Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-175-1412-తామరను తగ్గించారు 3:40
మధురై కి చెందిన జే.రామమూర్తి అనే మిలిటరీ ఉద్యోగి బాబా భక్తుడు. ఉన్నత శిక్షణ నిమిత్తం 1943 లో ఆయన అంబాలా కంటోన్మెంటుకు బదిలీ చేయబడ్డారు.
అంబాలాలో ఇంటిచుట్టు అందమయిన వృక్షాలుండడంతో ఆయన చాలా ఆనందపడ్డాడు.
కొంత కాలం తర్వాత ఆయన రెండు భుజాల మీద పొక్కులలాగ ఏర్పడి విపరీతమైన దురదతో బాధపడ్డారు.
వైద్యులు వారి పరిభాషలో తీవ్రమైన తామరతో బాధ పడుతున్నట్లుగా తేల్చారు. చికిత్స చాలా కాలం కొనసాగింది,
నియమానుసారం ఆ చికిత్సను రామమూర్తి పాటించారు. కానీ వ్యాధి ఒళ్ళంతా వ్యాపించింది.
విపరీతమైన దురదతో బాధపడడం వలన ప్రతిరోజూ ఉదయపు శిక్షణ చాలా కష్టమయ్యేది. విపరీతమైన దురద వలన రక్తం కూడా కారేది.
ఆయన పై అధికారి, రామమూర్తి బాధలను చూసి ఆసుపత్రి లో చేర్పించారు, కఠినమైన చికిత్స జరిగినాకూడా ఫలితం లేకపోయింది. రామమూర్తి కన్నీటి పర్యంతమయ్యాడు.
ఆ రోజు సాయంకాలం రామమూర్తి వున్న ఆసుపత్రి గదిలోనికి ఒక యవకుడు ప్రవేశించాడు.
తాను రామమూర్తిని ఒక హాకీమ్ దగ్గరకు తీసికుని వెడతాననీ, ఆ హకీమ్ రామమూర్తి వ్యాధిని తగ్గిస్తారనీ చెప్పాడు.
అసలా యువకుడు ఆ గదిలోనికే కాదు, విపరీతమైన భద్రతా వలయమున్నఆ ఆవరణలోనికే ఎలా ప్రవేశించగలిగాడా అని రామమూర్తి ఆశ్చర్యపోయాడు.
ఆ యువకుడు రామమూర్తి తనతో హకీం దగ్గరికి రావల్సిందేనని పట్టుపట్టడం వలనా, ఆ యువకునిలో ఏదో గొప్పదనం కనిపించీ రామమూర్తి ఆ యువకుడి సలహాను పాటించడానికే నిశ్చయించుకుని తన పై అధికారి అనుమతిని తీసికుని ఆ యువకునితో బయలుదేరాడు.
ఆ యువకుడు రామమూర్తిని ఒక దట్టమైన అడవిలోనికి తీసికుని వెళ్ళాడు.
అక్కడ వున్న ఒక పూరి గుడిసె లోనికి తీసికుని వెళ్ళాడు, అక్కడ ఒక హకీమ్ కూర్చుని వున్నాడు. ఆ హకీమ్ రామమూర్తి శరీరమంతా వ్యాపించివున్న తామరని ఒకసారి చూసాడు.
ఆ తర్వాత ఒక జాడీతొ లేపనాన్ని ఇచ్చాడు, ఆ లేపనాన్ని ఎలా వాడాలో ఆదేశించాడు. శంకితుడైన రామమూర్తి ఆయన ఆదేశాలను చాలా జాగ్రత్తగా పాటించాడు.
దురద తగ్గడంతో ఆ రాత్రి రామమూర్తి శాంతిగా నిద్రపోయాడు. మరునాడు వుదయం స్నానం అయిన తర్వాత తన శరీరాన్ని చూసికున్న రామమూర్తి తన శరీరము మీదనున్న తామర పూర్తిగా తొలగిపోవడంతో ఆనంద భరితుడయ్యాడు.
అప్పుడు అతనికి మొత్తము సంఘటనల వెనుక వున్నదెవరో అర్దమయింది,
ఇదంతా బాబా లీల గా అర్దం చేసికున్నాడు. వైద్యుడు వచ్చిన వెంటనే తనని ఆసుపత్రి నుండి విడుదల చేసేందుకై అభ్యర్దించాడు,
అతని అభ్యర్దన అంగీకరించబడింది. వెంటనే రామమూర్తి ఆ యువకుడ్నీ, ఆ హకీమ్ నీ కలిసేందుకు బయలుదేరాడు.
అడవిలోని ఆ ప్రదేశానికి చేరుకున్న రామమూర్తి ఆ గుడిసే, యువకుడూ మరియూ హకీమ్ ఏమీ, ఎవరూ లేకపోవడంతో తీవ్రమైన ఆశ్చర్యానికి గురయ్యాడు.
సాయి సుధ, సంచిక: 5, నంబరు: 12, మే 1945.
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com
whatsapp 7033779935
Voice call: 9437366096
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- భక్తురాలికి బాబా వారు ప్రసాదించిన దివ్య పూజ అనుభవములు
- శ్రీ సాయి రక్ష సర్వజగద్రక్ష…..సాయి@366 ఏప్రిల్ 14….Audio
- బాబా మరల కృష్ణ ప్రియ కు దర్శనం ఇచ్చి నీకు త్వరలో మారకం వుంది, నేను రక్షిస్తాను
- బాబా విభూతి మహిమ(దెబ్బకు రోగం మాయం)–Audio
- ఆమె కడుపు నొప్పి ఎలా తొలిగిపోయింది?–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “హకీం తామరను తగ్గించారు–Audio”
kishore Babu
June 27, 2016 at 10:10 amసాయి బాబా వారు చాలా సార్లు కష్టాల్లో ఉన్న భక్తులకి సహాయము చేయడం, ఆ తర్వాత భక్తుడు గుర్తించేలోగా కనిపించకుండా వెళ్లిపోవడం జరుగుతుంది. ఈ లీలలో మనం స్వయముగా చూసినాము.అలాగే మన ఈ లోకంలో కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి సాయి బాబా వారు సహాయం చేయాలని కోరుకుందాము. ప్రణామము సాయి దేవ…గురు దేవ..