బాపు సాహేబు బుట్టీ



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

నానా సాహెబు డెంగ్లే యను గొప్ప జ్యోతిష్కుడు, బాపూ సాహెబు బుట్టీ షిరిడీలో నుండునపుడు ఒకనా డిట్లనెను. “ఈ దినము అశుభము. నీ ప్రాణమునకు హాని కలదు.” ఇది బాపు సాహెబును చలింపజేసెను. ఆయన యథాప్రకారము మసీదుకు రాగా బాబా బాపు సాహెబుతో నిట్లనియె. “ఈ నానా యేమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు. సరే, నీవు భయపడనక్కరలేదు. వానికి ధైర్యముతో నిట్లు చెప్పుము. మృత్యువు ఎట్లు చంపునో చూచెదము గాక.” ఆనాటి సాయంకాలము బాపుసాహెబు బుట్టీ మరుగు దొడ్డికి పోయెను. అక్కడొక పామును జూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయెత్తి కొట్టబోయెను. బాపుసాహెబు పెద్దకర్రను దీసికొని రమ్మనెను. నౌకరు కర్రను తీసికొని వచ్చునంతలో, పాము కదలిపోయి యదృశ్యమయ్యెను. ధైర్యముతో నుండుమని యాడిన బాబా పలుకులను బాపుసాహెబు జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను

సంపాదకీయం:  శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Contact No :09704379333

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles