Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
దేవుడున్నాడనేది ఒక విశ్వాసం. దేవుడుండేది నిజమన్నది ఒక్క ఆత్మానుభూతితోనే సాధ్య౦
***********
ఎగిరి ఆకాశాన్ని అందుకోవాలనే కోరిక ప్రకృతి విరుద్ధం , అది ఎలాగూ సాధ్యం కాదని అర్థమౌతున్నా , ఆ ప్రయత్నంలో నుండి బయటపడకపోతే అందుకనుగుణంగా జీవితకధాసారం కూడా మలుపులు తిరగొచ్చు ..
ఏది పులి , ఏది జింక అనేది అలవాటయిన వాటి రూపాలనుబట్టి నిర్ధారించవొచ్చు ..
ఏ జంతువుకు తగ్గ శరీరనిర్మాణం వాటికుంటుంది , అంతకన్న విడ్డూరంగా కనిపిస్తే లోకానికి అదో వింత , చూసినవాళ్లు ఎవరుచెప్పినా ,మాయలమరాటి కదలా అది ప్రకృతి విరుద్ధంగానే అనిపిస్తుంది
బంగారు జింక సీతమ్మవారి కంటపడింది , ఎలాగైనా ఆ బంగారు జింకను పొందాలని తాపత్రయపడిందితప్ప , ఇలాంటి జింక ఎంతవరకు యధార్ధమని ఆలోచనలోపడివున్నా , తనకోరిక ఎంతవరకూ సమంజసమని రాములవారు వారింపఁచూసినా , రామాయణకథాసారం అన్నిమలుపులు తిరగక , ఆ పాత్రలు అరణ్యంలో కుటీరానికే పరిమితమయి ఉండేదేమో ..
రావణాసుర , హిరణ్యకశిపుల్లాంటి రాక్షసులు కూడా కఠిన నియమాలతో ఘోరతపస్సుచేసికూడా , చావు లేని ప్రకృతివిరుద్ధమైన కోర్కెలతో , వాళ్ళచావును వాళ్ళే కొనితెచ్చుకొన్నారు ..
దేవుడిని భక్తితో శ్రద్ధతో మెప్పించి ప్రసన్నంచేసుకొన్నా కోరిన కోరికలు ధర్మవిరుద్ధమైతే , ఆ ఫలితాన్ని అనుభవించవలసింది , అడిగిపొందినవాడే అని సద్గ్రంధాలలోకూడా అనుభవానికొస్తాయి ..
జీవితం అంతా తను ఆశించిన విదంగా అనుకూలంగా జరగాలని ఒక సహజమైన మనిషికుండే లక్షణం ..
దేవుడున్నాడాఅన్నది ఒక విశ్వాసం , ఆ విశ్వాసాన్ని అనుభవానికి తెచ్చుకొన్నవాళ్ళు నూటికో , కోటికో ఒకరుండవొచ్చు .
ఉన్నది నిజమని అందరూ విశ్వాసాన్ని ప్రకటించగలరుకానీ , ఎక్కడఉంటాడు ఎలా ఉంటాడు అంటేమాత్రం రొమ్మునిచీల్చి , రాముని చూపిన హనుమంతునిలా ఒక్కరూ కనిపించరు ..
డబ్బు , శారీరక సుఖాలు ఇవంతా మనిషి లౌకిక ప్రయత్నాలతో సమకూరేవే ..
ఒక సద్గురువునో , దేవుడినో తెలియాలంటే , అందుకు మూలమైన సద్గ్రంధాలే ఆదారం ..
రామాయణమైనా , ఒక సద్గురు చరిత్రయినా , అందులోని ఆశ్రయించిన సజీవ పాత్రలు ఎలా అనుసరించి ఉత్తమ స్థాయికి ఎదిగి జన్మను సాధించుకొన్నారో అదే నిజసాధకుల ఆచరణకు సుగమం చేయగలవు ..
షిరిడీలో ఉన్నది కళ్లకు కనిపించే రాతితో నిర్మించిన సమాధికాదు ..అదో సజీవమహా సమాది , ఎవరు శ్రద్దతో , ఆర్తితో పిలుస్తారో వారికెప్పుడు నేను కదులుతూ పలుకుతానని ఆయన వాగ్ధానం , అది అనుభవానికి తెచ్చుకుని , అనుభూతికి లోనుకావడం , ఆయన ఆశయాలకుతగ్గట్టు , ఆయన సద్బోధలను అనుసరించి , ఉత్తమ గుణాల సంప్రాప్తంతోనే సాధ్యమని పెద్దలమాట ….
నూరువసంతాల ఆయన మహాజీవసమాదికి , శిరసువొంచి పాదాభివందనములతో
*********
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Latest Miracles:
- రామాయణంలో శ్రీసాయి 5వ. భాగము
- నాక్కావలసింది ఈ నాణేలు కాదు, నేను కోరేది నిష్ఠ, సబూరీ
- బాబాని ఆర్ద్రతతో నీ జబ్బు నయం కావాలని ప్రార్దించు ! యీ విభూధిని నోట్లో వేసుకో–Audio
- కోరిక…. సాయి@366 ఫిబ్రవరి 13….Audio
- పిలిస్తే పలుకుతాను. నీవు ఎక్కడ ఉన్నా తలచిన వెంటనే నీ చెంత ఉంటాను–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments