ఆశ్రయించిన వారి సంస్కారానికి తగినట్టు, వారికేది శ్రేయోమార్గమో , దానిని అనుగ్రహిస్తారు సద్గురువు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

చీపురులో పుల్లనైనా గురువుగ పెట్టుకో , అది నిన్ను తీరంచేర్చగలదు /సాయి సచ్చరిత్ర /
**

దేశం మొత్తంలో చెలామణి అయ్యే డబ్బుకు రూపం ఒక్కటే అయినా , సంపాదించే మార్గాలు , దానిని వినియోగించుకొనే పద్దతులు అనేక విధాలుగా ఉంటాయి.

ప్రాణాధారశక్తిని నింపుకొనే కడువులు ఒకటే అయినా అభిరుచినిబట్టి , తినేపదార్ధాలు ఒకటిగా ఉండవు …

ఒక తల్లికడుపున పుట్టిన బిడ్డలకు వారి మానశిక తత్వాలు కూడా ఒకలా ఉండవు ..

ఒక విషయాన్ని గురించి చర్చలు మొదలయితే ,ఒకే విషయంపై భిన్నకోణాల్లో అభిప్రాయాలు వెల్లడౌతుంటాయి ..

ఒకే గురువును ఆశ్రయించేవారు ఎందరున్నా , వారి మనోసంకల్పాలు , అనుసరించె విధానాలలో కూడా తేడాలుంటాయి ..

అన్ని దిక్కులకు అధిపతివి నీవే , నీకిదే దివ్యనీరాజనం అని ఒకరు హారతినిస్తే , మరొకరు అదే హారతిని ఎనిమిది దిక్కులకు తిరిగి నీరాజనం సమర్పించుకొంటారు ..

హారతిని స్వీకరించే దైవం ఒక్కడే అయినా , హారతిని యిచ్చే స్వభావాలలో కూడా భిన్నమైన పద్దతులు పాటిస్తుంటారు .

ఆద్యాత్మిక మార్గాలు అనేకమున్నా , ఈ షిరిడీనుండికూడా వొకమార్గము కలదు అంటారు సాయి ..

ఉపదేశం అన్న పదం ఒక్కటే అయినా , అయా గురువులు ఉపదేశించే మంత్రం , ఆయా గురువులు ప్రబోధించే విధానాన్నిబట్టి ఉపాసనామార్గాలు కనిపిస్తుంటాయి ..

తత్వాల సారం , ఉపాసనా విధానం బిన్నంగా ఉన్నా , ప్రవహించే జీవనదులన్నీ సముద్రగర్భంలో విలీనమయినట్లు , చివరకి ఏ ఉపాసకుడైనా పొందె కైవల్యస్థితి ఒక్కటే ..

ఇందుకు రమభగవాన్ , రామకృష్ణ పరమహంస , బాబాలాంటి మహాత్ముల ప్రబోధాలలోని ఆంతర్యాలలో అర్ధంచేసుకోవొచ్చు ..

పరిమితమయిన బుద్దితో ఆశ్రయించిన శిష్యుడు , గురువు మనోనైజాన్ని గుర్తించడం కష్టం ..

ఆశ్రయించిన వాడి సంస్కారానికి తగినట్టు , వాడికేది శ్రేయోమార్గమో , దానిని అనుగ్రహిస్తాడు సద్గురువు ..

సాధువులు ఎందరున్నా , వారిని గౌరవించటం ఒక సధ్సాంప్రదాయమే అయినా , చేసే సాధనలో ఒక గురువు ఆదేశించిన విధానానికి మనసు లఘ్నంకాక , అనేక మార్గాలకు మనసు అన్వేషణలోపడితే , ఏకాగ్రత కుదరక చేరవలసిన లక్ష్యానికి చేరువకావడం కష్టమని పెద్దలంటారు.

జయ్ సద్గురు సాయి సమర్థ
***

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles