Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-184-1912-భయపెట్టి తరిమేసారు 2:30
దురదృష్టవశాత్తూ ఈ లీలని పంచుకున్న భక్తుని పేరు ప్రస్తావించబడలేదు.
ఆయన మాటల్లోనే, ’నేను కలకత్తాకి బదిలిపై వెళ్ళినప్పటినుండీ నా రెండో కుమార్తె ఆరోగ్యం సరిగ్గా వుండడం లేదు.
అప్పుడు బాబా నాకు స్వప్న దర్శనమిచ్చి ఒక రూపాయ షిరిడీకి పంపించమని ఆదేశించారు.
బాబా పట్ల అచంచలమైన విశ్వాసముండడం వలన నేను వెంటనే ఒక రూపాయి షిరిడీకి పంపించాను.
నా కుమార్తెకి ఏదో ఘోరం జరగబోతూందని నాకనిపించసాగింది.
ఆ రోజు 27 ఏప్రిల్ 1941 నాటి రాత్రి నాకుమార్తె ఆరోగ్యం క్షీణించింది. మేము బాబా ని ప్రార్దించాము, బాబా విభూతిని ఆమె కి పెట్టాము, ఆమె శరీరమంతటికీ విభూతిని పూసాము.
విపరీతమైన ఆతృత వలన నేనా రాత్రి నిద్రపోలేదు. రాత్రి రెండున్నరయి వుంటుంది.
మృత్యుదేవత యముడు తన నడుము చుట్టూ గంటలతో మా ఎదుటి వాకిలి నుండి లోపలికి ప్రవేసించడాన్ని నేను స్పష్టంగా చూసాను.
అదే సమయంలో బాబా కూడా నా పూజా గదిలోనుండి మెల్లిగా రావడం గమనించాను. ’హట్, హట్’ తప్పుకో, తప్పుకో అంటూ బాబా యముడిమీద అరిచారు. ఒకవిధంగా చెప్పాలంటే అరుస్తూ తరిమేసారు.
ఇది జరిగిన ఒక గంట తర్వాత మా పొరుగింటిలోనికి ప్రవేశించిన యముడు ఒక బిడ్డని తీసికుని పోయాడు.
ఆ ఇంటినుండి ఏడుపులు వినిపించసాగాయి. తలుపు సందుగుండా చూస్తే ఆ ఇంటిముందు జనం గుమిగూడివుండి బిడ్డకోసం రోదిస్తున్నారు.
అప్పుడు నేను నా భార్యని నిద్రలేపి జరిగినదంతా వివరించాను. బాబా కి శిరసువంచి నమస్కరించాము. మమ్ములను సర్వకాల సర్వ అవస్థల యందూ రక్షిస్తున్నందులకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము.
మహాసమాధి అయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బాబా మమ్ముల్ని రక్షిస్తూ వుండడం మాకెంతో ఉత్తేజాన్నికలిగిస్తోంది.
సాయిసుధ సంపుటి 2 సంచిక 3 ఆగష్టు, 1941
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com, csai@saimail.com.
whatsapp 7033779935, 9178265499
Voice call: 9437366086, 827007737
Latest Miracles:
- బాబా నన్ను “ఎందుకువచ్చావు”!? అని ప్రశ్నించారు…Audio
- బాబా ఊ దితో వాంతులు, జ్వరం మటుమాయం…!
- ఊధీ మహిమ – ఊపిరితిత్తుల వ్యాది మటుమాయం–Audio
- ‘‘దేహధర్మం అంటే మృత్యువుని నవ్వుతూ ఆహ్వానించడం.”
- బాబా వారు మాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు …..!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments