ఇంకా ఏ విషయం లో నేను అడిగింది బాబా ఇవ్వకుండా లేరు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ముందు భాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై !!

వెంగల్ రావు నగర్ బాబా టెంపుల్ లో కింద రూమ్ లో ధుని,పారాయణ చేసుకోవడానికి కొంత ప్లేస్ ఉండి శిరిడీలో ద్వారకామాయి లో ఉన్నట్టుగా బండ ,బండ మీద, పెద్ద బాబా ఫోటో ఉంటుంది.నాకు ఆ ఫోటో ఎందుకో చాల నచ్చింది.
నేను టెంపుల్ కి వచ్చిన కొత్తలో ఆ ఫోటోకి ఎవరో సింపుల్ గా అలంకరణ చేసేవారు.ఒకరోజు ఒక అక్కని అడిగాను అక్క ఇలా ఫోటోకి అలంకరణ ఎవరు చేస్తారు అని.దానికి ఇక్కడ పనిచేసే అబ్బాయి చేస్తాడు అంది.మనం చేయొచ్చా అంటే ..లేదు మనల్ని ముట్టుకోనివ్వరు.వాళ్లే చేస్తారు అని చెప్పింది. అయ్యో అలాగా అనిపించింది.

కానీ నాకు ఆ ఫోటోకి కనీసం ఒక్కసారైనా ఆలా అలంకరించాలి అని అనిపించింది.బట్ వీలు కాదు అన్నారు కదా అని ఊరుకున్నాను.

వెంటనే కొన్ని రోజుల తరువాత,పని చేసే అబ్బాయి మానేసాడు.ఫోటో కి అలకరారణ లేకుండా ఆలా కొన్ని రోజుల వరకు అలాగే ఉండిపోయింది.ఎవరు కొత్తగా అలంకరించడం లేదు.

ధుని దగ్గరకు వచ్చే భక్తులు జస్ట్ ఆలా దర్శనం చేసుకుని ఆలా వెళ్లేవారు కానీ,అక్కడున్న అంత పెద్ద ఫోటో వైపు కనీసం రెండు నిమిషాలైనా చేసే వారు కాదు.నాకు చాల బాధనిపించేది.కనీసం బాబా ఫోటో ని చూడట్లేదు అని.

బాబా ఫోటోని మంచిగా అలంకరిస్తే ఆ అలంకారం చూసైనా కొంచంసేపు ఆలా బాబా పై కాన్సెన్ట్రేట్ చేస్తారు కదా.ఆలా అయినా  వాళ్ళకి కొంత సేపైనా బాబా అనుగ్రహం కలుగుతుంది అనిపించేది.ఆలా అని అలంకరణని చూస్తారు అని కాదు.

అలంకరణ కొంతమందినైనా ఆలా బాబా వైపు చూసేలా చేస్తుంది ఆలా చేయాలి. బాబాని అందరు చూడాలి.  అలా చూస్తూనే ఉండాలి ,అని నా తపన అంతే తప్ప .అలకరిస్తేనే బాబా అందంగా కనిపిస్తారు అని కాదు.ఏదో నా తపన నాది అంతే .

నేను దైర్యం చేసి,టెంపుల్ సెక్రటరీ ఆంటీ తో ఆంటీ ఈ ఫోటోకి ఇప్పటి నుండి నేను అలకరించవచ్చా అని అడిగాను. ఆ ఆంటీ కి నేనంటే మంచి ఇంప్రెషన్ ఉంది.సో,ఆలా పెట్టడానికి భక్తులకు పెర్మిషన్ ఇవ్వము.నువ్వు అడిగావు కాబట్టి సరే, మంచిగా పెట్టాలి,ఒకసారి పెట్టి చూడు,బాగా వస్తేనే మళ్ళీనెక్స్ట్ టైం పెట్టడానికి ఒప్పుకుంటారు.మంచిగా రాకుంటే ఇదే లాస్ట్.అని చెప్పింది.

నేను ఇదే చాలు అనుకుని హ్యాపీ గా బాబాకిఫోటో కి గంధము,కుంకుమతో తో అలకరించాను.అలకరించేటప్పుడు అనుకున్నా బాబా ఇదే ఫస్ట్ టైం నేను అలంకరించడం,మంచిగా వచ్చేలా చేయవా ప్లీజ్.లేదంటే ఆంటీ మల్లి నాకు ఛాన్స్ ఇవ్వరు.

నాకు మిమ్మల్ని అలంకరించడం ఇష్టం అని బాబా ఫోటో దగ్గర చెప్పాను.బాగా వచ్చింది.ఆంటీ కి నచ్చి ఇప్పటి నుండి ప్రతి బుధవారం సాయంత్రం వచ్చి నువ్వే అలంకరించు,అసలు ఇలా ఎవరికి ఛాన్స్ ఇవ్వము.కానీ,బాబా నీతో పెట్టించుకోవాలనుకుంటున్నారేమో అంది.

నాకు ఫుల్ హ్యాపీ అనిపించి ప్రతి బుధవారం సాయంత్రం ఎన్ని పనులున్నా సరే వచ్చి పెట్టడం అలవాటు ఐంది.మెల్లి మెల్లిగా సింపుల్ డిజైన్స్ నుండి బాబా కి గ్రాండ్ గా అలంకరించడం చేసేదాన్ని.అందరికి నచ్చి,ఈ మధ్య పైన ఉన్న బాబా విగ్రహం కన్నా ధునిలో బాబా ఫోటో అలంకారం తో మెరిసిపోతుంది అని నాకు కాప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు.

నాతో ఉన్న ఫ్రెండ్స్ ఏంటి బాబా నీతోనే పెట్టించుకుంటారా?మాతో పెట్టించుకోరా? అని అడిగే వారు.ఏమో బాబానే అడగండి నాకేం తెలుసు.మీకు అంతగా పెట్టాలి అనుకుంటే నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి 7 .30 అవుతుంది కదా ఆలోపు మీరు వచ్చి పెట్టండి.బాబా భక్తితో ఎవరు పెట్టిన పెట్టించుకుంటారు అని చెప్పేదానిని కానీ ఎందుకో ఆ టైం కి వాళ్ళు మర్చిపోవడమో,రాలేకపోవడమో జరిగేది.

నేను ఆఫీస్ నుండి ఆతృతగా ఎవరైనా అలకరించారేమో అని చూసి.అలకరించకుండా ఉండేసరికి హ్యాపీ గా పెట్టేసేదాన్ని.నాకు నేను బాబాని అలంకరించడం అంటే ఇష్టం.ఆలా అని ఎవరిని,నేనే పెడతాను.మీరు పెట్టొద్దు అని చెప్పను.ఆలా చేస్తే బాబాకి నచ్చదు అని అనిపించేది.

ఆలా క్రమంగా నేనే పెట్టడం అలవాటైంది.చాల సార్లు , నేను ఇలా అలకరిస్తున్నాను కానీ,బాబాకి అసలు నేను ఇలా అలంకరించడం ఇష్టమేనా? నేనే చేస్తున్నానా ?ఏదో నా మాట కాదనలేక నాతో అలకరింపచేసుకుంటున్నారా ?లేదా రియల్ గానే బాబాకు నేను అలంకరించడం ఇష్టం కాబట్టి అలకరించుకుంటున్నారా ?ఇలాంటి డౌట్స్ వచ్చేవి.

కానీ నాకు ఆలా డౌట్ వచ్చిన ప్రతీ సారి,నువ్వు అలంకరించడం నాకు ఇష్టం అన్నట్టుగా ఏదోవిదంగా నాకు తెలిసేలా చేసేవారు.అప్పుడు ఓకే బాబాకి కూడా ఇష్టం అని హ్యాపీ గా అలకరించేదాన్ని.

మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ డౌట్.మళ్ళీ బాబా ఆ డౌట్ తీర్చడం ఇలా సాగేది మా తంతు.ఇలా చాల సార్లు అయ్యాక,నాకు అడిగి అడిగి విసుగొస్తుంది కానీ బాబాకి మాత్రం నువ్వు అలంకరించడం నాకు ఇష్టం అని చెప్పడం లో ఏ మాత్రం అలుపు,ఎన్ని సార్లు అడుగుతావు?నాకు ఇష్టమే అని  చెప్పానుకదా !అని విసుగు ఎప్పుడు చూపించలేదు.ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడిప్పుడే ఆలా బాబాని అడిగి ఇబ్బంది పెట్టొద్దు అని అడగట్లేదు.

ఎందుకో నా జాబ్,మ్యారేజ్ విషయం లో తప్ప.ఇంకా ఏ విషయం లో నేను అడిగింది బాబా ఇవ్వకుండా లేరు. కొన్ని కొన్ని బాబా ఇవ్వాలనుకుంది నాకు అర్ధం కాకుండా మొండిగా వద్దు అనుకున్నా కూడా ఏదో విదంగా నా మనసు మార్చి ఇచ్చారు తప్ప, వద్దు అంటుంది కదా అని ఇవ్వకుండాను లేరు.

తరువాతి భాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “ఇంకా ఏ విషయం లో నేను అడిగింది బాబా ఇవ్వకుండా లేరు.

Sai Suresh

అద్భుతం మీ అనుభవం సాయి. మన తండ్రి సద్గురు సాయి తన బిడ్డల ప్రేమకు పరవశించి పోతారు. బాబా స్వయంగా “నాకు ప్రేమ అనే ఆకలి ఉంటుంది. నేను భక్తుల ప్రేమకోసం ఎదురు చూస్తూ ఉంటానని”. బాబా మన చిన్న చిన్న కోరికలు సైతం తీరుస్తూ చాల ప్రేమగా చూసుకుంటారు. మనం అడగకపోయినా మనకి ఏది మంచిందో అది చేస్తూనే ఉంటారు. యెంత గొప్పది బాబా ప్రేమ. అది అనుభవించి తీరవలిసిందే గాని మాటలలో చెప్పలేము.

sairam sairam

prathibha sainathuni

avunu suresh garu…baba,guruvu gari premani yenta cheppalanukunna inka migile untai..aa prema daham yeppatiki teradanipistundi manaku.anta premani chuputaru manameda.. saibaba saibaba saibaba..

సాయినాథుని ప్రణతి

మి అనుభవం చాలా బాగుంది .నేను ఈ రోజు నా ఆనందాని చెబుతాను .మీరు ప్రతి రోజు అనుభవాలు share చెస్తునారుగా అవి చదివినపుడు నా ప్రండ్ ఒకరు చెపారు నేను హెదరాబాద్ లో వపనపుడు అదే గుడిలో ఒకసారి బాబాకు అని అలంకరణలు తిసెసి అలా బాబాను చూసి ఆనందించే వాలం తరువాత మేమే స్వయంగా బాబాకు అలంకరించం అని చెపారు .అపుడు నాకు అనిపించింది .ఎకడో ఆ గుడి తెలుసుకొని హైదరాబాద్ వెలినపుడు వెలదాం అనుకునాను. ఈ రోజు నేను అడగకుండానే బాబా నాకు అమితానందాని ప్రసాదించారు .నేను ఉదయం హారతి live చుసాను బాబాను చాలా దెగ్గరగా చూపించారు .అలా బాబాను చూసి చాలా ఆనందానుభుతికి లోనయాను .తరువాత బాబాకు స్ననం చేయించి అలంకరించారు .అపుడు నా మనస్సు బాబా ప్రేమతో నిండిపోయింది .ఆ ప్రేమ ఆ ఆనందం మన తల్లి అయిన బాబా దెగ్గర కాకుండ ఇంకెవరి దెగ్గర పొందలేం అనిపింటింది నేనే బాబాకు స్వయంగా అలంకరణ చేసుకునంత ఆనందం కలిగింది .మీ అనుభవాలు చదువుతు జివితంలో నేను పోందిన ఆనందాని అనుభుతిచేందుతునాను

prathibha sainathuni

thq pranathi garu..chala happy ga undi me anubuti vinna taruvata.meku baba ante chala istam ani telisipotundi me comments chustuntune.me anubuti vinna taruvata..vengal rao nagar temple ki okasari velite malli akkadinundi ravalanipinchadu..meru hyd lone untara??

సాయినాథుని ప్రణతి

నేను కూడా మీరు పోందిన ఆనందాని గురువుగారి దెగ్గర పొందాను .నాకు మాత్రం బాబా ,గురువుగారు వేరు కాదు . గురుపౌర్ణమికి శిరిడీ వెలినపుడు గురువుగారి సమాదిని నేను నా పిల్లలు సుభ్రంగా కడిగాము .అపుడు నేను పొందిన ఆనందం అంతా ఇంతా అని చెపలేను .

prathibha sainathuni

ippudu naku kuda baba,guruvu garu veru kadu..starting lo guruvu gari gurinchi naku teliyadu kada.telusukovadaniki naku koncham time pattindandi.meru yeppati nundi guruvu gari daggaraki vastunnaru.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles