Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా వాడు ఎంత దూరం వున్న పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాగేస్తాను అన్నారు బాబా ఒక సందర్భంలో.
బాబా అన్న ఈ మాట రోజు రోజుకు నిజం అవుతువుంది. తమిళనాడుకు చెందిన శివ ప్రియ గారి సాయి భక్తి ని చూస్తే బాబా చెప్పిన ఈ విషయం అక్షర సత్యం అని నమ్మక తప్పదు.
శివ ప్రియ అనే ఈవిడ B.E , M .Tech చదివి, H .W.C చెన్నయ్ లో పెద్ద ఉద్యోగం చేస్తూ గత 2 సంవత్సరాలలో బాబా దర్శనం కోసం 72 times శిరిడీ వెళ్లారు.
ప్రతివారం శిరిడీ సాయిబాబా దర్శనం కోసం ఈ శివప్రియ ఇంత పెద్ద ఉద్యోగం వదిలేసి చెన్నయ్ నుంచి పూనా లో TATA MOTORS లో ఉద్యోగం కోసం వెళ్ళింది.
ఈ శివ ప్రియ ప్రతి బుధవారం రాత్రి పూనా నుంచి బయలు దేరి గురువారం పొద్దున శిరిడీ చేరి “శిరిడీ మాఝే పండరీపురా” ఆరతి కి attend అవుతుంది.
బజారు నుంచి పూలమాలలు కొని 300 నుంచి 400 రూపాయలు సంస్థానం వాళ్ళకి ఇస్తుంది. ఎందుకంటే సంస్థానం Garden నుంచి వచ్చిన పూలతోనే బాబా కోసం మాలలు తయారు చేస్తారు.
తన ఉద్యోగంలో వచ్చే జీతంలో సగ భాగం మరియు 10,000 /- బాబా పూలకు వినియోగిస్తుంది. ఈ శివ ప్రియ ఇంతవరకు దగ్గర దగ్గర 3 lakhs Rupees బాబా పాదాల వద్ద వుంచి వుంటుంది.
అందరికి ఆరోగ్యం గురించి చెప్పే ఈ శివ ప్రియ శిరిడీ లో రక్తదానం కూడా చేస్తుంది.
మధ్యాహ్న హారతి, సమాధి దర్శన్ చూసుకొని మళ్ళీ పూనాకు తిరిగి వెళ్ళేది.
కానీ ఆమె కున్న Tension పెళ్లి. పెళ్లి కానీ శివ ప్రియ తనకు రాబోయే భర్త అందంగా వుండక్కరలేదు, పెద్ద Job అక్కరలేదు, Only తన కులం వాడు, తల్లిదండ్రులు చూసిన Arranged Marriage మరియు అతను పూనాలోనే వుండాలి, అనే కోరిక మాత్రం బాబా చరణాల దగ్గర ఎప్పుడు కోరుకునేది.
ఎంతో మంది మంచి వాళ్ళు , అందమైన అబ్బాయిలు మంచి ఉద్యోగంలో వున్నవాళ్ళను తన తల్లిదండ్రులు చూసిన వద్దు అనేసేది, తమ కూతురి పరిస్థితి చూసి, ఆమె తల్లిదండ్రులు చాలా వేదన పడేవాళ్ళు.
ఇలా రోజులు, సంవత్సరాలు గడుస్తున్నాయి Sudden గా ఆమె కోరిన కోరిక బాబా దయ వలన తీరింది. ఎలా అంటే చెన్నయ్ లో వుండే V Sridhar అనే M .B .A చదివిన అబ్బాయితో పెళ్లి అయింది.
పెద్దలు ఎంత బలవంతం పెట్టిన , శివ ప్రియ వినలేదు. కానీ ఆ సాయినాథునీ కృప తన నిజమైన తన భక్తులను దూరం చేయడు.
పెళ్లి అయిన కొన్ని రోజులకి శివ ప్రియ భర్తకు Sudden గా పూనా transfer అయింది. ఇంక ఆమె ఆనందానికి అవధులు లేవు. మళ్ళీ వాళ్ళు పూనా వచ్చి Settle అయ్యారు.
శివప్రియ పెళ్లి తిరుపతి లో జరిగింది. అయిన తన మొదటి వివాహ పత్రిక ద్వారకామాయి బాబాకు పంపింది.
ఈ విధంగా శివప్రియకు ఎన్నో అనుభూతులు, అనుభవాలు జరుగుతున్నాయి. ఇలా శివప్రియ సాయి ప్రియ గా మారింది.
సర్వం సాయినాధార్పణమస్తు
శివప్రియ, పూనా
ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.
Latest Miracles:
- ఆ గురుదేవులు(సాయినాథుడు) అందరికి పరీక్ష పెడతాడు. కృష్ణ ప్రియ లాంటి వాళ్ళు పరీక్షలో నెగ్గుతారు.
- బాబా మరల కృష్ణ ప్రియ కు దర్శనం ఇచ్చి నీకు త్వరలో మారకం వుంది, నేను రక్షిస్తాను
- నాకు తెలిసిన మాతాజీ కృష్ణ ప్రియ జీవిత గాధ(సాయి మయం)
- శిరిడి యాత్రకు బాబా ధన సహాయం
- అందరి కంటే గొప్ప వైద్యుడైన శ్రీ సాయికి సాధ్యం కానిది ఏముంది?
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments