Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్
మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-141-సాయిబాబా పటం రూపము 2:24
శ్రీ స్వామికేశవయ్యజీ అనంతపురం జీల్లాలోని పామిడి అనుగ్రామములో 1899 లో జన్మిచి, చదువు పూర్తీ చేసి, 1922లొ అనంతపురం సబ్ రిజిష్ట్రారై అంకిత భావముతో ఉద్యోగము నిర్వహించుచుండెను.
1939 నాటికి వీరు ధర్మవరములో పనిచేయునప్పుడు తన మిత్రుడైన అనంతపురం న్యాయవాది మలిరెడ్డి రాగా, అతనిని పంపుటకు స్టేషనుకు వచ్చి రైలెక్కించినాడు.
ఆ సమయమున తమకున్న కష్టములు మలిరెడ్డికి చెప్పుకోగా “నీవు షిరిడీ సాయిబాబాను ఏల ఆరాధించరాదు” అని మలిరెడ్డి అనుచుండగనే రైలు కదలిపోయినది.
కేశవయ్యజీ యింటికివచ్చి ఆ విషయము భార్యతో చెప్పగా వారు బాబాను ఆరాధించుటకు నిశ్చ యించుకున్నారు.
ఆ రోజు రాత్రి బాబా కేశవయ్యజీచే తమ తత్వము ప్రచారము చేయించవలసి యుండుటచే తమపై విశ్వాసము కలిగించవలెను కదా!
కేశవయ్య గారు ఒక అడుగు బాబా వైపు వేయగానే బాబా పది అడుగులు కేశవయ్యగారి వైపు ఇట్లువేసి మనకు నిదర్శనము చూపారు.
ఎలా అంటే మరుసటి రోజు శ్రీ షిరిడీ సంస్థానము నుండి శ్రీ సాయిబాబా పటము, ఊధీ పోస్టులో కేశవయ్యజీ గారికి వచ్చినవి.
పటము తెచ్చి పూజించుకుందామని అనుకోనుటే తడవుగా షిరిడీ సంస్థానము వారిని వీరు కోరకయే షిరిడీ నుండి ఊధీయె కాక బాబా పటము కూడా వచ్చుట యేమి?
ఇట్టి లీల బాబా దేహముతో యున్నప్పుడు జరగలేదే! ఇంతేకాదు. అటు తరువాత కాలములో వారి యింట ఊదీ అయిపోయినట్లు గుర్తించగానే మరు రోజు పోస్టులో ఊధీ వచ్చెడిది.
దీనిని బట్టి బాబాను తలచుకున్నంత మాత్రముననే బాబా మనకు ఋణపడి ఆ ఋణము ఇలా తీర్చుకుంటాడా! ఇలా కేశవయ్య గారిని ఆకట్టుకొని తన అంకిత భక్తునిగా చేసుకొనిరి బాబా.
సంపాదకీయం: సద్గురులీల ( ఫిబ్రవరి – 2014)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- వినాయక చవితి నాడు బాబా ఫోటో రూపంలో భక్తురాలి ఇంటికి వచ్చుట…Audio
- బాబా పాదపద్మముల ఛాయాచిత్రాన్ని పంచుట.
- శ్రీసాయి భక్తుడయిన శ్రీస్వామి కేశవయ్యజీ–Audio
- శ్రీ సాయిబాబా అనుగ్రహమునకు శ్రీ భరద్వాజ గారు పాత్రులగుట–Audio
- బాబా కాకి రూపమున వచ్చి కాపాడుట–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments