సాయి భక్తులతో మాట్లాడుతుండగానే సునాయాసముగా శ్వాసను విడచి సాయిని చేరిరి….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been Prepared by Mrs Lakshmi Prasanna

సాయి బాబా     …          సాయి బాబా     …         సాయి బాబా     …          సాయి బాబా

  1. Mir-17-final-breath-by-Lakshmi-Prasanna 3:46

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మస్సుపూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికీ అన్ని విధాలా నేను సహాయ పడతాను. 

సాయి సత్చరిత్ర పారాయణ.

1995 నేను శ్రీ సాయి బాబా చరిత్ర చదవలేదు.

1996  జనవరి ఒకటవ తేదీ నుండి శ్రీ అమ్ముల సాంబశివరావు గారిచే రచింపడిన బాబా జీవిత చరిత్ర సామూహిక సప్తాహ పారాయణ ప్రారంభించాను.

ఆలా 200 ల పారాయణాలు జరిగిన తర్వాత 201 వ పారాయణ నుండి శ్రీ పత్తి నారాయణ రావు గారిచే రాయబడి, సంస్థానము వారు ప్రచురించిన సాయిసత్చరిత్ర గ్రంధముతో సామూహిక సప్తాహ పారాయణములు జరుగుచున్నవి.

ఇప్పటికి 373 పారాయణములు పూర్తి అయినవి.

ఈ పారాయణలలో ఒకరు మైకు  ముందు చరిత్ర చదువుచుండగా  అందులో పాల్గున్న మిగిలినవారందరు పుస్తకములను చూచి మౌనముగా చదువుచూ వినుచుందురు.

స్త్రీలే ఎక్కువుగా పాల్గొనుచున్నారు.

ఈ పారాయణములు కొవ్వాడ, కాకినాడ పరిసరములలో ఎక్కువగా జరుగుచున్నవి.

షిర్డీ లో 9 సార్లు , కాశీలో ఒకసారి , శ్రీ శైలములో ఒకసారి, హైదరాబాద్ లో ఒకసారి అరుణాచలంలో రెండు సార్లు, విశాఖపట్నంలో ఒకసారి, అన్నవరంలో ఒకసారి సామూహిక పారాయణములు జరిగినవి.

సవంత్సరంకు ఒకసారి భారీ కార్యక్రమము జరుపుచు రాష్ట్రములో సాయి పెద్దలను ఆహ్వానించి ప్రవచన కార్యక్రమములను ఏర్పాటు చేయచుందురు.

వీరి మందిర సాయిసంస్థ ద్వారా 15 సాయి గ్రంధములు ప్రచురించబడినవి.

శ్రీ సాయి బాబా మీకు చూపిన మహిమ ఏమిటి అని అడిగితే, నేను చేసేది అంత బాబ్ మహిమే అన్నారు సుబ్బారావు గారు.

ఉద్యోగ బాధ్యతలలో కానీ, సాయి కార్యక్రమములలో కానీ, నా కుటంబ బాధ్యతలలో గాని నేను తలచినదంతా నెరవేరుచున్నది.

నీకు వేరే ఆలోచనే ఉండదు.

అంత బాబా ఆలోచనలే అని సుబ్బారావు గారు అన్నారు.

అట్టి సుబ్బారావు గారు హైదరాబాద్ లో శ్రీ కృష్ణ భగవాన్ అనువారి ఇంటి వద్ద ది. 1-5 -2013 నుండి 7-5 -2013 వరుకు సాయి సత్చరిత్ర పారాయణ చేసిరి.

షిర్డీ వెళ్లవలిసిన ప్రయాణము రద్దుచేసుకొని 8 వ తేదీ రాత్రికి కొవ్వాడ చేరిరి.

9 వ తేదీ మధ్యాహ్నము గం. 12 -00 ల వరుకు సాయి భక్తులతో మాట్లాడుతుండగానే సునాయాసముగా శ్వాసను విడచి సాయిని చేరిరి.

వారు సుఖముగా జీవన యాత్రను ముగించిరి.

కాని అసంఖ్యాకులైన సాయిభక్తులకు విరామము కలిగించిరి.

వారులేని లోటు పూడ్చ తగినది కాదు.

సాయి మార్గములో వారెన్నుకున్న బాట అందరూ కొనసాగించి వారి ఆత్మకు శాంతి చేకూర్చుదురు గాక!

ముందు భాగము

సాయి బాబా     …          సాయి బాబా     …         సాయి బాబా     …          సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మస్సుపూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికీ అన్ని విధాలా నేను సహాయ పడతాను. 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి  9704379333,

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సాయి భక్తులతో మాట్లాడుతుండగానే సునాయాసముగా శ్వాసను విడచి సాయిని చేరిరి….Audio

Maruthi

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba..Sai Baba…Sai Baba..Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba..Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba

Maruthi Sainathuni

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles