కష్టాల్లో బాబా గుర్తువస్తే మార్గం అదే తెలుస్తుంది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

ఎక్కడ చూసినా ముందు,వెనక అన్ని చోట్ల సాయినే.

అది 1987సం|| నాకు మొదటిసారి బాబాను చూసే అదృష్టం కలిగింది.అప్పటి నుంచి సాయి దయవలన మా పనులు అన్నీ చక్కగా నిర్వర్తించబడుతున్నాయి.

గత 5సం|| అయింది నేను “శ్రీ సాయి లీల”బుక్ కు లైఫ్ membership తీసుకున్నాను.

1st august 2011 అనగా శ్రావణమాసం మొదటి సోమవారం మాఇంట్లో లఘురుద్ర యాగం చెయ్యాలని సంకల్పించుకున్నాము.

దానికి అనుగుణంగా ప్రొద్దున 7.30 గంటలకు మా గురువుగారు వచ్చేసారు.

నేను స్వయం పురోహితుడిని కావున బాబాగారి ఆశీర్వాదంతో అన్నీ తయారుచేసి పెట్టుకున్నాను.పూజ ప్రారంభం అయింది.

ముందు కులదేవత పూజ చేసుకున్నాను.తరువాత మా ఆరాధ్యదైవం సాయిబాబా పాదాలవద్ద శ్రీ ఫలం వుంచాము.

పూజ అవుతూవుంది నైవేద్యం బాబాకు పెట్టాలి అంతే.

అంతలో 8.30కి  ఎప్పుడూ రాని పోస్ట్ మాన్ దూతలాగా వచ్చాడు.

“శ్రీసాయిలీల” మే-జూన్ 2011 మాసం పుస్తకం తీసుకొని దత్తాత్రేయుడి రూపములో మా ఇంటి ముందు నిలబడ్డాడు.

మా ఇంటి దైవం దత్తుడు,మా ఇష్ట దైవం సాయిబాబా.ఇద్దరూ ఒకరై వచ్చారా అనిపించింది.ఇప్పటికీ నాకు గుర్తుచేసుకుంటే రోమాంచితమౌతుంది.

అది 28.7.2011 ప్రొద్దున మేము కెలషీ నుంచి హరిహరేశ్వర్ దర్శనం చేసుకొని ముంబాయి వస్తామనుకున్నాం.

ఆరోజు బాగా వాన పడుతూవుంది.కష్టం మీద అందరిని వాళ్ళ వాళ్ళ ఇళ్ళ దగ్గర దింపాను.నేను చెంబూర్ రాత్రి 10.50గంటలకు చేరాను.

చూస్తూ ఉండగానే నా ముందర మూడు అడుగులు నీళ్ళు,పూర్తిగా నీళ్ళతో నిండిపోయింది వాన వలన.

ముందర చాలా వాహనాలు ఉన్నాయి.అపుడు నా కాళ్ళ కింద భూమి కంపించిందా అనిపించింది.

నా ముందరే ఒక పెద్ద ట్రక్ వెళ్ళింది.నా మారుతి Alto బురదతో నిండిపోయింది.దారి అసలు కనపడటం లేదు.

అపుడు మనసులో అనుకున్నా “బాబా,300km నన్ను క్షేమంగా చేర్చావు,ఇప్పుడు ఈ పరీక్ష ఏమిటి స్వామీ”అని బాబాని ఎప్పుడైతే స్మరించానో అపుడే నా మనసు పని చేయడం మొదలుపెట్టింది.

నాముందు ఇంత పెద్ద ట్రక్ వెళ్ళింది,నేను ఎలా ఉండిపోయాను?ముందు దారి బాగుందేమొ.

అంతే 10 నిమిషాలలో మాఇల్లు(బాంద్రా తూర్పు) చేరుకున్నాను.

అలా ఉంటాయి బాబా లీలలు.కష్టాల్లో ఆయన గుర్తువస్తే మార్గం అదే తెలుస్తుంది.అపుడు బాబా అన్న మాటలు గుర్తువచ్చాయి“నువ్వు పాలు కావాలంటె ప్రయత్నం చేయి,నేను గిన్నె పట్టుకొని నీతోనే ఉన్నాను”.

ఇలాంటి విశ్వాసాన్నిబాబా తన భక్తులకు ఎపుడూ ఇస్తూనే ఉంటాడు.నమ్మకం మన వంతు.

బాబా ఎపుడూ శ్యామాతో అనేవారు “శ్యామా ఎవరైతే ప్రేమతో నా నామాన్ని స్మరిస్తారో వాళ్ళ కోరికలు అన్నీ తీరుస్తాను,మరియు

 వాళ్ళకి నామీద భక్తి-విశ్వాసాలు ఎక్కువ చేస్తాను.

నా చరిత్రను ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళని అన్ని దిక్కుల నుండి నేను సంరక్షిస్తాను”.

ఇపుడు బాబా మాకు చేసింది అదేగా!మీరే చెప్పండి.

నితిన్ కుమార్ మాహస్ కర్.

మహారాష్ట్ర

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles