సాయి నామ స్మరణతో ఇష్టమైన వ్యాపారము(ప్రిటింగ్ ప్రెస్)లో వున్న అవరోధాలను అధిగమించుట



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


దగ్గర దగ్గర 38 సంవత్సరాల క్రిందట నా వయసు 13 సంవత్సరాలు అప్పుడు మా అమ్మ – నాన్న నన్ను మొదటిసారి శిరిడీకి తీసుకెళ్ళారు.

సాయి సమాధి మందిరంలో ఆయన చరణ స్పర్శ చేసిన వెంటనే నాకు అనిపించింది. నా శరీరంలో ఎదో చైతన్య సంచారం జరిగింది.(అంత చిన్న వయసులోనే).

“సమాధి తరువాత కూడా నేను అప్రమత్తుడనే “ఈ నిజాన్ని నీవు అనుభవంతో తెలుసుకో”  సాయిబాబా యొక్క ఈ వచనాలు నాకు అనుభవం అయ్యాయి.

ఆ క్షణం నుంచి నేను మనసా, వాచా, కర్మణా సాయి సొంతం అయ్యాను.

కొన్ని సంవత్సరాల తరువాత school చదువు అయిపోయింది. శిరిడీకి వెళ్ళడం జరిగింది.

మహావిద్యాలయంలో చదివేటప్పుడు అంటే 1977 లో నేను, నా స్నేహితులతో కలసి శిరిడీ వెళ్ళడం జరిగింది. తరువాత నేను ఒక్కడినే శిరిడీ వెళ్ళాలనిపించేది.

ఒంటరిగా వెళ్తే ఏకాగ్రతగా ధ్యానం చేసుకోవచ్చు. అందువలన నాకు దైర్యసాహసాలు ఎక్కువ అయ్యాయి.

తరువాత నుంచి ప్రతి december 31 st , Jan 1 st శిరిడీకి వెళ్ళేవాడిని . 1991 లో నాకు పెళ్ళి అయింది. నా భార్య కూడా నాతొ వచ్చేది.

printing work మీద నాకు చాలా శ్రర్ధ వుండేది. అందుకే దానిలోనే నేను,  నా చదువు ముందుకు సాగించాను. దానికి సంబంధించిన printing press లోనే ఉద్యోగం వచ్చింది.

అక్కడ రమేష్, గణేష్ నా స్నేహితుల ద్వారా printer Technology నేర్చుకున్నాను. అన్నీ బాగా నేర్చుకున్నాక నేను సొంతంగా press పెట్టుకుందాం అనుకున్నాను.

నేను ఇంట్లోనే నా room లో లేస్తూనే బాబా దర్శనం కావాలని ఒక సాయి బాబా విగ్రహం పెట్టుకున్నాను. 14 మే 2001 నా జీవితమే మారిపోయింది. ఆ రోజు నా సంపూర్ణ జీవితం సాయిమయం అయిన రోజు. నా జీవితంలో మర్చిపోని రోజు ఆరోజు.

ఆ రోజు తెల్లవారి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో Room లో వున్న సాయి విగ్రహం, ఆయన పాదాల చెంత దినదర్శిక అనే పంచాంగం కనబడ్డాయి. దానిలో పంచాంగం గురించి, ఇంకా చాలా విషయాలు చదివే దానికి దొరికాయి. నా మనసులో ఏమి విచారం లేనందువలన ఇది ఎదో కలలే అనుకోని లేచాను.

తరువాత ఇలాంటి కల ఎందుకు వచ్చింది. దీనికి అర్ధం ఏమిటి అనే అనేక ప్రశ్నలు నా మనసులో తలెత్తాయి. నా స్నేహితులకు దాని గురించి చెప్పాను.

వాళ్ళు అన్నారు, ‘అరే, బాబా నీకు సంకేతం ఇచ్చారు. Press పెట్టమని, దినదర్శికా printing చేయమని” నీకు ఆ ఆలోచన ఎందుకు రాలేదు! చిన్నప్పటినుంచి అదే కదా నీ కోరిక. ఇప్పుడు బాబా స్వప్నంలో చూపించి మరీ చెప్పారు.” అని అన్నారు.

అప్పుడు నాకు అర్ధం అయింది. అప్పుడు ఆ Printing Press పెట్టి “సాయి నిర్ణయ్” అని పేరు పెట్టి పంచాంగం Printing చేయడం మొదలు పెట్టాను.

ఆ పంచాంగములో అతి ముఖ్య మైనది కాలగణనం. అది ఎలా చేస్తా అనుకునే లోపే విఖ్యాత పంచాంగా కర్త శ్రీ సోమణజీ ని కలిసాను. ఆయన నాకు సహాయం చేస్తాను అన్నారు.

శ్రీ పవార్ జీ వెంటనే సాయినిర్ణయం పంచాంగం కోసం చిత్రపటం కూడా వెంటనే తయారు చేశారు. ఇంకేముంది! బాబా అనుగ్రహంతో అన్ని ready అయిపోయినాయి. కానీ బాబా నాకు పెట్టిన పరీక్ష అయిపోలేదు. అప్పుడే మా అమ్మ స్వర్గస్తురాలైంది.

marketing లో చాలా అవరోధాలు వచ్చాయి. అయినా సాయినామ స్మరణతో అన్నీ విపత్తులు దాటి నేను దాన్ని మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ లో print చేయించాను.

దానిని ప్రతి దుకాణానికి వెళ్ళి ఇచ్చివచ్చేవాడిని. నా అదృష్టంలో ఎంతవుందో, అంతే అవుతుంది అనుకోని సాయినామస్మరణతో దాన్ని అమ్మడం మొదలు పెట్టాను. సాయి నిర్ణయ్ లాగానే, సాయి పాదయాత్ర 2003 లో మొదలు పెట్టాను.

దాదర్ లో వున్న విఠల్ వాడి నుంచి భక్తులను తీసుకొని శిరిడీ వరకు పాదయాత్ర చేసేవాడిని.

ఈ ఎనిమిది రోజులు ప్రతిక్షణం సాయిమయం. నన్ను నేను మర్చిపోయేవాడిని.

మూడు భాషల్లో వున్న “సాయి నిర్ణయం అనే పంచాంగం ఇప్పుడు నాలుగు భాషల్లో చేస్తున్నాను. ఎన్నో రకాలుగా ప్రచారం ప్రారంభించాను. ‘సాయి నిర్ణయం’ పంచాంగం మహారాష్ట్రలో పల్లె పల్లెలకు చేరింది. విదేశాల్లో వున్న వాళ్ళు కూడా నాకు లెటర్స్ రాసి తెప్పించుకుంటున్నారు.

ఇవన్ని ఒక వైపు కానీ నాకు దానికి కావలసినంత ధనం రావటం లేదు. నష్టాల్లోనే నడుస్తావుంది. కాని సాయినాధుడు ఏదో రూపంలో వచ్చి ధైర్యాన్ని కలిగిస్తున్నాడు.

అందుకే ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. లాభం లేదు అట్లని చాలా నష్టం లేదు, కాని రోజు రోజుకు సాయిబాబా మీద భక్తి విశ్వాసాలు దృఢంఅవుతున్నాయి.

అది సాయి ధనమే కదా! ఏదో ఒక రోజు లాభం రాకపోదు అని బాబా మీద నమ్మకం అంతే.

స్వరం సాయినాధార్పణమస్తు

మహేష్ ఖర్డ్,
ముంబయి.

 ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

14 comments on “సాయి నామ స్మరణతో ఇష్టమైన వ్యాపారము(ప్రిటింగ్ ప్రెస్)లో వున్న అవరోధాలను అధిగమించుట

Dillip

Very encouraging Baba’s miracle.mam..Sairam.

Madhavi

Kishoregaru..Edho.baba echesaru.printing press kosam.permission..Jai sai ram

Gautam

Baba has given permission.kishorji…Sai ram..Sir.

E Arunavalli

బాబా పై నమ్మకం ఉంటే అన్ని సఫలం అవుతాయి

Radhika J

Om sairam

Mamata

wondraful experiences.madhavi mam.sairam

kajal

devine experiences by saibaba..sairam

T.v.pramada

On Sai ram

T.V.Gayathri

Om sairam

Vidya

Wonderful!! Aum Sairam

Padmini

Om Sai Ram.

బాబా…నాకు కూడా ప్రింటింగ్ ప్రెస్ పెట్టె అవకాశం ఇచ్చి …మీ బుక్స్ పబ్లిష్ చేయించుకో బాబా…సాయి బాబా…

b vishnu Sai

Om sai ram

Krishnaveni

Sarwam Sai mayam

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles