సద్గ్రంధాల ఆచరణద్వారా సహజమైన మనిషి కూడా మహాత్ముడు కాగలడు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా   …   సాయి బాబా   …   సాయి బాబా   …   సాయి బాబా

Author:Kota Prakasam Garu

సద్గ్రంధాలు ఎప్పటికి పవిత్రంగానే ఉంటాయి ..అందులోని సారాలు మనస్సుకు హత్తుకొని కర్మాచరణకు నోచుకొంటే ఒక సహజమైన మనిషి కూడా మహాత్ముడు కాగలడు
*******

సంసారంలో రాణించడం కూడా ఒక సాదనే , ఏ కర్మ చేయకుండా శరీర పోషణ , శరీర బోగాలను కూడా అనుభవించసాధ్యంకాదు ..

వెతికి తెలుసుకునేంతవరకూ , ఉన్నది లేనట్లే అనిపిస్తుంది , ఒక్కొక్కటీ అనుభవానికొచ్చాక , ప్రయత్నంతో సాధించలేనిది ఏదీ లేదని అర్థమౌతుంది ..

మట్టిని ఉపయోగించి కుండను చేయడం ఒక ప్రయత్నం , ఆ ప్రయత్నం వెనక కొంత సాధనలేక మట్టి, కుండగా రూపాంతరంచెంది వినియోగానికి సిద్దంకాదు ..

పెళ్ళి అనేది జీవితమనే భాగవతానికి , మొదటి పేజీలో , మొదటి పేరాలాంటిది , పెళ్లి కాగానే సంసారికాలేడు , దానితోపాటు బిడ్డాపీఛూలాంటి ఎన్నో అనుబంధాలు ఒడుదుడుకులూ అధిగమించి , బాధ్యతతీరి , ఊపిరిపీల్చుకొన్నవాడు సంసారానుభవాన్ని వర్ణించి చెప్పగలడు ..

పరిశోధనా ఫలితం ప్రకృతిలో ఎన్నో పదార్దాలు వెలుగు చూస్తున్నాయి , పరిశొధనకు ముందూ , ఆ తర్వాతకూడా ఆ నిక్షేపాలు ప్రకృతిలో అంతర్భాగమే ..

ఈ ప్రకృతికి అతీతమైనది , సర్వాంతర్యామి అయింది వొకటుందనేది ఆర్యులు అనుభవంతో అందించిన మాట .. అది అందరికి విశ్వసనీయతను కలిగించవొచ్చుకాని అందుకుతగ్గ కర్మ అంటే సాధనతో మనసు పరిశోధనలో పడనిదే , ఆ ఉనికిని గుర్తించలేదు ..

ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉండొచ్చు , తెరచి నింపాదిగా చదివి విశ్లేషించుకొంటె అందులో అందించబడిన సారాంశం అనుసరించే సాధనకు కర్మను ప్రబోధిస్తుంది ..

సద్గ్రంథాలు ఎప్పుడూ పవిత్రమే , ఆచరణద్వారా అవి సాధనకు నోచుకొంటే , అందుకు తగ్గ పవిత్రత మనసుకూ అనుభవానికి రాగలదని పెద్దలమాట …

జయ్ శ్రీ సాయి గురుభ్యోనమః
*******

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles