట్టిఉండవొచ్చుకానీ , సంగీత ప్రియులకు , సంగీతమంటే టక్కున గుర్తుకొచ్చేది త్యాగయ్యే ..
త్యాగయ్య , అన్నమయ్య , తుకారాం వీరి సంగీతాన్ని అనర్గళంగా గానంచేసి లొకాన్ని ఉర్రూతలూగించే ప్రసిద్ధిపొందిన కళాకారులుండవొచ్చుకానీ , ఆ సంగీతానికి మూలమైనవారితో తమనుతాము పోల్చుకోడం అది వారి అజ్ఞాన , అహంకారాలకే చిహ్నమౌతుంది ..
సృష్టిసారాన్ని ఆశక్తితో అభ్యాసంచేసి , ఆ అనుభవాన్ని లోకంతో పంచుకోడం నిజ వక్త లక్షణం ..
వినయవిధేయతతో ఉన్నదేదో అవగాహనకు తెచ్చుకొని , ధర్మానికి అనుగుణంగా తనమనసును మలుచుకోడం నిజ శ్రోత లక్షణం …
వక్త , శ్రోత తమ నిజస్థితిని గుర్తిస్తే అది జ్ఞానాన్ని ఇనుమడింపచేస్తుంది.
ఇసుమంత జ్ఞానంతో ఏదో సాధించామని విర్రవీగి , ఎవరికివారే ప్రవక్తల్లా ప్రవర్తించే ప్రయత్నం చేస్తే , ఆ మిడి , మిడి జ్ఞానమే వారి అజ్ఞానికి నిలువెత్తు సాక్షంగా మిగలగలదని పెద్దలమాట …
శ్రీ సద్గురుభ్యోనమః
***
Latest Miracles:
- సాయి మహమ్మదీయుడా? ……సాయి @366 ఫిబ్రవరి 6….Audio
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (14)నిష్ఠ (ధృఢమయిన నమ్మిక) (1వ.భాగం)
- బాబా చరిత్ర వినుటతో కంటి చూపు పెరుగుట
- ఎక్కడ విన్నా సాయి నామమే,ఎక్కడ చూసిన సాయి రూపమే.
- సద్గురుసాయి.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments