Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
తెరవెనక సూత్రధారిని గుర్తెరగనంత వరకు , తెరపైన పాత్రలకు జన్మ సార్ధకతనుపొందడం కష్టమే
*******
ఒక ఒస్తువును వినియోగించుకోడం , దానివల్ల కలిగే సౌకర్యాన్ని అనుభవించడంలో ఉన్న ఉత్సాహం , ఆ వొస్తువు తయారీకి వెనక ఎవరి శ్రమదానం , ఎవరి అన్వేషణ వలన లోకానికి అవి అందించబడ్డాయో ఆలోచించేవారు కోటికొక్కరుంటారా అన్నది సందేహమే …
సునాయాసంగా డబ్బు సంపాదించే మార్గాలు అనేకం ఉండొచ్చు , ఆ ధనంతో తలచిన సౌకర్యాలను అనుభవానికి తెచ్చుకోవొచ్చు , ఈ సౌకర్యాలకు తెరవెనక ఎవరి అన్వేషణ దాగుందో ఆదిమాత్రం ఎవరికీ పట్టదు ..
తెరమీద ఈ రొజు సినిమాలో పాత్రలు రేపటికుండవు , కానీ ప్రతి రొజూ ఏవో పాత్రలు నటిస్తూ , తెరమరుగౌతూ , మళ్ళీ కొత్త పాత్రలు పుట్టుకొస్తూనే ఉంటాయి .. వొచ్చె సినిమాలు వొస్తూనే ఉంటాయి , వొచ్చె పాత్రలు కాసేపు వినోదాన్ని అందించి , కనుమరుగైపోతుంటాయి
కానీ ఇన్ని పాత్రలకు , యింతవినోదానికి ఆధారమైన తెరలేకుండా వినోదించడం
సాద్యంకాదు ..
ప్రకృతి కూడా తెరలాంటిది .. ప్రతి జీవరాశి సినిమాలో పాత్రల్లా, ఒకటి నశిస్తూంటే , మరొకటి భర్తీ అవుతూ ప్రకృతి మాత్రం సినిమా తెరలా శోభాయమానంగా వెలిగిపోతూనేవుంటుంది ,,తెరమీద కదులుతూ, రక్తికట్టించే ప్రతి పాత్రకు , తెరపైన కనిపించని దర్శకుడి ప్రతిభే కారణం..
సద్గ్రంథాలు ఒక తెరలాంటివే , అవి మనసుకు స్పందననందించాలంటే , తెరవెనక ఆడిస్తున్న సద్గురు బోధలకు స్పందించక , సినిమాపాత్రలలాంటి ఈ జన్మ అనే పాత్ర ఆద్యాత్మిక పరిణతిని సాధించి , రాణించడం కష్టం ..
మనిషి స్వప్రయోజనాలకై, ప్రకృతి ధర్మాన్ని విస్మరిస్తే అది ప్రళయానికి దారితీస్తుంది , సద్గ్రంథాలను , సత్పురుషులబోధలను వక్రీకరిస్తె అది జన్మకే శాపంగా పరిగణిస్తుంది అని పెద్దలమాట ..
సాయి శ్రీ గురుభ్యోనమః
*******
Latest Miracles:
- నేను గొప్ప భక్తుడని అనే అహంకారము నాలో రాకుండా ఉంటేనే తగ్గించండి
- శ్రీ సాయి సచ్చరిత్రము – ఊదీయొక్క ఆధ్యాత్మిక, భౌతిక ప్రాధాన్యత.
- సాయిబాబా వారి యొక్క మాతృప్రేమ–Audio
- “నానాసాహెబ్కి ఈ ఊదీనీ, ఈ ఆరతి పాటనీ అందించాలి. ఆ బాధ్యత నీదే.’’
- సద్గురు కృప.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments