Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
అపర్ణ మరియు నేను (గిరిజా శాస్త్రి) 2001 లో షిర్డీకి వెళ్లాము. అపర్ణ యొక్క భర్త మరియు బిడ్డ కూడా మాతో ఉన్నారు. మేము సమాధి మందిరంలో తృప్తిగా బాబా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చిన వెంటనే నా అలవాటు ప్రకారం నేను సత్యనారాయణ పూజా చేయాలనుకున్నాను.
నేను పూజకు వెళ్ళాను. అపర్ణ, వాళ్ళ కుటుంబం బయట కూర్చొని ఉన్నారు. ఇప్పుడు సత్యనారాయణ పూజ వేరే హాల్ లో చేస్తున్నారు గాని ఆ రోజుల్లో మాత్రం గర్బగుడి చివరిలో సత్యనారాయణ పూజను చేసేవారు.
పూజ కోసం అందరు సిద్ధమై దీపం వెలిగిస్తూ ఉండగా నేను ఒక ముసలి వ్యక్తిని చూసాను. అతను దాదాపుగా బాబాలనే దుస్తులు ధరించి నడుచుకుంటూ వేదిక పైకి వచ్చి అందరిని గమనిస్తూ ఉన్నారు. అతను నా అంచనా ప్రకారం 90% బాబా గారే.
కాని వేదికపై ఉన్న పూజారి (ఉల్లాస్ జీ) అతన్ని అసలు గమనించట్లేదు. నేను “ఉల్లాస్ జీ, బాబా మీ ముందు నిలబడి ఉన్నారు” అని చెప్పాలని అనుకున్నాను, కానీ బాబా అని నాకు ఖచ్చితంగా తెలియదు, అతను 90% బాబా అనిపిస్తూ ఉన్న 10% అనుమానం కూడా ఉంది.
నేను అతనిని మాత్రమే చూస్తున్నాను. అతను అక్కడ పూజ చేస్తూ ఉన్న అందరిని చూస్తున్నారు మరియు నవ్వుతూ తమ కుడి చేతి ని పైకి ఎత్తి అందరిని ఆశీర్వదిస్తున్నారు. నేను అతనికి మానసికంగా కృతజ్ఞతలు తెలిపాను.
వెంటనే అతను ఎడమవైపున ఉన్న పురుషుల క్యూ లో ప్రధాన విగ్రహం వైపుగా వెళ్తున్నారు. అతను వెళ్ళిన వెంటనే నేను నా పూజ వైపు చూసేసరికి ఆశ్చర్యం! నా తోటి వారంతా తమ పూజలను పూర్తి చేసి, చివరిగా అరతిని ఇస్తున్నారు. అప్పుడు నేను కూడా త్వరగా నా పూజా ముగించి బయటకు వచ్చాను.
నేను బయటికి వచ్చినప్పుడు లోపల నేను బాబా అని తలచిన వృద్దుడు నా స్నేహితురాలు అపర్ణ కూర్చున్న వేదికపై కూర్చొని ఉన్నాడు. అపర్ణ యొక్క భర్త కూడా అతనిని బాబా అని అనుకున్నాడు మరియు అతని ఛాయాచిత్రాన్ని తీసుకోవాలని అనుకున్నారు కాని, అదే సమయంలో వారు వారిని తిడతారేమో అని కూడా భయపడ్డారు.
అపర్ణ అతనితో కొంచెం దగ్గరగా కూర్చుని అడిగారు, అప్పుడు ఫోటో తీసారు. ఆ దృశ్యం చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది.
బెంగుళూరుకు మేము తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు, సుమారు 7 సంవత్సరాల వయస్సు ఉన్న అపర్ణ కొడుకు కెమెరా నుండి రీలు బయటకు తీసి తన తల్లికి చూపించాడు. ఆమె తన అదృష్టాన్ని కోల్పోతుందని పిల్లవాణ్ణి గట్టిగ తిట్టింది. అపర్ణ యొక్క భర్త ఆ పిల్లవాడిని రెండుసార్లు కొట్టాడు, నేను ఆ పిల్లవాడిని కొట్టవద్దని వారించాను.
తర్వాత రీల్ స్టూడియోకు తీసుకోని వెళ్ళినప్పుడు స్టూడియో వ్యక్తి ఒక చిత్రం మాత్రమే చెక్కుచెదరకుండా వచ్చింది మిగిలిన అన్ని ఫోటోలు రాలేదని అన్నారు.
ఆ ఫోటోలో బాబాగారు అపర్ణ పక్కనే కూర్చొని ఉన్నారు. మేమందరం ఆశ్చర్యపోయాము ఎందుకంటే బాబా కంటే ఇతరలు ఎవ్వరూ అలాంటి అద్భుతాన్ని చేయలేరు. నిజమే కాదా?
– శ్రీమతి. గిరిజ శాస్త్రి
source: http://www.saiamrithadhara.com/mainhome.html
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- అదృష్టవంతురాలివమ్మా గురువుగారి ఫోటో కి పెర్మిషన్ వచ్చింది
- ఎప్పుడైతే బాబానే మనస్పూర్తిగా ప్రార్థించానో అపుడు ఆమెలో చలనం వచ్చింది మరియు ఆమె బాబా ఫోటో ఇచ్చి నాబిడ్డను కాపాడింది.
- బాబా చేసిన ఫోటో చమత్కారం.
- బాబా పూజల వల్లే వారికి బాగా ధన ప్రాప్తి వచ్చింది, అది మనం కూడా బాబాకి సేవ చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయని సేవ చేసాము.–Audio
- షిరిడీలో భక్తురాలికి కలిగిన అనారోగ్యాన్ని, చేతితో తీసివేసిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “కెమెరా రీలు బయటకు తీసివేసిన కూడా బాబా ఫోటో స్పష్టంగా వచ్చింది”
Maruthi
May 19, 2017 at 5:18 amSai Baba…Sai Baba