జననమరణాల గురించి బాబా భోధ



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఒకరోజు సాయిబాబా అప్పాతో “ఇవాళ మన ఊళ్లో దొంగతనం జరుగుతుంది. ఈ దొంగల తరహ విచిత్రం. ఇంట్లోని వస్తువలకేం నష్టం వాటిల్లదు. వాళ్ళ దృష్టంతా ముఖ్యమైన అసలు సరుకు పైనే ఉంటుంది. దానిని హరించుకొని తీసుకోని వెళ్ళిపోతారు. దొంగతనం చేసినట్టే కనిపించదు. అట్టి మహా గొప్ప తెలివి గలవారు. ఈ రోజు నీ మీదకు వస్తారు. అందువల్ల నువ్వెళ్ళి ధైర్యంగా ఉండు” అని చెప్పారు.

ఈ మాటలలోని గుడార్ధం అప్పాకు అసలేం అర్ధం కాలేదు. అందుచేత ఇంటి వద్ద భిల్లులను పహారా ఉంచి లోకికమైన ఏర్పాట్లు చేసి అన్ని జాగ్రత్తలను చేసుకున్నారు. పహారా వారు రాత్రి సందు గొందులన్ని జాగ్రత్తగా కాపు కాస్తున్నారు.

ఒక జామురాత్రి గడిచాక అప్పాకు వాంతులు విరోచనాలతో కలరా వ్యాధి సోకింది. అతని శరీరమంతా చల్ల బడిపోయింది. నాసిక వంకర తిరిగిపోయింది. కళ్ళు లోతుగా గుంతలు పడిపోయినవి, నాడులు సడలి పోయినవి. అతని పరిస్థితికి అందరు శోకించసాగారు.

అతని భార్య భర్త పరిస్థితిని గమనించి గాబరాపడుతూ బాబా వద్దకు మశీదుకు వెళ్ళింది. బాబా పాదాలను పట్టుకుని “బాబా! నా భర్త మమ్మల్ని వదిలి వెళ్ళిపోయేలా ఉన్నారు. విభూతినిచ్చి అయన ప్రాణాలను రక్షించండి. మహాప్రభూ! నా సౌభాగ్యనౌక సాగరంలో మునిగిపోకుండా కాపాడు తండ్రీ!” అని భోరుమని ఏడవసాగింది.

సాయిబాబా ఆమెతో “చూడు! తల్లి జన్మించిన వారికందరికీ ఏదో ఒకరోజు మరణం రాక తప్పదు. నువ్వెండుకింతగా దుఃఖపడుతున్నావు? పరమేశ్వరుడు అన్నింటి యందు అందరిలోనూ విరాజమానుడై ఉన్నాడు. జననమరణాలు పరమేశ్వరుని కళలు. యెవరూ జన్మించరు. ఎవరూ మరణించరు జ్ఞాన చక్షువులతో చూడు. నీకు కూడా అవి తప్పవు. చొక్కా పాతదై చిరిగిపోతే అయిష్టంతో దాన్ని పారవేస్తాం. అట్లే ఈ శరీరాన్ని ధరించిన ఆత్మ.

ప్రాణరూపంలో ఉన్న నారాయణుడు అతడు అక్షయుడు. నిర్వికల్పుడు. అందువల్ల బాధపడకు. పాత బొంతకు అతుకులు వేయాలని వ్యర్ధ ప్రయత్నం చేయకు అతన్ని వెళ్లిపోనివ్వు. నువ్వు అతనికి అడ్డు తగలకు. అప్పా నా కంటే ముందుగానే తన శరీరాన్ని మార్చుకోవాలని సిద్ధమయ్యాడు. అతనికి సద్గతి కల్గుతుంది. మోక్షం హస్తగతమవుతుంది. ఈ చర్మ చక్షువులకు కనిపించకుండా పోతాడు. పోనీ, మనం ఏం చేయగలం?” అంటూ ఆమెకు బాగా నచ్చ చెప్పి ఆమెను ఇంటికి పంపారు.

కొంత సమయానికి అప్పా స్వర్గస్తుడయ్యారు. రెండవ రోజు గ్రామంలో మరో ముగ్గురు కూడా మరణించారు. దాంతో అంటా భయ భీతులై బాబా వద్దకు వెళ్లారు. “బాబా! ఈ కలరా వ్యాధి బాగా ప్రబలిపోతుంది. మీరు మా ఊళ్లో ఉండి కూడా ఏం ప్రయోజనం? ఏదో విధంగా ఈ మారెమ్మను పారద్రోలే ఉపాయాన్ని ఆలోచించండి” అని మొరపెట్టుకున్నారు.

వారితో బాబా “మన షిర్డీలో ఏడుగురు మరణిస్తారు. అటు తర్వాత ఈ కలరా బాధ ఇక ఉండదని” చెప్పారు. వారు సూచించిన ప్రకారమే ఏడుగురు మరణించారు. సాయిబాబా నిజంగా ఎంతటి సమర్ధులు.  భావిష్యాన్ని యెంత చక్కగా తెలియజేసారు.

source: దాసగణు గారి రచన భక్తీసారామృత్ చాప్టర్ 31

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “జననమరణాల గురించి బాబా భోధ

sairam..sai..chalaa baagundhi..baaga raasavu.saicharitra lo vundhi..Alaage Radhakrishnamai charitra raaste baaguntundhi sai…alochinchu…babanu nuvvu and nenu kuda vedukundaamu…sradha and saburi ki best example aame…

Maruthi

Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles