Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
ఈ రోజు సాయి బా ని స అనుభవాలలో 6 వ్ అనుభవాన్ని తెలుసుకుందాము.
శ్రీ సాయి సచ్చరిత్రలో సాయి యిద్దరు విధ్యార్థులను ఎలా దీవించారో, వారు పరీక్షలో విజయం సాధించేలా యెలా అనుగ్రహించారో ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాము.
బాబూ తెండూల్ కర్ జ్యోతిష్కులు చెప్పిన మాటలని విని ఖిన్నుడయి వైద్య శాస్త్ర పరీక్షకు వెళ్ళకూడదని నిశ్చయించుకున్నప్పుడు తన తల్లి ద్వారా బాబా ఆదేశాలను, ఆశీర్వచనాలనూ స్వీకరించి పరీక్షలో ఉ త్తీర్ణుడైన సంగతి మరియు న్యాయశాస్త్ర పరీక్షలో షేవడే అనే విద్యార్థి బాబా ఆశీర్వచనాల్తో విజయము సాథించిన విషయము మనందరికీ తెలిసినదే.
యిటువంటి సంఘటనలే నా జీవితములో కూడా జరిగినవి. ఆ విషయాలనుమీకిప్పుడు తెలియపరుస్తాను.
అది 1990 వ సంవత్సరము అక్టోబరు నెల. భారత ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న శాఖా పరమైన పదోన్నతికి మద్రాసులో జరగబోయే పరీక్షలకు వెళ్ళినాను.
ఆ పరీక్ష నాడు ఉదయము మానసిక ఆందోళనతో అక్కడ అతిధి గృహ ప్రాంగణములోని ఒక చెట్టు కింద కూర్చుని నా పరీక్షలో విజయాన్నిప్రసాదించమని బాబాని వేడుకుంటూ, ఒక సందేశమును ప్రసాదించమని కళ్ళు మూసుకుని సాయి సచ్చరిత్రలో ఒక పేజీ తెరవగా 45 వ అధ్యాయం 374 వపేజీలోని వాక్యములు నాకు ధైర్యాన్ని ప్రసాదించాయి.
ఆ వాక్యాలని నేను మీకిప్పుడు తెలియపర్తుస్తున్నాను.
“ఇకపొమ్ము, నీవు క్షేమమును పొందెదవు, భయమునకు గాని ఆందోళనకు గాని కారణము లేదు. శ్యామాకు పట్టుపంచె ఒకటి దానము చేయుము. దాని వల్ల నీవు మేలు పొందెదవు”
ఈవాక్యములు చదువుతున్న సమయములో చెట్టు మీద కోయల కూత నన్నాకర్షించినది. ఆ కోయిల తెల్లటి శరీరము, నల్లటి మెడ కలిగి ఉండి నాలోఆశ్చర్యమును కలిగించినది.
శ్రీ సాయినాధులవారు తెల్లటి కోయిల రూపములోవచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నరని భావించాను.
ఆధైర్యముతో పరీక్ష వ్రాసి ప్రధమశ్రేణిలో విజయాన్ని సాధించాను.
మరలా 1997 సంవత్సరం అక్టోబరు నెల. తిరిగి శాఖా పరమైన పదోన్నతి కోసము జరిగే పరీక్షకు బొంబాయిలోని మా ప్రధాన కార్యాలయానికి వెళ్ళినాను.
నాకు తక్కువ విద్యార్హత ఉన్నా, యెక్కువ సీనియరిటీ ఉండుటచేత, ఆ పరీక్ష రాయడానికి అర్హత పొందినాను.
కాని అక్కడికి వచ్చిన యితర అభ్యర్థులందరూ నా కన్న వయసులో చిన్నవారు, మరియు విద్యార్హతలు యెక్కువగా కలిగినవారు.
వారితో నేను పోటీ చేయగలనా అనే భయంతో సాయీని ప్రార్థించి కళ్ళుమూసుకుని సాయి సచ్చరిత్రలో ఒక పేజీ తెరిచాను.ఆశ్చర్యము 45 వ అధ్యాయము 374 వ పేజీ
“ఇక పొమ్ము, నీవుక్షేమమునుపొందెదవు, భయమునకు గాని ఆందోళనకు గాని కారణము లేదు. శ్యామాకు పట్టు పంచె ఒకటి దానము చేయుము. దాని వల్ల నీవు మేలు పొందెదవు.”
అదే సమయములో శ్రీ సాయి ఒక పావురము రూపములో నేను కూర్చున్నటేబులు మీద వాలి మూడుసార్లు కూతకూసి నన్ను ఆశీర్వదించి యెగిరివెళ్ళిపోయినారు.
ఈ సంఘటనతో బాబా ఆశీర్వచనాలు ఉన్నాయనే ధైర్యముతో పరీక్ష వ్రాసి తిరిగి విజయాన్ని సాధించాను.
ఈ రెండు సంఘటనలను తలచుకున్నప్పుడెల్లా సాయినాధుల వారిపై ప్రేమతోవారి పాదాలను ముద్దు పెట్టుకుని నాకృతజ్ఞతలు యెల్లప్పుడూతెలియచేసుకుంటున్నాను.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- బాబా అనుగ్రహం డ్రైవింగ్ టెస్ట్ పాసయ్యాను
- నాకాలి నొప్పిని స్వీకరించి నన్ను రక్షించారని ఈ నాటికీ నమ్ముతున్నాను-Gopal Rao–16–Audio
- ఆ గురుదేవులు(సాయినాథుడు) అందరికి పరీక్ష పెడతాడు. కృష్ణ ప్రియ లాంటి వాళ్ళు పరీక్షలో నెగ్గుతారు.
- పరీక్షలు – పొరపాట్లు …..సాయి@366 జూన్ 23….Audio
- నిశ్చల భక్తితో ప్రార్ధన – పరీక్షలో ఉత్తీర్ణత–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “పరీక్ష వ్రాసి ప్రధమశ్రేణిలో విజయాన్ని సాధించాను-Gopal Rao– 6–Audio”
kishore Babu
August 30, 2016 at 8:05 pmThank you so much Sai Suresh..