Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కి జై.
ఓం సాయి రామ్.
సాయి బందువులకు నమస్కారం. నా పేరు లక్ష్మి ప్రసన్న.
బాబా శయన లీల గురించి సచ్చరిత్ర లో ఏంతో సుందరంగా వర్ణించారు. ఇలాంటి లీలే (మా ఇంట్లో క్షమించండి, బాబా అది మీ ఇల్లు) చూపించారు.
బాబా ఊయల లాంటి మంచంలో నాలుగు వైపులా నాలుగు దీపాలు ఉంచి మద్యలో బాబా కొలువుదీరిన వైనం మనం చదువుకున్నాము.
ఇలా కొద్దికాలం జరిగింది మళ్ళీ బాబా తన పరుపు తానే అమర్చుకోనేవారు.
అరవై దుప్పట్లు ఒక దానిపై ఒకటి తానె వేసి పడుకొనేవారు. ఇది చదివిన ప్రతి సారీ నేను నవ్వుకోనేదాన్ని.
బాబా చిన్న పిల్లవాడిలా బలే చేస్తున్నారు. అదీ ఏ ఒక్కటి కూడా మడతలు ఉండకూడదు అంట, అన్నీ సరిగానే ఉండాలి.
చిత్రమయ నీ ప్రవర్తన ఇన్ని దుప్పట్లు వేయడానికి బాబా కి ఎంత టైం పడుతుంది, ఎప్పుడు పడుకుంటారు. ఇలా ఆలోచన చేసేదాన్ని.
నా ప్రతి అలోచనలో కూడా బాబా ఉన్నారు. ఒకసారి నేను బాబా గుడికి వెళ్లాను, ఆ గుడిలో ఉన్న అతను నాకు ఒక రగ్గు అంటే పాతకాలంలో ఉంటాయి అలాంటివి ఇప్పుడు మనకు దొరుకుతాయో లేదో తెలియదు.
ఆ రగ్గు పెద్దదిగా ఉంది. నాకు ఇచ్చి అమ్మా ఇది మీరు తీసుకోండి. బాబాని పడుకోపెట్టండి. ఆయన పడుకుంటారు అని చెప్పారు.
బాబా మీతో మాట్లాడారా, అవునా ఇంకా మీకు దర్శనం ఇస్తారా!!! అని ఆతురతగా అడిగాను. అతను ఇచ్చిన సమాదానాలు నాకు కంగు తిన్నట్టుగా అనిపించింది.
ఆ దుప్పటి ఇంటికి తెచ్చి ఆ రోజు నుండి మేము పడుకొనే సమయానికి బాబా ని కూడా పడుకోపెట్టడం అలవాటుగా మారింది.
కొద్దిరోజుల తరువాత ఒకరోజు నాకు కొద్దిగా నీరసంగా ఉంది. బాబాకి బెడ్ వేయడం అశ్రద్ద చేశాను.
ఇక బాబా వారు పాపం నేను బెడ్ వేయకుండానే అక్కడే కింద పడుకున్నారు ఇది నాకు కలలో చూపించారు.
బాబా స్వప్నాలకి కాలనియమం లేదు కదా, మా దేవుడి గది చిన్నగా ఉంటుంది. పాపం ముడుచుకొని అక్కడే పడుకున్నారు.
అయ్యో బాబా మీకు మీ ఫోటోకి తేడా లేదు అనే విషయం మీరు చాలా సందర్బాలలో వివరించినా నేను మనసుపెట్టలేదు మన్నించండి బాబా అనిచెప్పి, ఆ రోజు నుండి ఎంత లేట్ అయినా కూడా ఏ పరిస్థితి అయినా బెడ్ వెయ్యడం మానడం లేదు.
అయినా ఆయన వెళ్లిపోవాలి అంటే సెకన్లు పట్టదు, కాని బాబా మా మీద ప్రేమతో కదా మా కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉన్నారు.
మరి నేను బాబాని ఎలా చూసుకోవాలి. మీకు నచ్చినట్టుగా నన్ను మార్చండి బాబా.
మీ సన్నితంగా ఉన్నా మేము పరిపక్వత చెందలేదు తండ్రి. ఈ అజ్ఞానంలో ఉన్న మమ్ము ఒడ్డుకు చేర్చు తండ్రి.
ఈ విదంగా బాబా అరవై దుప్పట్లు కాకున్నా, ఒక దుప్పటి మాత్రం తెచ్చుకొని అదీ స్వయంగా ఆయన తన ఇంట్లో విస్రమిస్తున్నారు.
సాయి నాథ్ మహా రాజ్ కి జై.
Latest Miracles:
- బాబా శయనలీల…Audio
- నేను ప్రార్దించినట్లుగానే బాబా భక్తురాలే నాకు భార్యగా రావడం కూడా బాబా అనుగ్రహమే.
- బాబా మమ్మల్ని కరుణించి మా ఇంటికి వస్తున్నవా బాబా
- బాబా ఆశీర్వాదంతో మంచి ఉద్యోగం లభించింది
- సాయిబాబా వారిగాధలే నాకు మార్గదర్శి అన్న మహేష్ బాబా.—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments