సద్బోధలలోని ఆంతర్యాలను గ్రహించి అనుసరించే మనసు ప్రతిక్షణం అది అమృతధారను అనుభవిస్తూ ఉండగలదు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

బాబా పలుకులెన్నడూ భావగర్భితంగా ఉండెడివి అంటుంది సచ్చరిత్ర.
***

” శ్రీ ” అనే అక్షరానికి మహావిష్ణువు , మహాలక్ష్మి , అమృతం , విషం , సాలెపురుగు ఇలా సందర్భాన్నిబట్టి ఆ అక్షరానికి అర్థం స్పురిస్తుంటుంది ..

అంతేకాక ఎవరిపేరునైనా సంబోధించే ముందుకూడా శ్రీ , శ్రీ పలానావారు అని గౌరవవాచకంగా వినియోగిస్తుంటారు .

ఇలా కొన్ని పదాలు వినియోగించే సందర్భాన్నిబట్టి అర్ధాలు మారటం అందరికి అనుభవంలోని విషయమే ..

తెలుగు పరీక్షల్లో ప్రశ్నల పత్రంలో కూడా ఒక పద్యాన్ని ప్రశ్నగా ఇచ్చి , ఆ పధ్యానికి ప్రతిపదార్ధం , తాత్పర్యం రాయమంటారు , చదివి నేర్చుకొన్న పద్యంలో అంతరార్ధం ఎంతవరకు విద్యార్థికి బోధపడిందో , అంతవరకే వాడికి మార్కులుకూడా ..

ఇలా ఆంతర్యాన్ని ప్రబోధించే ఓ పాతకద అందరికి తెలిసిందే అయినా , అలాంటివి మళ్ళీ , మళ్లీ గుర్తుచేసుకోడం , మనసుకు పదును పెట్టడంలాంటిదే .

పూర్వం ఓ మోతుబరి రైతు ఉండేవాడు,, కష్టపడి వ్యవసాయంలో బాగ సంపాదించి , గౌరవంగా బ్రతికేవాడు ..

కలిగిన ముగ్గురు మగపిల్లలు పెరిగినా , చదువూ సంధ్యలు ఒంటపట్టక , జులాయిల్లా తయారై , తనతర్వాత వీళ్లపరిస్థితి ఎలా అని ఆలోచనతో , ఆ రైతు మనోవ్యధతో మంచంపట్టాడు ..

ఆఖరిక్షణాలు సమీపించాయి , ముగ్గురినీ పిలిచి , ” పొలంలో మీకోసం లంకెబిందెలు పాతిపెట్టాను , వాటితో సుఖంగా ఉండండి ” అంటూ అసంపూర్ణంగా ఏప్రాంతంలో అని చెప్పకుండానే ప్రాణం విడిచాడు ..

పొలంలో ఎక్కడ పాతిపెట్టాడో , అర్ధంకాక ముగ్గురూ పలుగు గడ్డపారలు పుచ్చుకొని పొలమంతా త్రవ్విచూసి గాలించారు . అయినా లంకెబిందెల ఊసులేదు ..

ఎలాగూ పొలమంతా త్రవ్వాము కదా అని విత్తనాలు చల్లి నీరుపెట్టారు .పంట ఏపుగా పెరిగి , ఊహించనిరీతిలో ఫలం చేతికందింది .

అప్పటికర్ధమైందివాళ్లకు , తండ్రి చెప్పిన లంకెబిందెలు మర్మం ఏమిటో..

పుట్టగానె జీవితమంటె ఎమిటో అర్ధంకాదుకనుకనే , అడుగడుగునా పెద్దవాళ్ళ హెచ్చరికలు వినబడుతుంటాయి ..

గ్రంథాలు ఎంత కంఠస్థపెట్టినా , అందులోని ఆంతర్యాన్ని ప్రబోధించేందుకు అనుభవమున్న పెద్దలు ప్రచారాలతో వెంటఁబడుతుంటారు ..

పుణ్య , పాపఫలితాలు జన్మాంతరంలో పైన నిర్ణయించబడతాయంటారు ..అవి కంటికి , మనసుకు గోచరించేవికాదు ..

సద్బోధలలోని ఆంతర్యాలను గ్రహించి అనుసరించే మనసు ప్రతిక్షణం అది అమృతధారను అనుభవిస్తూ ఉండగలదని పెద్దలమాట ..

సద్గురువారం , సాయి సుభాశీస్సులతో

జయ్ గురు సాయి సమర్థ
***

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles