ఊరికే చదివినంత మాత్రాన సరిపోదు.  వాటిని అచరించాలి–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Archana


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

ఈ రోజు నుండి లెఫ్టినెన్ట్ కల్నల్  ఎమ్.బి.నింబాలకర్ గారు వ్రాసిన‘SHRI SAI BABA’S Teachings and Philosophy’  తెలుగు అనువాదం ప్రచురిస్తున్నాను. 

బాబా వారి బోధనలను తత్వాన్ని సాయి భక్తులకు అందించే భాగ్యాన్ని కలుగ చేసిన శ్రీ షిరిడీ సాయినాధులవారికి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ ప్రారంభిస్తున్నాను.

ఓం సాయిరాం

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము

ఆంగ్లమూలం : లెఫ్టినెన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్

తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు

లెఫ్టినెన్ట్ కల్నల్  ముకుందరావ్ బల్వంతరావ్ నింబాల్కర్ గారు (రిటైర్డ్) 29.10.1918  వ.సంవత్సరంలో గుజరాత్ లోని బరోడాలో జన్మించారు.

ఇంగ్లీషు, మరాఠీ భాషా సాహిత్యాలలో ఆయన 1939 లో గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నారు. క్యాడెట్ ఆఫీసర్ గా బరోడా స్టేట్ ఆర్మీలో చేరారు.

1949 లో ఇండియన్ ఆర్మీలో చేరి మొదటగా మరాఠా రెజిమెంట్ లో పనిచేశారు.  తరువాత ఫోర్త్ గోర్ఖా రైఫిల్స్ లో పని చేశారు.

29 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత 1968 లో లెఫ్టినెంట్ కర్నల్ గా పదవీ విరమణ చేశారు.

పదవీ విరమణకు ఒక సంవత్సరం ముందు  హృద్రోగ సమస్య వల్ల ఆయన, బొంబాయిలోని నావల్ హాస్పిటల్ లో చేరారు.

కోలుకొనే సమయంలో ఆయన ఎన్.వి. గుణాజీ రచించిన సాయిబాబా జీవిత చరిత్ర చదవడం తటస్థించింది.  

హాస్పటల్ నించి వచ్చిన తరువాత మరొక్కసారి ఆపుస్తకాన్ని చదివారు.  ఆగస్టు 3వ.తారీకు, 1967 వ.సంవత్సరంలో ఆశ్చర్యకరంగా సాయిబాబా వెండి పాదుకలను స్పృశించి వాటికి నమస్కరించుకునే అదృష్టం, ఆ తరువాత వాటిని షిర్దీ నుండి లండన్ కి తీసుకొని వెళ్ళే భాగ్యం కలిగింది.  

అప్పటినుండి ఆయన జీవన విధానం పూర్తిగా మారిపోయింది.

ఆయనకు సంస్కృతంలో మంచి పట్టు ఉంది.  ఆయన రామాయణం, మహాభారతం, భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు అన్నిటినీ అధ్యయనం చేశారు.

మరాఠీలో జ్ఞానేశ్వరి, ఏకనాధ భాగవతం, తుకారాం గాధ, దాసబోధ వీటన్నిటిని అధ్యయనం చేశారు. ఇవన్నీ కూడా మహాబారతం యొక్క నాలుగు వేదాలుగా పరిగణింపబడ్డాయి.

1980 నుండి ఆయన శ్రీసాయిలీల పత్రికకు మరాఠీ, ఆంగ్ల భాషలలో వ్యాసాలను వ్రాయడం ప్రారంభించారు. 

1993 లో ఆయన మరాఠీలో ‘శ్రీ సాయించే  సత్య చరిత్ర’ అనే పుస్తకాన్ని శ్రీసాయి సత్ చరిత్ర మూలగ్రంధం ఆధారంగా చాలా వివరంగా వ్యాఖ్యానాలతో వచన రూపంలో పెద్ద సంపుటంగా వ్రాసి ప్రచురించారు.

ముందుమాట

“ఇహపరాలకు సాధనమైన పుణ్య పావనమైన ఈ చరిత్ర గంగా జలాంవలె పవిత్రమైనది, దీనిని వినేవారి చెవులు ధన్యం.” (20)

“ఈ సాయి సత్ చరిత్రను మధువు (అమృతం, దేవతల పానీయం) తో పోలిస్తే సాయి సత్ చరిత్రకన్నా మధురంగా ఉంటుందా?

అమృతపానం చేసిన మానవుడు మరణాన్ని మాత్రమే జయించగలడు, కాని సాయి సత్ చరిత్ర చావుపుట్టుకలే లేకుండా చేస్తుంది అనగా జనన మరణ చక్రాలనుండి తప్పిస్తుంది.” (21)  (అధ్యాయం. 13)

పైన చెప్పిన విషయాలను గ్రహిస్తే, హేమాడ్ పంత్ అనబడే శ్రీగోవింద రఘునాధ్ ధబోల్ కర్ గారు వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్ర ఎంత అమూల్యమైనదో మనకు అర్ధమవుతుంది.

శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయిబాబా స్వయంగా చెప్పిన మాటలు, హేమాడ్ పంతుగారు చెప్పిన మాటలు నలుదిశలా వ్యాప్తి చెందాయి. 

కొంతమంది సాయి భక్తులు వాటిని సేకరించి శ్రీసాయిలీల ఇంకా మరి ఇతర పుస్తకాలలోను ప్రచురించారు. 

కాని వాటినన్నిటినీ విషయాలవారీగా (అనగా ఏ అంశానికి ఆ అంశం) వేరు చేయకపోయనట్లయితే ఎవరికయినా సరే వాటిని సరిగా అర్ధం చేసుకోవడానికి, ఆచరణలో పెట్టడానికి కష్టమవుతుంది. 

నేను ఖచ్చితంగా నమ్మేదేమిటంటే ఒక పుస్తకంలో చెప్పబడిన బోధనలు ఏవయినా సరే, వాటిని సరిగా అర్ధం చేసుకొని వాటిని ఆచరణలో పెట్టినపుడె ఫలితం ఉంటుంది.

“ఊరికే చదివినంత మాత్రాన సరిపోదు.  వాటిని అచరించాలి.  లేకపోతే బోర్లించిన కుండ మీద నీరు పోసినట్లుగానే వృధా” (72) అధ్యాయం -21

అందువల్ల సాయిబాబా వారు చెప్పిన బోధనలు విషయాల వారీగా వేటికవి ఎంపిక చేసి క్రోడీకరించినట్లయితే అవి చాలా ఉపయోగంగా ఉంటాయనె నేను భావిస్తున్నాను. 

అదృష్టవశాత్తు నాకు శ్రీఅరబిందోగారు, మదర్ ఆఫ్ పాండిచేరి వీరు వ్రాసిన పుస్తకాలు లభించాయి.  అవి ధనము, ఆహారము, నిద్ర మొదలైనవాటి గురించి వ్రాసినవి.

ఆవిధంగా నేను శ్రీసాయిబాబా వారి బోధనలు, మరియు తత్వంలో ప్రతి విషయం మీద ఒక పుస్తకం కాకపోయినా కనీసం ఒక వ్యాసాన్నయినా వ్రాద్దామని భావించాను.

ఆవిధంగా నేను ప్రతి విషయం మీద వ్యాసాలు వ్రాయడం ప్రారంభించాను.  సాయిబాబా అనుగ్రహంతో (శ్రీసాయిలీల ఆంగ్ల పత్రికలో అటువంటివి 21 వ్యాసాలు ప్రచురంపబడ్డాయి).

శ్రీసాయిబాబా సంస్థాన్ షిరిడీవారు ప్రచురించే శ్రీసాయిలీల ఆంగ్ల పత్రికలలో జూలై – ఆగస్టు 1993 నుండి నవంబరు – డిసెంబరు 1995 వరకు ప్రచురింపబడ్డాయి.

ఇప్పుడు అవన్నీ కూడా, నా తమ్ముడయిన జైనేష్ ద్వారా పుస్తక రూపంలో ప్రచురింపబడ్డాయి.  సాయి భక్తునిగా చక్కటి సేవ చేశాడు.  నేనెంతో అతనికి ఋణపడి ఉన్నాను.

ఎమ్.బి.నింబాల్కర్

(రేపటి సంచికలో ‘ధనము’)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles