Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-38-1018-ఏమిటీ-నువ్వు మానవ మాత్రుణ్ణి పూజిస్తావా 7:43
1936 వ.సంవత్సరంలో జస్టిస్ రేగే గారు పి.ఆర్.అవస్తే గారిని శ్రీ బి.వి. నరసింహస్వామి గారికి పరిచయం చేసారు.
నరసింహస్వామి గారు అవస్తే గారితో కలిసి, బాబా గారు జీవించి ఉండగా అప్పటి ఆయన అంకిత భక్తులందరినీ వ్యక్తిగతంగా కలుసుకొన్నారు.
వారందరి వద్దనుండి బాబా గారి గురించి తొలి సమాచారాన్ని (First Hand Information) సేకరించి, బాబాతో వారికి కలిగిన అనుభవాలన్నిటిని పుస్తకాలుగా ప్రచురించారు.
వాటికి విపరీతమయిన ప్రాచుర్యం వచ్చింది. ఈ ప్రాచుర్యానికి కారకులు పరోక్షంగా జస్టిస్ రేగే గారు.
ఈయన ఇండోర్ హైకోర్టులో జడ్జిగా పని చేసారు.
గోవాలో కొలువై ఉన్న శాంత దుర్గాదేవి ఈయన ఇలవేల్పు.
ఈయనకు ఎనిమిదవ ఏట ఉపనయనం జరిగింది.
సంధ్య వార్చడం, గాయత్రి జపం అన్ని యధావిధిగా చేసేవారు.
ఆయన ఆరాధన విష్ణువు వైపుకు మళ్ళింది.
ధృవుడు, మహావిష్ణువు ఉన్న చిత్రపటం ఆయన ఇంట్లో ఉండేది.
ఆ రూపం ఈయన మనస్సులో బలంగా ముద్రించుకుని ఉంది.
ఎప్పుడూ అదే రూపాన్ని ధ్యానిస్తూ ఉండేవారు.
విష్ణువుపై ఏకాగ్రత నిలుపుదామని ప్రయత్నించినపుడెల్లా ప్రక్కన ధృవుని రూపం వల్ల ఏకాగ్రత చెదిరిపోతూ ఉండేది.
దాని వల్ల పటంలో ధృవుడు కూర్చొని ఉన్న భాగం కత్తిరించి ధ్యానం కొనసాగించారు.
ధృవుని స్థానంలో తనను ఊహించుకుని విష్ణుమూర్తిని ప్రార్ధిస్తూ ఉండేవారు.
చిన్నతనం నుండి ప్రాణాయామం, ఆసనాలు అభ్యసిస్తూ ఉండేవారు.
సిధ్ధాసనంలో కాని, పద్మాసనంలో కాని ఒకటి లేదా రెండు గంటలు స్థిరంగా కూర్చొని 15 నిమిషాలపాటు ఒకే మూర్తిని నిలుపుకొని ధ్యానించగలిగేవారు.
ప్రాణాయామంలో కూడా కొంత ప్రగతిని సాధించారు.
ఇవన్నీ గురువు లేకుండానే చేయగలిగారు.
1910 వ.సంవత్సరంలో ఒకరోజు నిద్రలో ఉండగా ఆయనకు ఒకే రాత్రి మూడు అనుభవాలు కలిగాయి.
అప్పుడు ఆయన వయస్సు 21 సంవత్సరాలు. మొదటి అనుభవంలో ఆయన మంచం మీద పడుకొని ఉండగా ఆయనలో ఏదో మార్పు జరిగినట్లుగా అనిపించింది.
తాను తన దేహం నుండి విడిపోయినట్లు దానినుండి వేరుగా ఉన్నట్లు భావన కలిగింది.
ఆయన ముందు విష్ణుమూర్తి నిలబడి ఉన్నారు. అంతటితో ఆ దృశ్యం అయిపోయింది.
ఒక గంట తరువాత ఇదే విధంగా మరొక అనుభవం కలిగింది.
ఈసారి విష్ణుమూర్తి ప్రక్కన మరొకరు నిలబడి ఉన్నారు.
విష్ణుమూర్తి , తన ప్రక్కన ఉన్నవారిని చూపిస్తూ “షిరిడీకి చెందిన ఈ సాయిబాబా నీవాడు.
నీవు ఈయనను తప్పక ఆశ్రయించాలి” అని చెప్పారు.
కొంతసేపటి తరువాత మూడవ దృశ్యం అనుభవమయింది.
గాలిలో తేలుతున్నట్లుగా ఒక వింత అనుభవం కలిగింది ఆ అనుభవంలో ఆయన ఒక గ్రామానికి చేరుకొన్నారు.
అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు.
ఆ వ్యక్తిని ఇది ఏ గ్రామం అని అడిగారు.
ఆ వ్యక్తి ఇది షిరిడీ గ్రామం అని సమాధానమిచ్చాడు.
అయితే ఇక్కడ సాయిబాబా అనే పేరుతో ఎవరయినా ఉన్నారా? అని ఆడిగారు.
అప్పుడా వ్యక్తి అవును ఉన్నారు, రండి చూపిస్తాను అని ఆయనను మసీదులోకి తీసుకొని వెళ్ళాడు.
అక్కడ మసీదులో బాబా కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు.
రేగే ఆయన ముందుకు వెళ్ళి భక్తితో ఆయన పాదాల వద్ద తన శిరసునుంచారు.
వెంటనే బాబా లేచి, “నువ్వు నన్ను దర్శించుకోవడానికి వచ్చావా? నేను నీకు ఋణగ్రస్తుణ్ణి.
నేనే నిన్ను దర్శించుకోవాలి” అని బాబా తన శిరస్సును రేగే పాదాలపై ఉంచారు.
అప్పుడు వారిద్దరూ వెళ్ళిపోయారు.
ఇవన్నీ కూడా 1910 వ.సంవత్సరంలో ఆయనకు స్వప్నంలో జరిగాయి.
ఈ మూడు దృశ్యాలు ఆయనలో ఎంతో ప్రభావాన్ని చూపాయి.
అంతకు ముందు ఆయన, సాయిబాబా తన సహజరీతిలో కూర్చున్న ఫొటోను చూసారు.
అపుడాయనకు బాబా గురించి ఏమీ తెలియదు.
బాబా తరచుగా కాళ్ళు చాచుకొని కూర్చొంటారన్న విషయం కూడా ఆయనకు తెలియదు.
కొంతకాలం తరువాత, తనకు కలిగిన దృశ్యానుభవాల ప్రకారం సాయిబాబా తనకు నిర్ణయింపబడిన గురువు అవునో కాదో నిర్ధారించుకోవడానికి మొట్టమొదటిసారిగా షిరిడీ వెళ్ళారు.
రేగే గారు షిరిడీ చేరుకున్న తరువాత మసీదుకు వెళ్ళారు.
మసీదులో బాబా దగ్గర చాలామంది భక్తులు ఉన్నారు.
ఆయన బాబా పాదాలముందు తన శిరసునుంచి సాష్టాంగ నమస్కారం చేసుకొన్నారు.
“ఏమిటీ? నువ్వు మానవ మాత్రుణ్ణి పూజిస్తావా?”అన్నారు బాబా.
బాబా ఆవిధంగా అనగానే రేగే ఒక్కసారిగా దూరంగా జరిగి కూర్చొన్నారు.
రేగేకు ఉన్న పాండిత్య పరిజ్ఞానం వల్ల *మానవులను పూజించరాదనే అభిప్రాయం ఉండేది.
ఆ విషయం బాబాకు తెలిసింది. అందుకనే బాబా తాను సాష్టాంగ నమస్కారం చేయగానే ఆవిధంగా అన్నారని అర్ధమయింది ఆయనకి.
ఆ ఆలోచనలతో తాను బాబాను దర్శించుకున్నందుకు బాబా తనను ఒక్క దెబ్బ కొట్టినట్లుగా భావించుకున్నారు.
బాబా అన్నమాటలకు దెబ్బతిన్నట్లుగా అదిరిపడి ఇంకా కొంతసేపు మసీదులోనే కూర్చొన్నారు. ఆ తరువాత భక్తులందరూ వెళ్ళిపోయారు.
మసీదులో బాబా ఒక్కరే ఉన్నారు. మధ్యాహ్నం వేళలో బాబా ఒక్కరే ఉన్నప్పుడు ఎవరూ బాబా వద్దకు వెళ్ళకూడదు.
వెళ్ళకూడని సమయంలో మసీదులోకి వెడితే ఏమయినా హాని జరగవచ్చని అందరి నమ్మకం. ఏది జరిగినా సరే జరగనీ అని అన్నిటికీ సిధ్దపడి జరగబోయేవాటి గురించి పట్టించుకోకుండా బాబా దగ్గరకు వెడదామని నిశ్చయించుకొన్నారు.
ఆయన వద్దకు వెళ్ళడానికి కాస్త కదలగానే ఆయన తన వద్దకు రమ్మని సైగ చేసారు.
ఆయన అలా రమ్మని పిలవగానే కాస్త ధైర్యం వచ్చి బాబా దగ్గరకు వెళ్ళి ఆయన పాదాల మీద శిరసునుంచారు.
ఒక్కసారిగా బాబా ఆయనను కౌగలించుకొని, తన దగ్గరగా కూర్చోమని చెప్పి ఇలా అన్నారు “నువ్వు నాబిడ్డవు. ఇతరులు అనగా అపరిచితుల సమక్షంలో మేము బిడ్డలను దూరంగా ఉంచుతాము”.
ఆమాటలకు రేగే గారికి ఎంతో సంతోషం కలిగింది.
అంతకు ముందు బాబా తనను నిరాదరంగా చూసినదానికి అర్ధం బోధపడి సంతృప్తి చెందారు. అతని కల నిజమైంది.
ఇష్టదైవం అతనికి సద్గురువును చూపాడు! అతని ఆనందానికి అవధులు లేవు.
బాబా ఆయనని రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్ళి అక్కడ ఉండమని చెప్పారు.
రేగే రాధాకృష్ణమాయి ఇంటిలో బస చేసారు.
శ్రీ సాయి అంకిత భక్తుడయిన జస్టిస్ ఎమ్.బి.రేగే గారి గురించిన సమాచారం ఈ క్రింది లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/2016/04/blog-post_30.html ద్వార సేకరించడం జరిగింది.
.. ఇంక ఉంది ..
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఎన్నేళ్ళనేది కాదు…అర్హతే కొలమానం ….. సాయి@366 ఫిబ్రవరి 25….Audio
- రాత్రి నిద్రించని సాయి…..సాయి@366 డిసెంబర్ 21….Audio
- చనిపోయిన బిడ్డ తిరిగి వచ్చింది–Audio
- తరువాత రేగే 1910 సం. లో షిరిడి వెళ్ళినప్పుడు బాబా అతనిని ఆశీర్వదించి తమ ఫోటో ఒకటి ప్రసాదించారు.—Audio
- సిద్దావతారుడు…..సాయి@366 అక్టోబర్ 9….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments