Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!! శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)
ఒకానొకప్పుడు బాపు సాహెబు బుట్టీ జిగట విరేచనములతోను వమనములతోను బాధపడుచుండెను. అతని అలమారు నిండ మంచి మందులుండెను. కాని యేమియు గుణమివ్వలేదు. విరేచనముల వల్లను, వమనముల వల్లను బాపు సాహెబు బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు పోలేకుండెను. బాబా వానిని రమ్మని కబురు పంపెను. వానిని తన ముందు కూర్చొండబెట్టుకొని యిట్లనెను. ‘జాగ్రత్త! నీవు విరేచనము చేయకూడదు’ అనుచు బాబా తన చూపుడు వ్రేలాడించెను. ‘వమనము కూడ ఆగవలెను’ అనెను. బాబా మాటల సత్తువను గనుడు. వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయెను. బుట్టీ జబ్బు కుదిరెను.
ఇంకొకప్పుడు అతడు కలరాచే బాధపడెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టరు పిళ్ళే యన్ని యౌషధములను ప్రయత్నించెను, కాని రోగము కుదరలేదు. అప్పుడు బాపు సాహెబు బాబా వద్దకు వెళ్ళి ఏ యౌషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి, జబ్బు కుదురునని సలహా అడిగెను. బాదము పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి యిచ్చినచో రోగము కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని యే డాక్టరయినను చెప్పును. కాని బాపు సాహెబు బాబా యాజ్ఞను శిరసావహించెను. పాలతో తయారుచేసి దానిని సేవించెను. వింతగా రోగము వెంటనే కుదిరెను
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాపు సాహేబు బుట్టీ
- భావూ సాహెబు ధుమాళ్ (ప్లీడర్)
- అప్పా సాహెబు కులకర్ణి
- నానా సాహెబు చాందోర్కరు (బీజాపూరు గోషా స్త్రీ)
- రిమోట్ కంట్రోల్ …. మహనీయులు – 2020… మే 19
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments