హాజీ సిద్దీఖ్ ఫాల్కే



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!         శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)

బాబా యెప్పుడు ఏ భక్తుని ఆశీర్వదించునో యెవరికి తెలియదు. ఆది వారి యిష్టముపై ఆధారపడి యుండెను. హాజీ సిద్దీఖ్ ఫాల్కే కథ ఇందు కుదాహరణము. సిద్దీఖ్ ఫాల్కే యను మహమ్మదీయుడు కల్యాణి నివాసి మక్కా మదీన యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చెరెను. చావడి ఉత్తరభాగమున బసచేసెను. మసీదు ముందున్న ఖాళీజాగాలో కూర్చొనుచుండెను. తొమ్మిది నెలలవరకు బాబా వాని నుపేక్షించెను. మసీదులో పాదము పెట్టనివ్వలేదు. ఫాల్కే మిక్కిలి యసంతుష్టి చెందెను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని కొంద రోదార్చిరి. శ్యామా అను భక్తునిద్వారా బాబా వద్ద కేగుమని సలహా నిచ్చిరి. శివునివద్దకు అతని సేవకుడును, భక్తుడును అగు నందీశ్వరుని ద్వారా వెళ్ళునట్లు, సాయిబాబా వద్దకు మాధవరావు దేశపాండే-శ్యామా ద్వారా వెళ్ళుమని చెప్పిరి. ఫాల్కే దాని నామోదించెను. తన తరవున మాట్లాడుమని శ్యామాను వేడుకొనెను. శ్యామా యందులకు సమ్మతించెను. సమయము కనిపెట్టి బాబాతో నిట్లనియెను.

“బాబా! ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేల? అనేకమంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు. వాని నేల యాశీర్వదించవు?” బాబా యిట్లని జవాబిచ్చెను. “శ్యామా! విషయములను గ్రహించే శక్తి నీకు లేదు. నీవు చిన్న వాడవు. అల్లా యొప్పుకొననిచో నేనేమి చేయగలను? వారి కటాక్షము లేనిచో మసీదులో పాదము పెట్టగలుగువా రెవ్వరు? సరే, నీవు వానివద్దకు పోయి వానిని బారవీ నూతికి దగ్గరనున్న కాలిబాటకు రాగలడేమో యడుగుము.” శ్యామా పోయి కనుగొని హాజీ అందులకు సమ్మతించెనని చెప్పెను. నలుబదివేల రూపాయలు నాలుగు వాయిదాలలో నివ్వగలడేమో కనుగొనుమని తిరిగి బాబా యడిగెను. శ్యామా వెంటనే పోయి జవాబు తెచ్చెను. నాలుగు లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా నున్నాడని బదులు చెప్పెను. సరే మరల పోయి వాని నిట్లడుగుము. “మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసము కావలెనో రొండి కావలెనో కప్పూరములు (వృషణములు) కావలెనో కనుగొనుము.” బాబావారి మట్టిపాత్రలో నున్న చిన్నముక్కతో సంతుష్టిచెందెదనని హాజి చెప్పెనని శ్యామా బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిగుల కోపించి మసీదులోని మట్టిపాత్రలు, కొలంబ విసరివైచి తిన్నగా చావడిలో నున్న హాజీవద్దకు బోయి కఫనీ (పొడుగైన చొక్కా)ని పై కెత్తి యిట్లనెను. “మహనీయునివలె ఏల నటించుచున్నావు? తెలిసిన వాని వలె ఏల కూయుచున్నావు? ముసలి హాజి వలె నటించుచున్నా వేల? ఖురాను ఇట్లే పారాయణ చేయుచున్నావా? మక్కాయాత్ర చేసితినని గర్వించి నన్ను కనుగొన లేకుంటివా?” ఇట్లు తిట్టినందుకు హాజీ గాబరాపడెను. బాబా మసీదుకు పోయెను. కొన్ని గంపల మామిడిపండ్లను గొని హాజీకి పంపెను. తిరిగి హాజీవద్దకు వచ్చి తన జేబులోనుంచి 55 రూపాయలు తీసి హాజీ చేతిలో పెట్టెను. అప్పటినుంచి హాజీ తన కిష్టము వచ్చినప్పు డెల్ల మసీదులోనికి వచ్చుచుండెను. బాబా యొక్కొక్కప్పుడు వానికి డబ్బు నిచ్చుచుండెను. బాబా దర్బారులో అతనిని గూడ చెర్చుకొనిరి.

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles