Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
This Audio prepared by Mr Sri Ram
Mir-227-సాయి భక్తుడెవరు6:00
ఈ రోజు సాయిలీల మాసపత్రిక 1980 నవంబరు సంచికలో ప్రచురింపబడిన నిజమయిన సాయిభక్తుడెవరు అనే విషయం గురించి తెలుసుకుందాము.
శ్రీసాయినాధుల వారిపై ప్రచురింపబడిన ఈ వ్యాసాన్ని మనం చాలా సులభంగా అర్ధం చేసుకోగలం. ఈ వ్యాసం ఎంతో మంది సాయిభక్తులకు మనసుకు హత్తుకొంటుందనే అనుకుంటున్నాను.
ప్రపంచంలో అన్ని మతాలలోను ఉన్న ఒకేఒక భావన. అదే “మానవ సేవే మాధవ సేవ”.
దీనిని ఎవరూ కాదనలేరు అన్నది మనకందరికి తెలిసిన విషయమే.
అయితే మానవులందరూ కూడా బంగారం లాంటి ఈ మూల సూత్రాన్ని ఎందుకని అర్ధం చేసుకోలేకపోతున్నారు. ప్రపంచంలో యిది కేవలం ఒక ముఖ్యమయిన ధర్మసూత్రంగానే మిగిలిపోయింది ఎందుకని? కారణం అజ్ఞానం తప్ప మరేమీ కాదు.
సహజ సిధ్ధంగా మానవుడు స్వార్ధపరుడు, కోరికల పుట్ట. స్వార్ధం అనేది సమాజానికి ఉపయోగపడేదిగాను, అమోదయోగ్యమయినదిగాను ఉండాలి.
దేవాలయాలకి, మసీదులకి, చర్చిలకి యింకా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవారంతా భక్తులేనా? వారంతా దైవభక్తులే అని మనం అర్ధంచేసుకుందామా?
అందరిలోను భగవంతుడున్నాడు, అందరిలో ఉన్న భగవంతుడు ఒకడే, భగవంతుడు అన్నిచోట్లా ఉన్నాడని మనం అనుకుంటున్నపుడు పుణ్యక్షేత్రాలను దర్శించడం అవసరమా? కాని,
మనకు దైనందిన జీవితం లో అనేక సమస్యలు ఉన్నాయి. భగవంతుని మీద ఏకాగ్రత, ధృఢనిశ్చయం, మన శరీరం మీద మనకే స్వాధీనం లేకపోవడం, యిటువంటి కారణాలవల్ల మనం భగవంతునికి చేరువగా చేరలేకపోతున్నాము.
ఒక సంసారిగా అది సాధ్యమయేదికాదు. కాకపోతే పుణ్యక్షేత్రాలలో మనం మనస్సును మన అధీనంలోకి తెచ్చుకొని భగవంతుని మనసారా ప్రార్ధించి పూర్తి న్యాయం చేయగలగటం కష్టమయిన విషయమేమీకాదు. *
పవిత్రమయిన ప్రదేశాలలో నలువైపుల నుంచి మనలోకి మంచి ఆలోచనలు ప్రవేశిస్తాయి.
ఎందువల్లనంటే భగవంతుని అనుగ్రహం కోసమయినా కావచ్చు లేక భగవంతుడంటే భయం వల్లనయినా కావచ్చు. అందుచేత ఈరెండు విషయాలలోను భగవంతుని పూజించడం తప్పనిసరి.
భవబంధాలన్నిటినీ త్యజించిన సన్యాసి, భగవంతుని యొక్క నిజమయిన భక్తుడని నిరూపించవచ్చు. కాని ప్రతివాడు సన్యాసి కాలేడు. అందుచేత నిజమయిన భక్తుడవాలంటే సన్యాసి అవాలనే ఆలోచనకి యిక్కడ ప్రాధాన్యత లేదు, లాభం కూడా లేదు.
విశ్వాసం, నమ్మకం ఈ రెండూ సంబంధిత భావాలు. వీటి మీద ప్రశ్నలు, చర్చలు అనవసరం. సాధారణంగా మానవులు దేవుని ముందు హృదయపూర్వకంగా తమ తమ కోర్కెలను చెప్పుకుంటూ ఉంటారు.
నిజమయిన భక్తుడు దీనిని అనుచితంగాను, అతిగాను భావించడు. ఎందుకంటే భగవంతుడు సర్వజ్ఞుడు. ఆయనకన్నీ తెలుసు. మనకేది కావాలో తెలుసు.
సాయిమహరాజ్ ఎప్పుడూ సుఖవంతమయిన జీవితాన్ని గడపలేదు. ప్రతిరోజు అయిదిళ్ళ వద్ద భిక్షమడిగేవారు. బాబా కూడా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాగే బాధలు, కష్టాలు అనుభవించారు. ఎందుకని?
జీవితం గులాబీల పానుపుకాదు. మనకు ప్రాప్తం లేని దాని గురించి మనమేమీ ఆశించకూడదు. పుట్టిన ప్రతి మానవుడు కష్టించి పని చేసి తిండి సంపాదించుకోవాలి. సాధారణంగా ప్రజలు శ్రమపడకుండా, నిజాయితీగా శ్రమించకుండా, తాము అనుకున్న ఫలితాలేమీ రాలేదని, తమ ఖర్మ అని తమను తాము నిందించుకుంటు ఉంటారు.
ఖర్మ అన్నది మనకు మనం చేసుకున్నస్వయం కృతాపరాధం. అదృష్టం కలిసి రావడమంటే మనం నిజాయితీగా ప్రయత్నం చేసినపుడు భగవంతుడు అనుగ్రహించి చేసే అధ్బుతం.
నేడు సాయి భక్తి అన్నికులాలు, మతాల వారిలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. (వ్యాప్తి చెందుతోంది.) ఇందులోని అద్బుతం ఏమిటి?
ఎవరయినా సరే ఎక్కువ ఓర్పు వహించి శ్రీసాయి సత్ చరిత్రను సమగ్రంగా చదివితే, సాయి బోధించిన సూత్రాలు చాలా సరళంగాను, ఆచరించడానికి సులభమైనవి అని అర్ధమవుతుంది.
బాబా చెప్పిన సూత్రాలను ఆచరణలో పెట్టినపుడు మానవాళికి ఎంతో మేలు కలుగుతుంది. మానవుడు భగవంతునిచే సర్వోన్నతంగా సృష్టించబడ్డాడు. మానవుని మేధస్సు భగవంతుడిని కూడా జయించేటంత శక్తికలది.
అందుకనే సాయి మనకు ప్రముఖంగా చెప్పిన సూక్తి “నాయందెవరి దృష్టో వారియందే నాదృష్టి”. తన మీదనే దృష్టి పెట్టమని బాబా ఎందుకని చెప్పారు? దీనిలోని భావం ఏమిటి? దీని గురించి ప్రతివారూ తీవ్రంగా ఆలోచించాలి.
సాయి మీదనె దృష్టి నిలపడమంటే అది సామాన్యమయిన విషయమేమీ కాదు.
దానికి ఎంతో ఏకాగ్రత, ఓర్పు, స్థిరమయిన మనస్సు, భక్తి ఉండాలి. వీటినన్నిటినీ సాధిస్తే మన సమస్యలు సగం వరకూ వాటంతటవే సమసిపోతాయి. మన జీవితం మన చేతుల్లోనే ఉండి ఆనందకరంగా సాగుతుంది.
సాయిచరిత్రను చదివి ఆయన చేసిన బోధనలను అర్ధం చేసుకోకుండా అద్భుతాలు కలగాలని కోరుకోవడమంటే, అర్ధం చేసుకోకుండా చదవడం, తిన్నది జీర్ణించుకోలేకపోవడం వంటిది.
భక్తి అనేది భూమి ఆకాశం కలిసే చోటువంటిది. భక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంతకంటే ఎక్కువగా మనం సాధించుకోగలం. దీనికి యిక ముగింపు అంటూ ఉండదు. అనగా మనలో భక్తి పెరుగుతున్న కొద్దీ ఫలితాలను కూడా ఎక్కువగా అనుభవించగలం.
వాస్తవంగా పైన చెప్పిన సందర్భంలో, సాయి భక్తులు బాబావారి అధ్బుతాలను అర్ధం చేసుకుంటే కనకబాబాను గురువులకే గురువు సమర్ధ సద్గురువుగా భావిస్తారు.
ఎన్.మశ్చిందర్ దాస్
వరంగల్
(శ్రీసాయిలీల నవంబర్ 1980)
పవిత్ర ప్రదేశాలలో, దేవాలయాలలో పవిత్రమైన వాతావరణం ఉంటుంది. దేవుని దర్శనం చేసుకున్న తరువాత కాసేపయినా ప్రశాంతంగా కూర్చుని దర్శించుకున్న దేవుని రూపాన్నే కనులు మూసుకుని చూస్తూ ఉండాలి.
ఈ రోజుల్లో మనలో ఎంతమందిమి ఈ విధంగా చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. కూర్చోవడమంటే ఎదో మొక్కుబడిగా కూర్చోవడం కాదు. ప్రశాంతమయిన మనసుతో పవిత్రమైన ఆలోచనలతో స్థిరంగా కూర్చోవాలి.
నేడు దేవాలయానికి వెళ్ళినా కూడా సెల్ పోన్లు తప్పటల్లేదు. భగవంతుని దర్శన సమయంలోనే సెల్ పోన్ల లో సంభాషణలు, బయటకు వచ్చిన తరువాత కూడా సంభాషణలు చేస్తూ ఉంటే మనలో భక్తి ఉన్నదా లేదా అనేది మనకు మనమే ఆలోచించుకోవాలి.
ఒకవేళ మన సెల్ పోన్లు ఆసమయంలో మాట్లాడకుండా ఆపివేసినా ఎవరు చేశారో, ఎందుకని చేశారో అనే విషయం మీదనే మనసు లగ్నమై ఉంటుంది. ఇక భగవంతుని మీద మనసు లగ్నం చేయగలమా? వీటిని జయిస్తే మనం మనసుని కాస్తయిన అదుపులో ఉంచుకోగలం, భక్తి మనలోకి దానంతటదే ప్రవేశిస్తుంది.ఓం సాయిరాం.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Recent Comments