సాయి వాణి “యాక్షిడెంట్, యాక్షిడెంట్”



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తురాలు: సౌజన్య దేవేందర్ రావు

నివాసం:హైదరాబాద్

సాయి బంధువులందరికి సాయిరాం, నా పేరు సౌజన్య దేవేందర్ రావు.

నాకు ఇద్దరు అబ్బాయిలు మేము ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నాము.

మా స్వస్థలం విజయవాడ దగ్గర పైడికొండల పాలెం. మా వారు బాబా భక్తులు.

నాకు అంతగా బాబా మీద నమ్మకం ఉండేది కాదు. కానీ నా జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా నేను తన భక్తురాలిగా బాబా నన్ను మార్చేశారు.

మేము గురువారం రోజున నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న శరత్ బాబూజీ గారి సత్సంగంలో పాల్గొనడానికి  తేది 22.12.2016 న వెళ్ళాము.

అక్కడ సత్సంగంలో సాయిబాబా.. సాయిబాబా సాయిబాబా.. అంటూ బాబా నామాన్ని స్మరిస్తూ ఉన్నాను.

ఆ నామ స్మరణ చేస్తూనే బాబాకు “బాబా నా పిల్లలను రేపు మా ఊరికి మా చెల్లెళ్ళ వెంబడి పంపుతున్నాను. వాళ్లు క్షేమంగా వెళ్లి, వచ్చేలా చూడు తండ్రి” అంటూ నా మొర బాబాకి చెప్పుకున్నాను.

అంతలోనే ఒక వాణి వినపడింది. అది ఏమిటంటే “యాక్షిడెంట్” “యాక్షిడెంట్” అంటూ వినపడింది.

కానీ అది నా భ్రమ అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అది “సాయి వాణి” అని బాబా హెచ్చరిస్తున్నరని నాకు అప్పుడు అర్ధం కాలేదు.

తరువాత రోజు అనగా తేది 23.12.2016న మా తమ్ముడు, ముగ్గురు చెల్లెల్లు, మా మరిది గారి వెంబడి నా ఇద్దరు పిల్లలను, మా చెల్లెలు కొత్తగా కొన్న కారులో మా ఊరికి పంపించాను.

మా చిన్న బాబు, మా మరిది గారి ఒడిలో కూర్చున్నాడు. మాపెద్ద బాబు వెనకాల సీట్లో మా చెల్లెలు ఒడిలో కూర్చున్నాడు.

ఉదయం 5 గంటల సమయంలో కారు విజయవాడ దగ్గర పరిటాలకు రాగానే అదుపు తప్పింది.

ఎదురుగా ఎలాంటి వాహనం లేదు, కారు గాలిలోనే 3 పల్టీలు కొట్టి పక్కనే ఉన్న  విద్యుత్ పోల్సుకి ఢీ కొట్టి కరెంటు తీగలు తెగిపడి, పొలాల్లోకి వెళ్ళిపోయింది.

కరెంట్ తీగలకు కరెంటు పాస్ అవుతుంది. కారు బోల్తా పడడం వల్ల సహాయం కోసం ఎదురు చూసారు. కానీ అది ఉదయం కావడం వల్ల ఎవరు లేరు.

ఎలాగోలా మా తమ్ముడు, మరిది బయటకు వచ్చి అందరినీ బయటకు తీశారు.

అంబులెన్స్ కు, పోలీస్ లకు ఫోన్ చేస్తే ఊరంతా కరెంటు తీసి, కరెంటు తీగల నుండి బయటకు తీశారు.

కారంతా తుక్కు తుక్కు అయ్యింది. మాములుగా అలా యాక్షిడెంట్ జరిగితే, ఏ ఒక్కరు కూడా బ్రతికే అవకాశం లేదు.

కానీ “శరత్ బాబూజీ” గారి సత్సంగంలో బాబా గారికి “నా పిల్లలను నా కుటుంబ సభ్యులను క్షేమంగా ఇంటికి చేర్చు” అని ప్రార్ధించాను కదా!

అందుకు బాబా నా ప్రార్ధనను మన్నించి, ఏ ఒక్కరికి కూడా “ప్రాణాపాయం” కలగకుండా చిన్నచిన్న దెబ్బలతో బాబా గారు ఆ కారులో ఉన్న నా పిల్లలను, నా కుటుంబ సభ్యులను కాపాడారు.

క్షేమంగా ఇంటికి చేర్చారు. ముందే బాబా గారు “సాయి వాణి” ద్వారా హెచ్చరించారు.

 కానీ అప్పుడు నాకు అర్ధంకాలేదు. అది నా భ్రమగా అనుకున్నాను. బాబా ఏకాదశ సూత్రాలలోన చెప్పారుగా

“నన్ను ఆశ్రయించిన వారిని నన్ను శరణు జొచ్చిన వారిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యం” అని. అలా చెప్పినట్లుగానే బాబా గారు సమర్థవంతంగా తమ విధిని నిర్వర్తించారు.

నన్ను ‘పుత్రశోకం” నుండి కాపాడారు. బాబా రక్షించకపోయి ఉంటే అనే ఆలోచనే భరించలేకపోతున్నాను.

అంత పెద్ద యాక్షిడెంట్ జరిగినా కానీ, ఏ ఒక్కరికి ఏమి కాకుండా చిన్న దెబ్బలతో బయటపడడం “బాబా దయ” కాకుండా మరేమిటి?

నేను నా కుటుంబ సభ్యులం అందరం ఇప్పుడు “బాబా భక్తులం” బాబా పాదాలను ఇక విడవడం అంటూ జరగదు.

ఏం ఇచ్చి బాబా ఋణం తీర్చుకోను చెప్పండి. నా జీవితంలో జరిగిన ఈ లీల ద్వారా నేను ఇక పూర్తిస్థాయి సాయి భక్తురాలిగా మారిపోయినాను.

       ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

                                        *** సాయిసూక్తి:

“నా భక్తులు అడిగినవన్నీ తీర్చమని నా యజమాని నన్ను ఆదేశించారు”.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles