గురుదేవ దయాకర దీన జనే… …. మహనీయులు – 2020… అక్టోబరు 14



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఆధ్యాత్మిక పథంలోకి రావటం, పయనించటమే ఒక విశేషం. అది జారుడు బండ. పడిపోవటానికి ఎంతో సమయం పట్టదు.

ఒకసారి వ్రేలితో రామకృష్ణ పరమహంస, దేవేంద్రనాథ్ మజుందార్ నాలుకపై బీజాక్షరాలు వ్రాశారు.

ఇక అతనికి దివ్య దర్శనాలు కలగసాగాయి. గంటల తరబడి భగవంతుడిని గూర్చి చెప్పగల పటిమ కలిగింది.

రామకృష్ణులు మహాసమాధి చెందారు. ఒకసారి అతడు నీతి బాహ్య జీవితాలను గడుపుతున్న నటీ మణులతో సంబంధాలను పెట్టుకున్నాడు. అలా కొంతకాలం గడిచింది.

తన పొరపాటు లేదా తప్పులు తాను గ్రహించాడు. రామకృష్ణుల భక్తుడైనా దుర్గా చరణ్ నాగ్ కు తన పరిస్థితిని వివరించాడు.

“మసిబారిన గదిలో నువ్వెంత జాగ్రత్త వహించినప్పటికి, అంతో, ఇంతో మసి ఒంటికి అంటకుండా ఉండదు.

నీవు ఎందుకు భయపడుతున్నావు? నీకొక గురువు ఉన్నారు కదా! ఎటూ గంగా నది ఉంది – నిన్ను పరిశుద్ధం చేయటానికి” అన్నారు దుర్గాచరణ్.

అప్పుడు దేవేంద్రనాథ్ లో అపరాధ భావన. ఆందోళన సమసిపోయాయి.

రామకృష్ణులపై దృఢ విశ్వాసం ఆయన అపార కరుణ దేవేంద్రనాథ్ కు ఉత్సాహాన్ని, శక్తిని ఇచ్చాయి.

మానవ సేవే మాధవ సేవ అనే వాక్యాన్ని నమ్మాడాయన. అందరకూ దానిని గూర్చి తెలిపే వాడు.

ఆయన మాటలు విని ప్రభవితుడైనాడు సఫర్ అనే పేరు గల వ్యక్తి. సఫర్ ఒకసారి తన కార్యాలయానికి పోతుంటే పాతాళ మురుగు కాలువలో (drainage  manhole)  ఇరువురు వ్యక్తులు మునిగినారని సఫర్ ను తెలిసింది.

ఈ విషయం విని, చూస్తున్న ప్రజానీకాన్ని “ఇరువురు వ్యక్తులు చావు బ్రతుకుల్లో ఉంటే, మీరు తమాషా చూస్తున్నారా?” అంటూ అతను ఆ మునిగిపోతున్న ఇరువురిని కాపాడటం కోసం జై గురు దేవా అంటూ దుమికాడు,

ఆయన అక్టోబరు 14, 1911లో రామకృష్ణునిలో ఐక్యమయ్యారు.

“ఆధ్యాత్మిక జీవితంలో, సముద్రంలోని అలల్లా మనసుకు నిమ్నోనతాలు ఉంటాయి.

మనసు దిగజారినప్పుడు ఆందోళన చెంద కూడదు. క్రుంగి పోవటంకన్న ప్రమాదకరమైనది ఏదీ ఉండదు. పైగా అది మన బలాన్ని హరించి వేస్తుంది” అంటారాయన.

శ్రీరామకృష్ణులపై రచించిన స్తుతులలో బహుళ ప్రాచుర్యం పొందిన ఆయన రచనతో దేవేంద్రనాథ్ ని స్మరిద్దాం, రామకృష్ణులను స్తుతిద్దాం!

“భవసాగర తారణ   కారణ హే

రవి నందన బంధన ఖండన హే

శరణాగత కింకర భీతమనే

గురుదేవ దయాకర దీన జనే…..”

“కష్టాలు, అగ్ని పరీక్షలూ మన మనస్సులను బలపరుస్తాయి. క్రుంగిపోవటం వలన ఏ మంచీ ఒనగూరదు. పైగా అది మన బలాన్ని హరించి వేస్తుంది” దేవేంద్రనాథ్ మజుందార్.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles